AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hardik Pandya: ‘ఏమైనా ఉంటే ఇంట్లో చూస్కో’.. పాండ్యా దంపతులపై నెటిజన్స్ ఫైర్..

Hardik Pandya: టీమిండియా ఆల్‌రౌండర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇటీవల హార్దిక్‌తో కలిసి ఉన్న ఫోటోలను అతని భార్య నటాషా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేసింది. అయితే ఆ ఫోటోలలో బోల్డ్‌గా..

Hardik Pandya: ‘ఏమైనా ఉంటే ఇంట్లో చూస్కో’.. పాండ్యా దంపతులపై నెటిజన్స్ ఫైర్..
Hardik Pandya Nataša Stankovic
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 29, 2023 | 8:37 AM

Hardik Pandya: టీమిండియా ఆల్‌రౌండర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇటీవల హార్దిక్‌తో కలిసి ఉన్న ఫోటోలను అతని భార్య నటాషా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేసింది. అయితే ఆ ఫోటోలలో బోల్డ్‌గా వారు ప్రవర్తిస్తున్న తీరు అసభ్యకరంగా ఉందంటూ నెటిజన్లు హార్దిక్-నటాషా దంపతులను ట్రోల్ చేస్తున్నారు. ఒకరి ముద్దు కోసం మరొకరు పాకులాడుతున్నట్లుగా ఉన్న ఆ ఫోటోలకు నటాషా ‘Je t’aime’ అంటూ ఫ్రెంచ్‌లో ‘ఐలవ్‌యూ’ అనే అర్థంలో క్యాప్షన్ రాసుకొచ్చింది. నాటాషా చేసిన ఆ పోస్ట్ నెట్టింట వైరల్‌ అవుతుండగా దానిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ ఆటగాడికి ఇలాంటి ప్రవర్తన సరికాదని, భారతీయ సంస్కృతి ఇది కాదని, ఏమైనా ఉంటే ఇంట్లో చేస్కోవాలని పలువురు నెటిజన్లు హార్ధిక్ దంపతులకు హితవు పలికారు. అలాగే వీటి  కంటే వైరల్ వీడియోలు చాలా ఉత్తమనని, హార్దిక్ ముందుగా ప్రపంచకప్ మీద ఫోకస్ పెడితే బాగుంటుందంటూ కూడా మరికొందరు సూచించారు. కాగా, హార్దిక్-నటాషా దంపతులు 2020లో ఒక్కటవగా, వీరికి అగస్త్య అనే ఓ కుమారుడు ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉండగా జూలై 12 నుంచి ప్రారంభం కాబోతున్న వెస్టిండిస్ టూర్‌ టెస్ట్ సిరీస్‌లకు హార్దిక్‌కి అవకాశం లభించలేదు. అయితే వన్డే సిరీస్ కోసం అతన్ని టీమ్ వైస్ కెప్టెన్‌గా బీసీసీఐ నియమించింది. అలాగే టీ20 క్రికెట్ నుంచి రోహిత్, కోహ్లీలను బీసీసీఐ తప్పిస్తుందేమోనన్న చర్చల నేపథ్యంలో హార్ధిక్ పాండ్యా పొట్టి ఫార్మాట్‌లో టీమిండియాను నడిపించే అవకాశం ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..