World Cup 2023: ‘క్రికెట్ కార్నివల్‌లో విజేత ఆ ముగ్గురిలోనే’.. కారణంతో సహా చెప్పేసిన ‘1983’ టీమిండియా ప్లేయర్..
World Cup 2023: క్రికెట్ ప్రపంచానికి పండుగలాంటి వరల్డ్‌కప్‌కి సమయం దగ్గరపడింది. టోర్నీ కోసం షెడ్యూల్ కూడా వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రతి టోర్నీ లేదా క్రేజీ సిరీస్‌లకు ముందు మాజీ క్రికెటర్ల నుంచి అంచనాలు వ్యక్తమయినట్లే ఇప్పుడు..
World Cup 2023: క్రికెట్ ప్రపంచానికి పండుగలాంటి వరల్డ్‌కప్‌కి సమయం దగ్గరపడింది. టోర్నీ కోసం షెడ్యూల్ కూడా వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రతి టోర్నీ లేదా క్రేజీ సిరీస్‌లకు ముందు మాజీ క్రికెటర్ల నుంచి అంచనాలు వ్యక్తమయినట్లే ఇప్పుడు కూడా వినిపిస్తున్నాయి. అక్టోబర్ 5న ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్‌తో ప్రారంభమయ్యే ప్రపంచకప్ టోర్నీపై టీమిండియా మాజీ కృష్ణమాచారి శ్రీకాంత్ తన అంచనా ఏమిటో తెలియజేశాడు. 1983లో ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన శ్రీకాంత్.. టోర్నీకి ఆతిథ్యమిస్తున్న భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లలో ఏదో ఒకటి టోర్నీ విజేతగా నిలిచే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు.
శ్రీకాంత్ మాట్లాడుతూ ‘టీమిండియా నా ఫేవరెట్‌లలో ఒకటి. నిజం చెప్పాలంటే ఆస్ట్రేలియన్ జట్టు కూడా చాలా మంచి జట్టు, ఇంకా ఇంగ్లాండ్ బాగుంది. భారత్‌లో కూడా కంగారులు బాగా ఆడతారు. ఈ రెండు జట్ల నుంచి భారత్‌కి గట్టి పోటీ ఎదురుకావచ్చు. పాకిస్థాన్ కూడా బాగానే ఆడగలుగుతుంది కానీ భారత్‌లో వాళ్లు ఆడి చాలా కాలం అవుతోంది. అందుకే భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్.. ఈ మూడింటిలో ఒకటి కప్ గెలుస్తుందని నేను భావిస్తున్నా’నని పేర్కొన్నాడు.
అలాగే ‘భారత్ పిచ్‌లపై ఆడే విషయంలో ఇంగ్లాండ్ టీమ్ కంటే ఆసీస్ జట్టు మెరుగ్గా ఉంది. ఆసీస్ ప్లేయర్లు ఇక్కడ ఐపీఎల్ రూపంలో టీ20 మ్యాచ్‌లు ఆడతారు, కాబట్టి ఇక్కడి పరిస్థితులకు వారు అలవాటు పడ్డారు. ఇంగ్లాండ్ ఆటగాళ్లు కూడా ఐపీఎల్ ఆడుతున్నారు. వాళ్లకు కూడా ఇక్కడి పరిస్థితులు తెలుసు. అందుకే ఈ మూడు దేశాలే టోర్నీ విజేతగా నిలిచే అవకాశం ఉందనుకుంటున్నా’ అని చెప్పుకొచ్చాడు మాజీ దిగ్గజం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..