Pak’s Replacement in WC 2023: మెగా టోర్నీకి పాకిస్థాన్ రాకపోతే ఆ జట్టుకు అవకాశం..! నేటి నుంచే సూపర్ 6 మ్యాచ్‌లు..
ICC ODI World Cup: భారత్ వేదికగా జరిగే 2023 ప్రపంచకప్ టోర్నీకి పాకిస్థాన్ వస్తుందో లేదో అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ టీమ్ భారత్‌కి వచ్చి ఆడుతుందని అంతా ఆశిస్తున్నారు. అయితే తమ జట్టు భారత్‌కు వచ్చి ప్రపంచకప్..
ICC ODI World Cup: భారత్ వేదికగా జరిగే 2023 ప్రపంచకప్ టోర్నీకి పాకిస్థాన్ వస్తుందో లేదో అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ టీమ్ భారత్‌కి వచ్చి ఆడుతుందని అంతా ఆశిస్తున్నారు. అయితే తమ జట్టు భారత్‌కు వచ్చి ప్రపంచకప్ ఆడాలో వద్దో అనేది పాకిస్థాన్ ప్రభుత్వమే నిర్ణయిస్తుందని ఆ దేశ క్రికెట్ బోర్డ్ అంటోంది. ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్ ప్రపంచకప్ ఆడితే అంతా సవ్యంగా నడుస్తుంది. ఒక వేళ పాకిస్థాన్ టీమ్.. భారత్‌కి రాకపోతే టోర్నీలో ఏం జరుగుతుంది..? తెలుసుకుందాం..
భారత్‌లో జరిగే వరల్డ్ కప్ టోర్నీకి పాక్ జట్టు వస్తుందని ఐసీసీ విశ్వసిస్తుంది. టోర్నీకి పాకిస్థాన్ రాకపోతే 9 జట్లతోనే ప్రపంచకప్ జరిగే అవకాశం ఉంది. అయితే ఓ నివేదిక ప్రకారం.. పాకిస్తాన్ జట్టు ప్రపంచ కప్‌లో ఆడకపోతే వరల్డ్‌కప్ క్వాలిఫైయర్ టోర్నీ నుంచి 10వ జట్టును తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే పాక్ సహా 8 జట్లు ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించగా.. మిగిలిన రెండు స్థానాల కోసం క్వాలిఫైయర్ టోర్నీ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ నుంచి పాక్ తప్పకుంటే.. క్వాలిఫైయర్ టోర్నీలో టాప్ 3లో ఉన్న జట్టుకు అవకాశం వస్తుంది. అంటే పాకిస్థాన్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తే.. క్వాలిఫైయర్‌లలో మూడో స్థానం పొందిన జట్టు లాభపడుతుంది.
One of the most exciting #CWC23 clashes at the biggest cricket stadium 🏟️
🇵🇰 @TheRealPCB fans, how excited are you for the match against tournament hosts India? 🤩 pic.twitter.com/TzuZaOwCLt
— ICC Cricket World Cup (@cricketworldcup) June 27, 2023
ఇదిలా ఉండగా.. జింబాబ్వే వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్‌లో 6 జట్లు సూపర్ సిక్సెస్‌కి చేరుకున్నాయి. వాటిలో గ్రూప్ ఏ నుంచి ఆతిథ్య జింబాబ్వే, నెదర్లాండ్స్, వెస్ట్ ఇండీస్.. గ్రూప్ బీ నుంచి శ్రీలంక, స్కాట్లాండ్, ఓమన్ ఉన్నాయి. ఇంకా ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే సూపర్ సిక్సెస్ రౌండ్‌లో జింబాబ్వే, ఓమన్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.
కాగా, అక్టోబర్ 5న జరిగే ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మ్యాచ్‌తో ప్రపంచకప్ ప్రారంభమవుతుంది. గత ప్రపంచకప్ టోర్నీ విజేత ఇంగ్లాండ్, ఫైనలిస్ట్ న్యూజిలాండ్ మధ్య ఈ టోర్నమెంట్ తొలి మ్యాచ్ జరగనుండడం గమనార్హం. ఒకవేళ పాకిస్థాన్ జట్టు భారత్‌కి వస్తే.. అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో టీమిండియాతో తలపడుతుంది. క్రికెట్ ప్రపంచమంతా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మ్యాచ్‌లలో ఈ మ్యాచ్ కూడా ఒకటి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..