AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ODI World Cup 2023: టీమిండియాలో మొదలైన ‘చెపాక్’ ఆందోళన.. ‘కంగారు’ పెట్టిస్తోన్న రికార్డులు..

ODI World Cup 2023, India vs Australia: ఈ ఏడాది భారతదేశంలో జరిగిన 3-మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-1 తేడాతో గెలుచుకున్న సంగతి తెలిసిందే.

ODI World Cup 2023: టీమిండియాలో మొదలైన 'చెపాక్' ఆందోళన.. 'కంగారు' పెట్టిస్తోన్న రికార్డులు..
India Vs Australia 2023
Venkata Chari
|

Updated on: Jun 29, 2023 | 7:54 AM

Share

ODI World Cup 2023: వన్డే ప్రపంచ కప్ టోర్నమెంట్ అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. అయితే భారత జట్టు అక్టోబర్ 8న తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఇక్కడ టీమిండియాకు తొలి ప్రత్యర్థి ఆస్ట్రేలియా కావడం విశేషం. ఐసీసీ టోర్నీల్లో సాధారణంగా నాకౌట్ దశలో తలపడే రెండు జట్లు ఈసారి తొలి మ్యాచ్‌లో తలపడుతున్నాయి. విశేషమేమిటంటే.. ఈ మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరగడం.

అంటే భారత్-ఆస్ట్రేలియాలు చెపాక్ మైదానంలో 4 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ కేవలం 2 సార్లు మాత్రమే గెలిచింది. ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా జట్టు ఇదే మైదానంలో రెండుసార్లు భారత జట్టును ఓడించింది. అంటే చెపాక్ స్టేడియంలో రెండు జట్లూ సమానంగా నిలిచాయి.

వన్డే క్రికెట్‌లో ఇరు జట్లు మొత్తం 146 సార్లు తలపడ్డాయి. భారత జట్టు 54 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఆస్ట్రేలియా జట్టు 82 సార్లు విజయం సాధించింది. మరో 10 మ్యాచ్‌లు రద్దయ్యాయి.

ఇవి కూడా చదవండి

అంటే చెపాక్ స్టేడియంలో భారత జట్టుపై ఆస్ట్రేలియా జట్టు మంచి ప్రదర్శన చేస్తోంది. అంతే కాకుండా వన్డే క్రికెట్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయిస్తోంది.

అలాగే ఈ ఏడాది భారత్‌లో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-1 తేడాతో కైవసం చేసుకుంది. చెన్నై చెపాక్ స్టేడియంలో ఒక మ్యాచ్ గెలిచిన విషయం ఇక్కడ ప్రస్తావించదగ్గ విషయం. ఇన్ని కారణాల వల్ల తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు నుంచి టీమిండియాకు గట్టి సవాల్‌ ఎదురవుతుందనడంలో సందేహం లేదు.

ప్రపంచ కప్ 2023లో టీమిండియా షెడ్యూల్ ఎలా ఉందంటే..

అక్టోబర్ 8న – భారత్ vs ఆస్ట్రేలియా, చెన్నై.

అక్టోబర్ 11న – ఇండియా vs ఆఫ్ఘనిస్తాన్, ఢిల్లీ.

అక్టోబర్ 15న – భారత్ vs పాకిస్థాన్, అహ్మదాబాద్.

అక్టోబర్ 19న – భారత్ vs బంగ్లాదేశ్, పూణే.

అక్టోబర్ 22న – భారత్ vs న్యూజిలాండ్, ధర్మశాల.

అక్టోబర్ 29న – భారత్ vs ఇంగ్లండ్, లక్నో.

నవంబర్ 2న – భారత్ vs క్వాలిఫైయర్, ముంబై.

నవంబర్ 5న – భారత్ vs దక్షిణాఫ్రికా, కోల్‌కతా.

నవంబర్ 11న – భారత్ vs క్వాలిఫైయర్స్, బెంగళూరు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వాట్సప్‌లోనే మీ-సేవ సేవలు.. ప్రభుత్వం అప్డేట్
వాట్సప్‌లోనే మీ-సేవ సేవలు.. ప్రభుత్వం అప్డేట్
భారత్‌తో ఆడాలంటే ఆ మూడు షరతులు తీరాల్సిందే.. పాక్ కొత్త డ్రామా
భారత్‌తో ఆడాలంటే ఆ మూడు షరతులు తీరాల్సిందే.. పాక్ కొత్త డ్రామా
గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?
బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి
బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి
అయ్యో దేవుడా.. సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
అయ్యో దేవుడా.. సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
వారందరికీ త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ప్రభుత్వం శుభవార్త..
వారందరికీ త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ప్రభుత్వం శుభవార్త..
CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు
CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు