AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: తెలంగాణ ఉద్యోగ నియామకాలపై స్పందించిన జనసేనాని.. తగిన చర్యలు తీసుకోవాలంటూ..

Pawan Kalyan on TS Police Exam: తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక పరీక్షల్లోని తప్పులపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. వెంటనే పరీక్షల్లో తప్పులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని జనసేనాని..

Pawan Kalyan: తెలంగాణ ఉద్యోగ నియామకాలపై స్పందించిన జనసేనాని.. తగిన చర్యలు తీసుకోవాలంటూ..
Pawan Kalyan On TS Police Job Exam
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jun 27, 2023 | 9:05 PM

Share

Pawan Kalyan on TS Police Exam: తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక పరీక్షల్లోని తప్పులపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. వెంటనే పరీక్షల్లో తప్పులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని జనసేనాని కోరారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటనను కూడా విడుదల చేశారు. తన ప్రకటనలో.. గతేడాది నిర్వహించిన పోలీస్ నియామక రాత పరీక్షలో 4 ప్రశ్నలు తప్పుగా వచ్చాయని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని, పరీక్ష కీ విదుదల సమయంలోనే అభ్యంతరాలు చెప్పినా ప్రభుత్వం ఇప్పటికీ స్పందించలేదని పవన్ అన్నారు. ఇంకా తెలంగాణ నుంచి కొందరు అభ్యర్థులు మంగళవారం భీమవరంలో ఉన్న తనను కలిసి విజ్ఞాపన అందచేశారని, ప్రశ్నల్లోని తప్పులపై ఆధారాలు చూపించినా పరిగణనలోకి తీసుకోలేదని ఆవేదన చెందారని పేర్కొన్నారు.

ఆలాగే ఉద్యోగ నియామకాల్లో ఈడబ్ల్యూఎస్. రిజర్వేషన్ అంశాన్ని కూడా తన దృష్టికి తీసుకువచ్చారని, పోటీ పరీక్షల్లో ప్రతీ మార్కు ఎంతో విలువైనదని, ఆ ఒక్క మార్కే తమ జీవితాలను మార్చగలదని తన వద్దకు వచ్చిన విద్యార్థులు ఆందోళనలో ఉన్నారని జనసేన అధినేత చెప్పారు. ఇప్పటికైనా సదరు అభ్యర్థుల అభ్యంతరాలను, ఆవేదనను సానుకూల దృక్పథంతో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కి విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..