MS Dhoni: తెలుగు రాష్ట్రాల్లోని క్రికెట్ అభిమానులకు శుభవార్త.. రీరిలీజ్‌కి ‘ఎంఎస్ ధోని’ సిద్ధం.. తేదీ ఎప్పుడంటే..?
MS Dhoni-The Untold Story: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాత సినిమాల రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోల పుట్టిన రోజు సందర్భంగా వారి చిత్రాలు మళ్లీ థియేటర్లలో కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే పవన్ కల్యాణ్, మహేష్ బాబు, ఎన్‌టీఆర్, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోల..
MS Dhoni-The Untold Story: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాత సినిమాల రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోల పుట్టిన రోజు సందర్భంగా వారి చిత్రాలు మళ్లీ థియేటర్లలో కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే పవన్ కల్యాణ్, మహేష్ బాబు, ఎన్‌టీఆర్, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోల సినిమాలు రిరీలిజై అభిమానుల ఆదరణ పొందాయి. అయితే ఈ సారి ఓ దిగ్గజ క్రికెటర్ వంతు వచ్చింది. అవును, టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సమయం వచ్చేసింది. జూలై 7న మహీ బర్త్‌డే సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ‘ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’ సినిమాను రీరిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాణ సంస్థ స్వయంగా ప్రకటించింది. అయితే ఈ సినిమా స్పెషల్ షోలు హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, తిరుపతిలో మాత్రమే ఉంటాయి.
ఎంఎస్ ధోని భారత్‌ను 2011 వరల్డ్‌కప్‌లో విజేతగా నిలిపిన టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా 2016లో విడుదలైంది. ‘ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో ధోని పాత్రలో దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించగా.. సాక్షి సింగ్ ధోని పాత్రని కియారా అద్వానీ పోషించింది. అలాగే దిశపటాని, అనుపమ్ ఖేర్, భూమికా చావ్లా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
Fans gear up to celebrate the legendary MS Dhoni’s birthday!💛🏏
Join the party with a special screening of “MS Dhoni, The Untold Story” in Vizag, Vijayawada, Tirupati & Hyderabad. 🎬
Don’t miss out on this incredible tribute to our cricket icon! 🐐#MSDhoni #BirthdaySpecial pic.twitter.com/poLXVMpHIK
— Cric Bible (@CricBibleindia) June 25, 2023
కాగా, 2016 సెప్టెంబర్ 16న రిలీజైన ఈ మూవీకి బాక్సాఫిస్ వద్ద విశేష ఆదరణ లభించింది. ధోని బాల్యం నుంచి వరల్డ్ కప్ గెలుచుకునే వరకు అతని భావోద్వేగ ప్రయాణం ఎలా సాగిందనే అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లోనే రూ. 216 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..