Minister KTR: నేను చెప్పింది అబద్ధమైతే రాజకీయాలకు దూరమవుతా.. బీజేపీ, కాంగ్రెస్‌పై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖలు..
భారతదేశంలోనే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువ అన్నారు కేటీఆర్. గుజరాత్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలను దాటుకుని తెలంగాణ ముందుందని తెలిపారు. నేను చెప్పిన లెక్కల్లో తప్పు ఉందని నిరూపిస్తే.. తెలంగాణ కంటే మెరుగైన ఫలితాలు సాధించిన రాష్ట్రాన్ని చూపిస్తే.. రాజకీయాల్లో నేను పోటీ చేయనని సవాల్ చేశారు. తెలంగాణలో బీజేపీ లేదన్నారు కేటీఆర్. పొరపాటున ఒక్క చోట గెలిస్తే ఎగిరెగిరి పడుతుందని ఎద్దేవా చేశారు. వాపును చూసి బలుపు అనుకుని రెచ్చిపోతోందని విమర్శించారు. ఇక్కడ హడావుడి చేస్తే తప్పకుండా బుద్ధి చెప్తామని హెచ్చరించారు.

Minister KTR Exclusive interview: 9ఏళ్లుగా ఒకటే పాట.. నీరు, కరెంట్, పరిశ్రమల మీద మాట్లాడే స్కోప్ లేదంటూ కేంద్ర ప్రభుత్వంపై టీవీ 9 ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. 16ఏళ్లుగా రాజకీయంలో ఉన్న నాలుగు ఎలక్షన్స్‌లో పోటీ చేశా.. ప్రతి సారీ మెజార్టీ పెంచుకుంటూ పోతున్నా.. ఫస్ట్ ఎలక్షన్‌లో 171ఓట్లతో గెలిచా మొన్న ఎలక్షన్‌లో 90వేల ఓట్లతో గెలిచా.. నన్ను వద్దనుకుంటే ప్రజలు తీసుకెళ్లి చెత్తబుట్టలో పడేస్తారు కదా అంటూ ప్రశ్నించారు. ఎన్టీఆర్, ఇందిరా గాంధీ కంటే గొప్పవాడిని కాదన్నారు. రాహుల్, ప్రియాంకా గాంధీలా మమ్మల్ని కుటుంబ పార్టీ అనేదన్నారు. ఏ ఫర్ ఆదర్శ్, బీ ఫర్ బోఫోర్స్, సీ ఫర్ కామన్‌వెల్త్ అంటూ రేవంత రెడ్డే గతంలో చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ అని రేవంతే అన్నారు.. ఆ విషయం ఇప్పుడు మరిచిపోయారా అంటూ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
రూ. 50లక్షల కట్టలతో అడ్డంగా దొరికిన దొంగ, క్రిమినల్‌ని పీసీసీ ప్రెసిడెంట్‌గా మాట్లాడితే దరిద్రంగా ఉంటదన్నారు. ప్రధాని దద్దమ్మ కాకపోతే ఎందుకు అదానీ గురించి మాట్లాడడు అంటూ ప్రశ్నించారు. లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైతే ఎందుకు మాట్లాడడు.. ఒత్తిడి చేసి అదానీకి కాంట్రాక్ట్ ఇప్పించారనిశ్రీలంక ప్రభుత్వం నేరుగా ఆరోపణ చేసిందన్నారు. రూ. లక్ష కోట్లు తిన్నారని కేసీఆర్‌ని అంటారా.. ఏమైనా కామన్ సెన్స్ ఉందా అంటూ మండిపడ్డారు.
మెదడు మోకాళ్లలోకి జారిపోయి ఏది మాట్లాడినా స్కామ్ అంటారని.. రాహుల్ గాంధీ వందకు వంద శాతం కమిషన్లు తీసుకున్నాడు అని నేను కూడా అంటా.. ఏదైనా మాట్లాడితే ప్రూఫ్ ఉండాలి కదా అంటూ ప్రశ్నించారు. మా మీద వేటకుక్కలు తిరుగుతున్నాయి కదా.. కొండను తవ్వి ఎలకనైనా పట్టుకున్నారా అంటూ మరో ప్రశ్నను సంధించారు.
అమరులు చనిపోయంది సోనియా వల్ల ఆమె బలి దేవత, దుర్మార్గురాలని రేవంతే అన్నారు. 2014, 2018 మూడు పార్టీల మేనిఫెస్టోల్లో చెప్పాయి.. 111జీవో ఎత్తేస్తామని.. అన్ని పార్టీలు ఒప్పుకున్నాక.. గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్తులు తీర్మానించాకే జీవో ఎత్తేశామన్నారు మంత్రి కేటీఆర్.
ధరణిలో 99శాతం సమస్య లేదు. ఒక్క శాతం ఎక్కడైనా ఉండొచ్చన్నారు మంత్రి కేటీఆర్. ఇది వరకు లేవా భూ సమస్యలు, ఇది వరకు లేవా భూ తగాదాలు.. ఆనాడు రిజిస్ట్రేషన్ కావాలంటే డబ్బు, మ్యూటేషన్ కావాలంటే డబ్బు ధరణి వల్ల అవినీతి వ్యవస్థ రద్దైందన్నారు. పైరవీలు, భూమిని కొట్టేసే వాళ్లకే ధరణిలో ఇబ్బందులన్నారు.
ఎవరైనా ఎన్నికలకు వెళ్లేటప్పుడు పలానా గొప్ప పని చేస్తాం అంటున్నారు. కానీ కేసీఆర్‌ని దించడం లక్ష్యమేంటి.. ఇంత దిగజారిన, దిక్కుమాలిన ప్రతిపక్షాలతో కొట్లాడటం మా దురదృష్టమంటూ చమత్కరించారు. రేవంత్ రెడ్డి వ్యభిచారి అంటా.. రుజువు చేసుకుంటాడా.. జీవితంలో సిగరెట్ కూడా తాగలేదు.. నన్ను డ్రగ్స్ తీసుకున్నా అంటాడా అంటూ మండిపడ్డారు మంత్రి కేటీఆర్.
కేటీఆర్ అనే వ్యక్తి మంత్రిగా ఫెయిల్ అయ్యాడా.. మాట్లాడు.. దమ్ముంటే సిద్ధాంతాలు, విధానాల మీద మాట్లాడు.. తండ్రి తాగుబోతు, కొడుకు తిరుగుబోతు.. ఇవా మాట్లాడేది. ఆఖరికి నా కొడుకు గురించి మాట్లాడుతారు. వ్యక్తిత్వ హననం చేస్తారు.. ఇదేం రాజకీయం. ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కట్టిన మగాడు కేసీఆర్ అన్నారు. అందులో రూపాయి సాయం చేయని సన్నాసి ప్రభుత్వం కేంద్రంలో ఉందన్నారు.
పాలమూరు జిల్లాకు కొత్త ప్రాణం ఇస్తున్నది కేసీఆర్. అణువణువును తడిపి రాష్ట్రాన్ని సాగులో అగ్రస్థానంలో నడిపిన వ్యక్తి కేసీఆర్. లక్షా పదివేల కోట్లతో బుల్లెట్ రైలు అవసరమా అని గతంలో మోదీ అన్నారు. ఎవరు ఎక్కినా ఎక్కకపోయినా బుల్లెట్ రైలు అవసరమని మళ్లీ అదే మోదీ అన్నారు.
అంతా దోచుకుని పోతుంటే తలసరి ఆదాయం ఎట్లా పెరిగింది. స్కామ్‌లు చేస్తే రాష్ట్రం ఎట్లా అభివృద్ధి జరిగింది. ఇంటింటికి నీళ్లు ఇచ్చిన మగాడు కేసీఆర్ కాదా.. గజేంద్ర సింగ్ శఖావత్ పార్లమెంట్‌లో మమ్మల్ని మెచ్చుకోలేదా.. దేశాన్ని సాదుతున్న 5 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి కాదా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
మంత్రి కేటీఆర్ టీవీ 9 ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇక్కడ చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం
