Telangana: రాష్ట్రంలో అన్నిరకాల నేరాల్లో తగ్గుదల ఉంది.. డీజీపీ అంజనీ కుమార్ కీలక వ్యాఖ్యలు
ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణపై ఉన్న సైబర్ నేరాల ప్రభావాన్ని డీజీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. సైబర్ నేరాలపై కేసులు నమోదులో తెలంగాణ పోలీస్ దేశంలోనే ముందంజంలో ఉందని తెలిపారు. సైబర్ నేరాలను అరికట్టడంతో పాటు సైబర్ సెఫ్టీకి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణపై ఉన్న సైబర్ నేరాల ప్రభావాన్ని డీజీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. సైబర్ నేరాలపై కేసులు నమోదులో తెలంగాణ పోలీస్ దేశంలోనే ముందంజంలో ఉందని తెలిపారు. సైబర్ నేరాలను అరికట్టడంతో పాటు సైబర్ సెఫ్టీకి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని క్రైమ్,ఫంక్షనల్ వర్టికల్స్‌లపై పోలీస్ కమీషనర్లు, ఎస్.పీలతో డీజీపీ అంజనీ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం నేరాల నమోదు నిర్ధారిత ప్రమాణాలలోనే ఉన్నాయన్నారు. మొత్తంగా పరిశోధనలో ఉన్న కేసులు తగ్గాయని..ఫోక్సో, ఎస్సీ, ఎస్టీల కేసుల్లోను గణనీయమైన తగ్గుదల ఉందని వివరించారు.
ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పోలీస్ అధికారులు మరింత అప్రమత్తతో విధులు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా వీఐపీల పర్యటనల సందర్భంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతికూల వార్తలను ఎప్పటికప్పుడు పరిశీలించి వెంటనే వాటిపై తగు వివరణ ఇవ్వలన్నారు. తెలంగాణా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఇటీవల పెద్ద ఎత్తున అధికారులకు పదోన్నతులు కల్పించడం జరిగిందని.. ఈ అధికారులచే పౌరులకు మరింత నాణ్యమైన సేవలు అందేలా చర్యలు చేపట్టాలని సీపీ లు, ఎస్పీ లకు సూచించారు. పోగొట్టుకున్నసెల్ఫోన్లను సంబంధితులకు తిరిగి అప్పగించినందుకు కృషి చేసిన పోలీస్ అధికారులకు ఆయన ప్రశంసా పత్రం అందచేసి అభినందించారు. అలాగే కృషి బ్యాంకు డిపాజిటర్లను గుర్తించి వారిని డిపాజిట్లు అందచేసిన పోలీస్ అధికారులను కూడా డీజీపీ ప్రశంస పత్రాలతో అభినందించారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
