AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: మహారాష్ట్రలో సీఎం కేసీఆర్ రెండోరోజు పర్యటన

మహారాష్ట్రలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెండో రోజు పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన సోలాపూర్‌ పండరీపూర్‌లోని శ్రీవిఠల్‌ రుక్మిణీ ఆలయాన్ని సందర్శించి దైవ దర్శనం చేసుకుని అక్కడ ప్రత్యేక పూజలు చేశారు.

CM KCR:  మహారాష్ట్రలో సీఎం కేసీఆర్ రెండోరోజు పర్యటన
Cm Kcr
Aravind B
|

Updated on: Jun 28, 2023 | 4:37 AM

Share

మహారాష్ట్రలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెండో రోజు పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన సోలాపూర్‌ పండరీపూర్‌లోని శ్రీవిఠల్‌ రుక్మిణీ ఆలయాన్ని సందర్శించి దైవ దర్శనం చేసుకుని అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. దేశంలో రైతులంతా క్షేమంగా ఉండాలని ప్రార్థించారు. అలాగే సీఎం వెంట బీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరావు, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌రావు తదితరులు ఉన్నారు.

పలువురు మరాఠీ భక్తులు సీఎంను చూసేందుకు ఉత్సాహం చూపారు. ప్రత్యేక పూజ‌ల అనంతరం స‌మీప గ్రామంలో పార్టీ కార్యకర్తల‌తో సీఎం సమావేశమయ్యారు. అక్కడ స్థానిక నేత‌లు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం శ‌క్తిపీఠం తుల్జాపూర్ భ‌వానీ ఆల‌యానికి వెళ్లి అమ్మవారిని ద‌ర్శించుకున్న సీఎం.. ఆలయ ఉత్తరద్వారం గుండా లోపలికి వెళ్లారు. దుకాణ సముదాయాల నడుమ నడుస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్లారు. ఈ సందర్భంగా ఓ భక్తుడు ముఖ్యమంత్రికి శ్రీవిఠల్‌ రుక్మణీ ప్రతిమను బహుమానంగా ఇచ్చాడు. ఇదిలా ఉండగా సోమవారం సీఎం కేసీఆర్‌ హైద‌రాబాద్ నుంచి భారీ ర్యాలీగా మహారాష్ట్రకు వెళ్లిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..
జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..
క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?
క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?
పట్టపగలు ఇంట్లోకి చొరబడి దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?
పట్టపగలు ఇంట్లోకి చొరబడి దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?