AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lucky Zodiacs: శివుడికి ఇష్టమైన ‘శ్రావణ’ మాసంలో అదృష్ట రాశులివే.. యువకులకు, ఉద్యోగులకు..

Shravana 2023: సనాతన హిందూ ధర్మంలో శావణ మాసం ఎంతో ప్రముఖమైనది, ప్రత్యేకమైనది. ముఖ్యంగా ఆదిపురుషుడైన పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. ఆయన కోసం ప్రత్యేకంగా పూజలు, ఉపవాసాలు చేసే మాసం..

Lucky Zodiacs: శివుడికి ఇష్టమైన ‘శ్రావణ’ మాసంలో అదృష్ట రాశులివే.. యువకులకు, ఉద్యోగులకు..
Sravana Month 2023
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 26, 2023 | 7:34 PM

Shravana 2023: సనాతన హిందూ ధర్మంలో శావణ మాసం ఎంతో ప్రముఖమైనది, ప్రత్యేకమైనది. ముఖ్యంగా ఆదిపురుషుడైన పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. ఆయన కోసం ప్రత్యేకంగా పూజలు, ఉపవాసాలు చేసే మాసం ఇది. ఇక ఈ ఏడాది శ్రావణ మాసం.. జూలై 4 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే వర్షాకాల ఆరంభంలో ప్రారంభమయ్యే ఈ మాసం ఆగస్ట్ 31న ముగుస్తుంది. అయితే శివుడికి ఎంతో ఇష్టమైన ఈ మాసంలో కొన్ని రాశులకు అదృష్టం పట్టుకుంటుందని, ఫలితంగా ఆయా రాశులకు చెందినవారు సర్వ భోగభాగ్యాలను పొందుతారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అసలు ఆ అదృష్ట రాశులేమిటో, ఆయా రాశులవారికి కలిగే ఫలితాలేమిటో ఇప్పుడు చూద్దాం..

సింహ రాశి: సింహరాశివారికి శ్రావణ మాసం అనుకూల ఫలితాలను ఇస్తుంది. జీవితంలో ఊహించని లాభాలను మీరు ఈ సమయంలో అందుకుంటారు. అవివాహితులకు వివాహం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా సింహరాశికి చెందని శివభక్తులకు ఇది చాలా మంచి కాలంగా ఉండబోతుంది.

తులా రాశి: తులారాశి వారికి కూడా శ్రావణ మాసం సానుకూలంగా ఉంటుంది. ఫలితంగా మీరు తీసుకున్న ప్రతి అడుగు సఫలమవుతుంది. ఇంకా వైవాహిక జీవితంలోని గొడవలు సమసిపోతాయి. అలాగే కొత్త ఉద్యోగావకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి.

ఇవి కూడా చదవండి

వృషభ రాశి: శివుడికి ప్రీతిపాత్రమైన శ్రావణ మాసంలో వృషభరాశి నక్షత్ర జాతకంవారికి శుభఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరు ఈ సమయంలో అష్టైశ్వర్యాలను అనుభవిస్తారు. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. సుస్థిరమైన వృద్ధి కోసం వృషభరాశివారు శివ దర్శనం చేసుకోవడం మంచిదని జ్యోతిష్య, శాస్త్ర పండితులు చెబుతున్నారు.

మిథున రాశి: శ్రావణ మాసంలో అదృష్టాన్ని వరించబోతున్న మరో రాశి మిథునం. ఆగస్ట్ 31 వరకు కూడా మిథున రాశివారికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఎన్నో రకాలుగా శుభ వార్తలను వింటారు. ముఖ్యంగా ఇవి మిథున రాశివారికి చెందని ప్రేమికులకు, విద్యార్థులకు కలిసి వచ్చే కాలమంట.

ధనుస్సు రాశి: జూలై 4న ప్రారంభం కాబోయే శ్రావణ మాసం ధనుస్సురాశి వారికి కొత్త ఆదాయ మార్గాలను తీసుకువచ్చేదిగా ఉండబోతుంది. ఈ సమయంలో మీరు వ్యాపారరంగంలో నిలకడగా రాణిస్తారు. తోటివారికి సహాయం అందిచడంతో పాటు కీర్తిప్రతిష్టలను గడిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..