Rashi Phalalu(27 June): వారికి ఇంటా బయటా బాగా ఒత్తిడి పెరిగే ఛాన్స్.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు..

Horoscope Today (27 June 2023): భవిష్యత్తులో తమ జీవితంలో ఏం జరగబోతోందో.. ముందే తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. దీని కోసం ప్రపంచ వ్యాప్తంగా జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరిస్తారు. ఇవాళ ఆయా రాశుల వారికి ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి? 12 రాశుల వారి మంగళవారం దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Rashi Phalalu(27 June): వారికి ఇంటా బయటా బాగా ఒత్తిడి పెరిగే ఛాన్స్.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు..
Horoscope 27th June 2023
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jun 27, 2023 | 6:07 AM

Horoscope Today (27 June 2023): భవిష్యత్తులో తమ జీవితంలో ఏం జరగబోతోందో.. ముందే తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. దీని కోసం ప్రపంచ వ్యాప్తంగా జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరిస్తారు. ఇవాళ ఆయా రాశుల వారికి ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి? 12 రాశుల వారి మంగళవారం దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. ముఖ్యమైన పనులు పూర్తి కావడం, ఆర్థిక పరిస్థితిలో స్థిరత్వం ఏర్పడటం, పెళ్లి సంబంధం విషయం కావడం, పిల్లలు పురోగతి చెందడం వంటివి చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాల్లో సంపాదన బాగా పెరుగుతుంది. ఉద్యోగానికి సంబంధించి ఒకటి రెండు ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. బంధుమిత్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఉద్యోగంలో కొద్దిగా అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు బలం పుంజుకుంటాయి. నిరుద్యోగులు శుభవార్త వినడం జరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూల పడతాయి. కొద్ది ప్రయత్నంతో మీకు రావలసిన డబ్బులు చేతికి అందుతాయి. ప్రస్తుతానికి ఎవరికీ హామీలు ఉండవద్దు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వ్యక్తిగత పురోగతికి, వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. రావలసిన డబ్బు చేతికి అందటం, మొండి బాకీలు వసూలు కావడం, అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం కావడం వంటివి జరగ వచ్చు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. సహచరులు బాగా సహ కరిస్తారు. డాక్టర్లు లాయర్లు పురోగతి సాధిస్తారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి ఉద్యోగాలు ఉత్సాహంగా ప్రోత్సాహకరంగా సాగిపోతాయి కానీ కుటుంబ జీవితంలో అను కోని చికాకులు తలెత్తే అవకాశం ఉంది. కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం, మాట్లాడడం మంచిది. బంధువుల ప్రమేయంతో పెళ్లి సంబంధం నిశ్చయం కావచ్చు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. స్వయం ఉపాధి, వ్యాపారాలలో లాభాలు మెరుగుపడే అవకాశం ఉంది. ఆరోగ్యానికి సమస్యేమీ ఉండదు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

అనుకోకుండా చిన్నపాటి అదృష్టం కలిసి వస్తుంది. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటుంది. ఉద్యోగ జీవితం చాలా వరకు సాఫీగా సాగిపోతుంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. విదేశాలలో ఉంటున్న పిల్లల నుంచి శుభవార్తలు వినడం జరుగుతుంది. వృత్తి వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో లాభాలు పండిస్తాయి. ఉద్యోగ జీవితంలో ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలతో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆహార విహారాల్లో వీలైనంతగా జాగ్రత్తలు పాటించడం మంచిది. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబంలో ఒకరికి స్వల్ప అనారోగ్యం సంభవించే అవకాశం ఉంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాలు చాలా వరకు ప్రోత్సాహకంగా, ఆశాజనకంగా సాగిపోతాయి. సంపాదన పెరుగుతుంది. వ్యాపారాలలో కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఖర్చులకు కళ్ళెం వేయటం మంచిది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నం తప్పకుండా సఫలం అవుతుంది. ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం శ్రేయస్కరం కాదు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

అర్ధాష్టమ శని కారణంగా ముఖ్యమైన పనులు ఆలస్యం కావడం, మధ్య మధ్య ఆరోగ్యపరంగా ఇబ్బందులు తలెత్తడం, పని భారం పెరగడం వంటివి జరిగే అవకాశం ఉంటుంది. అయితే, అటు ఉద్యోగ జీవితం, ఇటు కుటుంబ జీవితం చాలా వరకు ప్రశాంతంగా సాగిపోతాయి. ఉద్యో గంలో మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగు లకు చిన్నపాటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి జీవితం సాఫీగా సాగిపోతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఆదాయం బాగానే ఉంటుంది. కొందరు మిత్రులకు సహాయ పడటం జరుగు తుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఉద్యోగంలో అధికారులు, సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు ఇతర వృత్తి నిపుణులకు సంపాదన బాగా పెరుగుతుంది. శుభవార్తలు వినడం జరుగుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా పరవాలేదనిపిస్తుంది. ఒకటి రెండు శుభవార్త వినడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం వంటివి జరుగుతాయి. స్నేహ సంబంధాలు పెరుగుతాయి. బంధు మిత్రులకు సహాయం చేయడం జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలు సఫలం కావచ్చు. స్నేహితులతో కలిసి ఒక విందులో పాల్గొంటారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగ పరంగా ఏదైనా సమస్యలు లేదా ఇబ్బందులు ఉన్న పక్షంలో అవి దూరం అయ్యే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా ఆనందంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో పని భారం పెరిగే అవకాశం ఉంది. బంధువులకు సంబంధించిన ఒక సమస్యను పరిష్కరించడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆర్థికంగా కలిసి వచ్చే సమయం ఇది. ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. సొంత పనుల మీద దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో సానుకూలంగా మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి రంగంలోని వారు బాగా బిజీ అవడం జరుగుతుంది. వ్యాపారులు కొద్ది లాభాలతో సంతృప్తి పడవలసి వస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

నోట్: ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..

ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే