AP Rains: బీ అలెర్ట్..! ఈ జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు ఉరుములు పడే ఛాన్స్..

రుతుపవనాల ఉత్తర పరిమితి ఇపుడు ముంద్రా, మెహసానా, ఉదయపూర్, శివపురి, సిద్ధి, చైబాసా, హల్దియా, పాకూర్, సాహిబ్‌గంజ్, రాక్సాల్ గుండా కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపోస్పిరిక్ స్థాయిలలో నైరుతి/ పశ్చిమ గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో..

AP Rains: బీ అలెర్ట్..! ఈ జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు ఉరుములు పడే ఛాన్స్..
Thunderstorms Alert
Follow us

|

Updated on: Jun 26, 2024 | 2:16 PM

రుతుపవనాల ఉత్తర పరిమితి ఇపుడు ముంద్రా, మెహసానా, ఉదయపూర్, శివపురి, సిద్ధి, చైబాసా, హల్దియా, పాకూర్, సాహిబ్‌గంజ్, రాక్సాల్ గుండా కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపోస్పిరిక్ స్థాయిలలో నైరుతి/ పశ్చిమ గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

—————————————- రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :- ———————————-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :- ————————————

ఈరోజు, రేపు, ఎల్లుండి:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40 -50 కిమీ వేగంతో వీచే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :- ——————————–

ఈరోజు, రేపు:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురుగాలులు గంటకు 40 -50 కిమీ వేగంతో వీచే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

ఎల్లుండి:-

తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40 -50 కిమీ వేగంతో వీచే అవకాశం ఉంది.

రాయలసీమ :- —————-

ఈరోజు, రేపు:-

తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30 -40 కిమీ వేగంతో వీచే అవకాశం ఉంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30 -40 కిమీ వేగంతో వీచే అవకాశం ఉంది.

ఇది చదవండి: జాతిరత్నం అండీ బాబూ.. వీడి ఆన్సర్ పేపర్ చూస్తే స్టన్ అవ్వాల్సిందే

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..