AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aarogyasri: ఈ వ్యాధులకు కూడా ఆరోగ్యశ్రీ వర్తింపు.. రూ.50 కోట్లతో మానసిక వైద్యశాల నిర్మాణం

Aarogyasri: ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత పేదల కోసం ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. నిరుపేదలకు..

Aarogyasri: ఈ వ్యాధులకు కూడా ఆరోగ్యశ్రీ వర్తింపు.. రూ.50 కోట్లతో మానసిక వైద్యశాల నిర్మాణం
Deputy Cm Amzath Basha
Subhash Goud
|

Updated on: Sep 13, 2022 | 2:52 PM

Share

Aarogyasri: ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత పేదల కోసం ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. నిరుపేదలకు వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు పడకుండా వారికి మెరుగైన వైద్య సేవలు అందే విధంగా చేస్తున్నారు. ఎన్నో వ్యాధులకు ఆరోగ్యశ్రీ వర్తించేలా చర్యలు చేపట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఇటీవలే మానసిక వ్యాధులకు కూడా ఆరోగ్యశ్రీ వర్తించేలా చర్యలు తీసుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా తెలిపారు.

విజయవాడలో డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి నిర్వహిస్తున్న ఇండ్లాస్ విమ్ హాన్స్ మానసిక వైద్యశాలను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాయలసీమ ప్రాంత వాసులు మానసిక వ్యాధులకు చికిత్స పొందేందుకు ఇప్పటి వరకు ఆస్పత్రి అందుబాటులో లేదని, ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ కింద ఎన్నో వ్యాధులు అందుబాటులోకి వచ్చాయని ఆయన పేర్కొన్నారు. దీంతో కడప రిమ్స్‌లో రూ. 50 కోట్లతో 100 పడకల మానసిక వ్యాధుల ఆస్పత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారని వెల్లడించారు. వచ్చే మార్చి నాటికి ఈ ఆస్పత్రి అందుబాటులోకి వస్తుందని, పేద ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. తమ జిల్లాకు చెందిన డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, డాక్టర్ విశాల్ రెడ్డి నాలుగు దశాబ్దాల కిందటే విజయవాడలో మొదటి మానసిక వ్యాధుల ఆస్పత్రి స్థాపించి, ఈ ప్రాంతం వారికి సమర్ధమైన సేవలు అందించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి తాను రచించిన ఎమోషనల్ ఇంటలిజెన్స్ పుస్తకాన్ని ఉప ముఖ్యమంత్రికి అందచేశారు.

కాగా, వైసీసీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్‌ మెరుగైన వైద్యం అందే విధంగా నూతన ఆస్పత్రులకు శ్రీకారం చుట్టారు. నిరుపేదలు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకున స్థోమత లేని కారణంగా ప్రభుత్వ ఆస్పత్రులను నిర్మిస్తున్నారు. వారు మెరుగైన సేవలు అందే విధంగా తగినంత వైద్య సిబ్బందిని నియమిస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి