AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupati: భర్తపెట్టే బాధలు భరించలేక 65 కి.మీ నడిచివెళ్లిన నిండుగర్భిణీ..అర్ధరాత్రి ప్రసవం

భరించేవాడు భర్త అంటారు..కానీ, బాధలు పెట్టే మొగుడ్ని భరించలేక ఓ ఇల్లాలు పుట్టింటి బాటపట్టింది. తన బాగోగులు చూడకుండా, మద్యానికి బానిసైన భర్త పెట్టే వేధింపులు తాళలేకపోయింది. రోజూ నరకయాతన అనుభవిస్తూ అతడితో కలిసి ఉండలేక కాలు బయటపెట్టింది. తిరుపతి నగరానికి చెందిన వర్షిణీ అనే ఓ నిండు గర్భిణీ...

Tirupati: భర్తపెట్టే బాధలు భరించలేక 65 కి.మీ నడిచివెళ్లిన నిండుగర్భిణీ..అర్ధరాత్రి ప్రసవం
Pregnant Woman
Jyothi Gadda
|

Updated on: May 15, 2022 | 8:43 PM

Share

భరించేవాడు భర్త అంటారు..కానీ, బాధలు పెట్టే మొగుడ్ని భరించలేక ఓ ఇల్లాలు పుట్టింటి బాటపట్టింది. తన బాగోగులు చూడకుండా, మద్యానికి బానిసైన భర్త పెట్టే వేధింపులు తాళలేకపోయింది. రోజూ నరకయాతన అనుభవిస్తూ అతడితో కలిసి ఉండలేక కాలు బయటపెట్టింది. తిరుపతి నగరానికి చెందిన వర్షిణీ అనే ఓ నిండు గర్భిణీ… చేతిలో చిల్లి గవ్వ లేకున్నా తనకు పుట్టబోయే బిడ్డ క్షేమం కోసం భర్తను వదిలి కాలినడకన పుట్టింటికి పయనమైంది. భర్త నుంచి ఎలాగైనా పక్కకి వచ్చేయాలని భావించింది. పుట్టబోయే బిడ్డకు క్షేమంగా జన్మనివ్వాలని అనుకున్న ఆ తల్లి ప్రేమతో…తిరుపతి నుండి విశాఖపట్నంలోని తన పుట్టింటికి బయల్దేరింది. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా.. రెండు రోజుల క్రితం తిరుపతిలో బయల్దేరి మధ్య మధ్యలో ఊళ్లలో ఆగుతూ 65 కిలో మీటర్లు కాలినడకన నాయుడుపేట బస్టాండ్‌ సమీపానికి చేరుకుంది.

ఈ క్రమంలోనే ఆమెకు వున్నట్లుండి పురిటి నొప్పులు మొదలయ్యాయి. అక్కడ ఆమెకు ఎవరూ తెలీదు. ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాని పరిస్థితి..అయిన వారెవరూ అండగా లేని పరిస్థితి… రోడ్డుపైనే నిల్చుండిపోయింది. తనకు ఎవరైనా సాయం చేయాలంటూ వచ్చి పోయే వాహనాలను ఆపింది. ఎవరూ ఆగలేదు… ఆమెను పట్టించుకోలేదు. పుట్టబోయే బిడ్డను రక్షించుకోవాలనే తపనతో ఇంతలో అక్కడ కనిపించిన ఓ వ్యక్తిని అన్నా అంటూ రోదిస్తూ తన పరిస్థితిని చెప్పింది. స్పందించిన ఆ యువకుడు 108 వాహనానికి సమాచారం ఇచ్చాడు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించే క్రమంలో నొప్పులు మరింత ఎక్కువయ్యాయి. పరిస్థితిని గమనించిన 108 సిబ్బంది ఆమెకు వాహనంలోనే పురుడు పోశారు. దేవుడి దయ, స్థానికుల మానవత్వం, 108 సిబ్బంది ముందు చూపుతో వర్షినీ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డ క్షేమంగా వున్నారు. వర్షిణిని చూసి సిబ్బందికి కడుపు తరుక్కుపోయింది. తమ ఇళ్ల నుంచి దుస్తులు తెప్పించి తల్లికి, బిడ్డకు ఇచ్చారు. రెండు రోజులుగా సరైన తిండి లేక నీరసంగా ఉన్న ఆమెకు స్థానికులే మంచి ఆహారం తినిపించారు. అనంతరం స్థానిక ఆసుపత్రికి తరలించారు. పుట్టిన శిశువు బరువు తక్కువగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

విశాఖపట్నం దగ్గరలోని తుని ప్రాంతానికి చెందిన తాను భర్తతో కలిసి బేల్దారి కూలి పనుల కోసం తిరుపతి కి వెళ్లినట్లు వర్షిణీ చెప్పింది. నిండు గర్భంతో వున్నా భర్తతో కలిసి తాను కూడా బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారమని, కానీ నిత్యం భర్తతో గొడవలతో విసుగు చెంది చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా,… రెండు రోజుల కిందట తిరుపతిలో బయలుదేరి మధ్యమధ్యలో ఊళ్లలో ఆగుతూ కాలినడకన నాయుడుపేట వచ్చినట్లు బాధితురాలు వర్షిణీ చెబుతోంది.

Tirupati: గంగమ్మ జాతరలో అద్భుత ఘట్టం..టీటీడీ నుండి అమ్మవారికి అందిన సారె..వెంకన్న వేషధారణలో తిరుపతి ఎంపీ

IPL Betting: ఐపీఎల్‌ బెట్టింగ్‌..హైదరాబాద్‌ టూ పాకిస్థాన్‌..మధ్యలో ప్రభుత్వాధికారులు, పలువురు పెద్దలు

Jim Green: అతి త్వరలోనే మనుషులు ఏలియన్స్‌ని కలుసుకుంటారు..నాసా మాజీ శాస్త్రవేత్త షాకింగ్‌ కామెంట్స్‌!

Cyber Fraud: సోషల్‌ మీడియా వినియోగదారులకు హెచ్చరిక..! మర్చిపోయి కూడా అలా చేయ్యొద్దు..!!

Telangana: నీ ఉద్యోగం ఉండాలంటే నేను మీ ఇంటికి రావాలి…! మహిళ ఉద్యోగికి ఎదురైన షాకింగ్‌ సీన్‌

Trees Plantation : చనిపోయిన అమ్మకోసం ఓ లాయర్‌ కొడుకు గిఫ్ట్‌..పాతికేళ్లనాటి మామిడి చెట్టును కూకటి వేళ్లతో పెకిలించాడు..!

US coast: సముద్ర తీరంలో భారీ తిమింగలం కళేబరం…స్థానికుల్ని స్థలం ఖాళీ చేయించిన పోలీసులు..దాని పొట్ట నిండా అవే..!

Mistery village: సైన్స్‌కు సాధ్యం కాని అంతు చిక్కని రహస్యం.. 12 ఏళ్లుగా అబ్బాయిలే పుట్టని ఊరు..! ఎక్కడంటే..

Ananthapur: చిరుతను ఉరికించి ఉరికించి తరిమేసిన కుక్కలు, ఇంటర్‌ వీడియో కాదు..ఇది లైవ్‌ సీన్‌