Andhra Pradesh: ఆదివాసీలకు తప్పని డోలి తిప్పలు.. వైద్యం కోసం 3 కిలోమీటర్లు డోలిలో గర్భిణీ తరలింపు..!
అల్లూరి జిల్లాలో మారుమూల ప్రాంతాల గిరిజనులకు డోలి కష్టాలు తప్పడం లేదు. రహదారి సౌకర్యం లేక.. అత్యవసర సమయాల్లో వాహనాలు రాక డోలి కడుతున్నారు గిరిజనులు. తాజాగా నిండు గర్భిణీకి డోలి మోసారు. పెదబయలు మండలం మూలలోవకు చెందిన పార్వతమ్మకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. సుఖ ప్రసవం అవుతుందేమోనని కుటుంబ సభ్యులు భావించ్చారు. కానీ పరిస్థితి అలా లేదు. ఆసుపత్రికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. అయితే.. ఆ గ్రామానికి రోడ్డు లేదు. దీంతో వాహన..
అల్లూరి, డిసెంబర్ 10: అల్లూరి జిల్లాలో మారుమూల ప్రాంతాల గిరిజనులకు డోలి కష్టాలు తప్పడం లేదు. రహదారి సౌకర్యం లేక.. అత్యవసర సమయాల్లో వాహనాలు రాక డోలి కడుతున్నారు గిరిజనులు. తాజాగా నిండు గర్భిణీకి డోలి మోసారు. పెదబయలు మండలం మూలలోవకు చెందిన పార్వతమ్మకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. సుఖ ప్రసవం అవుతుందేమోనని కుటుంబ సభ్యులు భావించ్చారు. కానీ పరిస్థితి అలా లేదు. ఆసుపత్రికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. అయితే.. ఆ గ్రామానికి రోడ్డు లేదు. దీంతో వాహన సౌకర్యం ఆ గ్రామానికి లేదు. ఇక చేసేది లేక గర్భిణీకి డోలి కట్టారు. రాళ్లు, రప్పలు, వాగులు దాతుకుంటూ 3 కిలోమీటర్లు నడిచారు. డోలిమోతతో ఆసుపత్రికి తరలించారు. తమకు రహదారి సౌకర్యం కల్పించి కష్టాలు తీర్చాలని గ్రామస్థులు కోరుతున్నారు.
అనంతపురం: సూసైడ్ లేఖ రాసి ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఆత్మహత్యాయత్నం
సీపీఎస్ రద్దు చేయలేదన్న ఆవేదనతో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా పెన్నఅహోబిలంలో ఆదివారం (డిసెంబర్ 10) చోటుచేసుకుంది. జిల్లాలోని ఉరవకొండ మండలం చిన్న ముస్తూరుకు చెందిన మల్లేశ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. జీతం సమయానికి అందడం లేదనీ, సీపీఎస్ రద్దు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ 5 పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తన చావుకు ముఖ్యమంత్రి జగనే కారణమంటూ సూసైడ్ లేఖలో రాసి.. దానిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. అనంతరం సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ చేసి పెన్నఅహోబిలం ఆలయం పరిసరాల్లో పాయిజన్ సేవించాడు. గమనించిన స్థానికులు ఉపాధ్యాయుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మల్లేశ్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.