Andhra Pradesh: అక్కడ అడుగుపెట్టాలంటే పర్మిషన్‌ తీసుకోవాల్సిందే.. లక్కీ లీడర్‌కు మొదలైన కష్టాలు..

రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదని పెద్దలు ఊరికే అనలేదు. ఆ నియోజకవర్గంలో ఆ అధికార పార్టీ నాయకుడిని చూస్తే ఆ మాట నూరుపాళ్లు నిజమనిపిస్తుంది. సాధారణ కాంపౌండర్ నుంచి పార్టీ అధినాయకుడి అండదండలతో ఎమ్మెల్సీ స్థాయికి ఎదిగారు ఆయన. కాని, ఏమైందో ఏమో ఇప్పుడు ఆ లక్కీ లీడర్‌కు ట్రబుల్స్‌ మొదలయ్యాయి. ఎక్కడి నుంచైతే ఎమ్మెల్యే పోటీ చేయాలనుకున్నారో ఇప్పుడు ఆ ఊళ్లో అడుగుపెట్టాలంటే మరో నాయకుడి పర్మిషన్‌ తీసుకోవాల్సిన పరిస్థితి..

Andhra Pradesh: అక్కడ అడుగుపెట్టాలంటే పర్మిషన్‌ తీసుకోవాల్సిందే.. లక్కీ లీడర్‌కు మొదలైన కష్టాలు..
YSRCP
Follow us

|

Updated on: Dec 10, 2023 | 5:51 PM

రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదని పెద్దలు ఊరికే అనలేదు. ఆ నియోజకవర్గంలో ఆ అధికార పార్టీ నాయకుడిని చూస్తే ఆ మాట నూరుపాళ్లు నిజమనిపిస్తుంది. సాధారణ కాంపౌండర్ నుంచి పార్టీ అధినాయకుడి అండదండలతో ఎమ్మెల్సీ స్థాయికి ఎదిగారు ఆయన. కాని, ఏమైందో ఏమో ఇప్పుడు ఆ లక్కీ లీడర్‌కు ట్రబుల్స్‌ మొదలయ్యాయి. ఎక్కడి నుంచైతే ఎమ్మెల్యే పోటీ చేయాలనుకున్నారో ఇప్పుడు ఆ ఊళ్లో అడుగుపెట్టాలంటే మరో నాయకుడి పర్మిషన్‌ తీసుకోవాల్సిన పరిస్థితి.. వైసీపీ ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్‌ది గత కొంత కాలంగా పట్టిందల్లా బంగారంగా ఉండేది. ఎవరూ ఊహించని పదవులు ఆయనను వరించాయి. ఎమ్మెల్సీగా కూడా ఆయనకు అవకాశం లభించింది. ఆయనను పాలకొల్లు నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌గా కూడా వైసీపీ నియమించింది. వచ్చే ఎన్నికల్లో పాలకొల్లు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేది తానేనని కౌరు శ్రీనివాస్‌ జోరుగానే ప్రచారం చేసుకున్నారు. ఇక రాజకీయాల్లో ఆయనకు తిరుగులేదని అంతా అనుకున్నారు. అయితే, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. వైసీపీ నాయకత్వం ఇప్పుడు కౌరు శ్రీనివాస్‌ను పక్కన పెట్టేసింది. పాలకొల్లు నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌గా తప్పించింది. ఆయన స్థానంలో కొత్త వారికి ఆ బాధ్యతలు అప్పగించింది. అంతే అయితే బాగుండేది. కాని. కష్టాలు కూడబలుక్కొని వస్తాయన్నట్టు పాలకొల్లు నియోజకవర్గంలో కొత్త ఇన్‌ఛార్జ్‌ అనుమతి లేకుండా తిరగొద్దని కౌరు శ్రీనివాస్‌ను పార్టీ నాయకత్వం ఆదేశించింది. దీంతో ఇప్పుడు ఆయన నియోజకవర్గంలో అడుగుపెట్టడం మానేశారు. ఈ అనూహ్య పరిణామాలతో కౌరు శ్రీనివాస్‌ అనుచరగణం అవాక్కైంది.

ఒక సాధారణ కంపౌండర్‌ అయిన కౌరు శ్రీనివాస్‌ – వైసీపీలో సామాన్య కార్యకర్త నుంచి అంచలంచెలుగా ఎదిగారు. ఆచంట నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరించారు. ఆ తర్వాత పాలకొల్లు నియోజకవర్గం ఇన్చార్జిగా ఉన్నారు. జడ్పిటీసీగా, జడ్పీ చైర్మన్‌గా ఎదిగారు. అటునుంచి ఎమ్మెల్సీ పదవి అందుకున్నారు. పాలకొల్లు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిని ఢీకొనేందుకు బలమైన బీసీ సామాజికవర్గానికి చెందిన కౌరు శ్రీనివాస్‌ను నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌గా నియమించింది వైసీపీ నాయకత్వం. ఇక వచ్చే ఎన్నికల్లో పాలకొల్లు నుంచి పోటీ చేసేది తానేనని కౌరు శ్రీనివాస్‌ చెప్పుకున్నారు కూడా.

ఇప్పుడు కౌరు శ్రీనివాస్‌ను పక్కన పెట్టి కొత్త ఇంచార్జ్‌ను నియమించడం వెనుక ఆంతర్యం ఏమిటో ఎవరికి అర్థం కావడం లేదు. టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడిని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో, సొంత పార్టీ నాయకులను కలుపుకొని ముందుకు ముందుకు వెళ్లడంలో కౌరు శ్రీనివాస్‌ విఫలమయ్యారనే మాటలు వినపడుతున్నాయి. అదిగాక ఆర్థికంగా అంత బలమైన అభ్యర్థి కాకపోవడంతో ఆయనను పార్టీ అధిష్టానం పక్కన పెట్టి ఉండవచ్చని పార్టీలో కొందరు అంటున్నారు. ఆయన అలవాటులే ఆయన రాజకీయ పతనానికి కారణమయ్యాయని వైసీపీలో ఆయన వ్యతిరేక వర్గం ప్రచారం చేస్తోంది.

ఇక కొత్తగా పాలకొల్లు నియోజకవర్గ ఇంచార్జ్ నియమితులైన గుడాల గోపికి టికెట్ వస్తుందా అంటే అది డౌటే అనే మాటలు వైసీపీలో వినిపిస్తున్నాయి. త్రిముఖ పోటీలో ఫ్యాన్ గాలికి ఎదురోడ్డి గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడికి ఇప్పుడు టీడీపీ -జనసేన పార్టీలు కలవడంతో ఆయన్ను ఎదుర్కోవడం అంత ఆషామాషీ కాదనే అభిప్రాయం అధికార పార్టీలో ఉంది. ఆర్ధికంగా, సామాజికవర్గంపరంగా బలమైన నాయకుడైన ఎమ్మెల్యే నిమ్మలను ఎదుర్కొవడం కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన గుడాల గోపి వల్ల కాదని వైసీపీ అదీష్టానం సర్వేలలో వెల్లడైనట్టు తెలుస్తోంది. దీంతో కాపు సామాజికవర్గానికి చెందిన గుణ్ణం నాగబాబుకు పాలకొల్లు ఇంచార్జ్ పదవి కట్టబెట్టి శెట్టిబలిజ సామాజికవర్గం ఎక్కువున్న ఆచంట నియోజకవర్గానికి పాలకొల్లు ఇంచార్జ్ గుడాల గోపిని పంపే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
చెలరేగిన శ్రేయస్, వెంకటేశ్‌..హైదరాబాద్ చిత్తు.. ఫైనల్‌కు కోల్‌కతా
చెలరేగిన శ్రేయస్, వెంకటేశ్‌..హైదరాబాద్ చిత్తు.. ఫైనల్‌కు కోల్‌కతా
RCBకి శుభవార్త.. ఆ స్టార్ ప్లేయర్ లేకుండానే బరిలోకి దిగనున్న RR
RCBకి శుభవార్త.. ఆ స్టార్ ప్లేయర్ లేకుండానే బరిలోకి దిగనున్న RR
రక్తంతో కింగ్ కోహ్లీ చిత్ర పటం.. ఫ్రేమ్ కట్టించి మరీ.. ఫొటోస్
రక్తంతో కింగ్ కోహ్లీ చిత్ర పటం.. ఫ్రేమ్ కట్టించి మరీ.. ఫొటోస్
బైక్‌పై పారిపోతున్న దొంగను లంబోర్గిని కారుతో వెంబడించిన యజమాని
బైక్‌పై పారిపోతున్న దొంగను లంబోర్గిని కారుతో వెంబడించిన యజమాని
చిన్న సినిమా అయినా.. పాన్ ఇండియా రేంజ్‌ అంటున్న మేకర్స్
చిన్న సినిమా అయినా.. పాన్ ఇండియా రేంజ్‌ అంటున్న మేకర్స్
‘బ్లడ్‌ శాంపిల్స్ ఇద్దాం’.. ఏపీలో బెంగళూరు రేవ్ పార్టీ నషా..!
‘బ్లడ్‌ శాంపిల్స్ ఇద్దాం’.. ఏపీలో బెంగళూరు రేవ్ పార్టీ నషా..!
మీ ఇంట్లో ఏసీ ఉందా?ఈ ట్రిక్స్‌తో విద్యుత్‌ బిల్లు తగ్గించుకోవచ్చు
మీ ఇంట్లో ఏసీ ఉందా?ఈ ట్రిక్స్‌తో విద్యుత్‌ బిల్లు తగ్గించుకోవచ్చు
వరుస విజయాలతో దూసుకుపోతున్న మలయాళ ఇండస్ట్రీ
వరుస విజయాలతో దూసుకుపోతున్న మలయాళ ఇండస్ట్రీ
విజృంభించిన స్టార్క్.. కుప్పకూలిన SRH.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?
విజృంభించిన స్టార్క్.. కుప్పకూలిన SRH.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?
సుచిత్రపై సీరియస్ లీగల్ నోటీసులు
సుచిత్రపై సీరియస్ లీగల్ నోటీసులు