Srisailam: రేపటితో ముగుస్తోన్న కార్తీకమాసం.. శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

నంద్యాల జిల్లా శ్రీశైలం కార్తీకమాసం రేపటితో ముగుస్తుండటంతో శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రీశైలం కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. దీనితో శ్రీశైలం టోల్ గేట్ నుంచి ముఖద్వారం వరకు ఘాట్ రోడ్డు వాహనాలతో భారీ ట్రాఫిక్ ఏర్పడింది. రోడ్లపై కార్లు, బస్సులు పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో సుమారు 8 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఏర్పడింది. రేపు సోమవారంతో కార్తీకమాసం ముగుస్తుండటంతో ఇరు..

Follow us

| Edited By: Srilakshmi C

Updated on: Dec 10, 2023 | 4:54 PM

నంద్యాల, డిసెంబర్‌ 10: నంద్యాల జిల్లా శ్రీశైలం కార్తీకమాసం రేపటితో ముగుస్తుండటంతో శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రీశైలం కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. దీనితో శ్రీశైలం టోల్ గేట్ నుంచి ముఖద్వారం వరకు ఘాట్ రోడ్డు వాహనాలతో భారీ ట్రాఫిక్ ఏర్పడింది. రోడ్లపై కార్లు, బస్సులు పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో సుమారు 8 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఏర్పడింది. రేపు సోమవారంతో కార్తీకమాసం ముగుస్తుండటంతో ఇరు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి సైతం సొంత వాహనాలలో క్షేత్రానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు.

అయితే మరోపక్కా ఇప్పటికే భక్తులరద్దిని దృష్టిలో ఉంచుకుని ఆలయ ఈవో పెద్దిరాజు శని, ఆది, సోమవారాలలో శ్రీస్వామివారి స్పర్శ దర్శనం అభిషేకాలు పూర్తిగా రద్దు చేశారు. భక్తులందరికి శ్రీస్వామివారి దర్శనం కల్పించేందుకు అందరికి అలంకార దర్శనం‌ మాత్రమే కల్పిస్తున్నారు. దీనితో భక్తులు భారీగా సొంత కార్లలో తరలి వస్తున్నారు. శ్రీశైలం ఘాట్ రోడ్ మొత్తం సింగిల్ రోడ్డు కావడంతో వచ్చేవెళ్లే వాహనాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శ్రీశైలం నుంచి ముఖ ద్వారం వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ముఖద్వారం నుంచి శ్రీశైలానికి సుమారు 3 గంటల సమయం పడుతుంది. అయితే ట్రాఫిక్ జామ్ క్లియర్ చేసేందుకు దేవస్థానం సెక్యూరిటీ అలానే పోలీసులు ప్రత్యేక టీమ్స్ తో అష్టకష్టాలు పడుతూ ట్రాఫిక్‌ని అదుపు చేయడంలో నిమగ్నమయ్యారు. మరోపక్క శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు ఐదు గంటల సమయం పడుతుందని అధికారులు పేర్కొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్