YCP MLC Candidates: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో చాణక్యం.. వైసీపీ అభ్యర్థుల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకే!

ఎమ్మెల్యేల కోటాలో శాసన మండలికి ఎన్నికయ్యే ఆరుగురు అభ్యర్థుల జాబితాను వెల్లడించింది అధికార వైసీపీ. అయితే ఈ ఆరుగురి రాజకీయ ప్రస్థానమేంటి? ఎవరెవరు ఎక్కడి వారు? ఎలాంటి రాజకీయ చరిత్రను కలిగి వున్నారు. ఈ విషయం ఇపుడు ఆసక్తి రేపుతోంది.

YCP MLC Candidates: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో చాణక్యం.. వైసీపీ అభ్యర్థుల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకే!
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 25, 2021 | 5:57 PM

Political history of YCP MLC candidates:  ఎమ్మెల్యేల కోటాలో శాసన మండలికి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఎన్నిక జరుగుతున్న ఆరు సీట్లను శాసనసభలో వున్న తిరుగులేని సంఖ్యాబలంతో గెలుచుకునే అవకాశం వైసీపీ వుంది. దాంతో మొత్తం ఆరుగురు అభ్యర్థులను ఓకేసారి ప్రకటించేసింది వైసీపీ అధిష్టానం. అయితే.. ఈ ఆరుగురి బ్యాక్ గ్రౌండ్ పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తున్నాయి. నమ్మిన వారికి అవకాశమిచ్చే నైజాన్ని తన తండ్రి, స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి పొందిన వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తనను నమ్ముకున్న వారికి అవకాశమిస్తూనే సామాజిక సమతుల్యాన్ని పాటించినట్లు ఈ ఆరుగురు అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తే ఇట్టే అవగతమవుతుంది.

చల్లా భగీరథరెడ్డి

కర్నూలు జిల్లా నేత, మాజీ ఎమ్మెల్సీ, దివంగత చల్లా రామకృష్ణారెడ్డి రెండో కుమారుడు చల్లా భగీరథరెడ్డి. చల్లా రామకృష్ణారెడ్డి 2021 జనవరి 1వ తేదీన కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే. సీఎం జగన్మోహనరెడ్డి కర్నూలు జిల్లా‌ అవుకుకు స్వయంగా వచ్చి చల్లా కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంలోనే చల్లా భగీరథరెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారని అప్పట్లో వార్తలొచ్చాయి. ఆ వార్తలను నిజం చేశారు ముఖ్యమంత్రి. హామీ ఇచ్చినట్లుగానే భగీరథరెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశమిచ్చారు అధినేత జగన్.

గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భగీరథ రెడ్డి యూత్ కాంగ్రెస్‌లో యాక్టివ్‌గా పని చేశారు. ఆ తర్వాత వైఎస్సార్ మరణానంతర పరిణామాలలో జగన్ సొంత పార్టీ పెట్టుకున్నప్పుడు తన తండ్రి రామకృష్ణారెడ్డితోపాటు భగీరథ రెడ్డి కూడా పార్టీ మారారు. జగన్ సారథ్యంలోని వైసీపీలో యూత్ వింగ్ కార్యకలాపాలలో భగీరథ రెడ్డి చురుకుగా పాల్గొన్నారు. కర్నూలు జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక స్థానమున్న చల్లా కుటుంబానికి మరోసారి పదవి వరించడం పట్ల కోవెలకుంట్ల, అవుకు, సంజామల, కొలిమిగుండ్ల, బనగానపల్లెలో సంబరాలు జరుపుకుంటున్నారు. భగీరథ రెడ్డి ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివారు. భగీరథ రెడ్డి భార్య శ్రీలక్ష్మి ప్రస్తుతం అవుకు జడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భగీరథ రెడ్డి స్వగ్రామం అవుకు.

సి. రామచంద్రయ్య

కడప జిల్లా రాజంపేటకు చెందిన బలిజ సామాజిక వర్గం నేత సి. రామచంద్రయ్య. మరోసారి ఆయనకు ఎమ్మెల్సీ పదవి వరించింది. చార్టర్ అకౌంటెంట్‌గా సుదీర్ఘ కాలం పని చేసిన రామచంద్రయ్య 1981లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఎన్టీయార్ మంత్రి వర్గంలో 1986-88 కాలంలో దేవదాయశాఖ మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత రెండు సార్లు టీడీపీ పక్షాన రాజ్యసభ సభ్యునిగా వ్యవహరించారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా చంద్రబాబు టీమ్‌లో కీలకంగా మెలిగారు. ఆ తర్వాత చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2008లో ప్రజారాజ్యం పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించాడు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన సందర్భంలో చిరంజీవితోపాటు రామచంద్రయ్య కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆయనకు 2012లో ఎమ్మెల్సీ సీటు కేటాయించింది. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగాను వ్యవహరించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. జగన్ పాదయాత్ర సమయంలో 2018లో వైసీపీలో చేరిన రామచంద్రయ్యకు మరోసారి ఎమ్మెల్సీ సీటు రావడం పట్ల అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

మహమ్మద్‌ ఇక్బాల్‌

మాజీ పోలీసు అధికారి అయిన మహ్మద్ ఇక్బాల్ అనంతపురం జిల్లాకు చెందిన వారు. ఐజీ ర్యాంకు అధికారిగా ఆయన పదవీ విరమణ చేశారు. అయితే అంతకు ముందు అంటే 1999-2004 మధ్య కాలంలో చంద్రబాబు సీఎంగా వున్నప్పుడు ఆయన భద్రతాధికారిగా వ్యవహరించారు. చంద్రబాబు సెక్యురిటీ ఆఫీసర్‌గానే ఇక్బాల్ అందరికీ సుపరిచితులయ్యారు. పదవీ విరమణ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో చేరి హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. గత ఎన్నికల్లో (2019)లో నందమూరి బాలకృష్ణ చేతిలో ఇక్బాల్ ఓటమి పాలయ్యారు. ఏప్రిల్‌ 4, 1958న జన్మించిన షేక్‌ మహ్మద్‌ ఇక్బాల్‌.. కర్నూలు జిల్లా ఆదోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ చదివారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. పూర్తి చేశారు. 1982లో నిషాత్‌ జహన్‌తో వివాహం జరిగింది. ఐపీఎస్‌కు ఎంపీక కాక ముందు ఇక్బాల్ కొంతకాలం ఇండియన్‌ రైల్వేస్ ఉద్యోగం చేశారు. ఇదివరకు ఓ దఫా ఎమ్మెల్సీగా ఇక్బాల్ వ్యవహరించారు.

దువ్వాడ శ్రీనివాస్

దువ్వాడ శ్రీనివాస్ స్వస్థలం శ్రీకాకుళం జిల్లా టెక్కలి. ఎంఏ ఇంగ్లీషు లిటరేచర్ చదివిన శ్రీనివాస్ ఆ తర్వాత లాయర్ పట్టా కూడా పుచ్చుకున్నారు. వ్యాపారవేత్తగా కొనసాగి ఆ తర్వాత క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో ప్రజారాజ్యం తరపున టెక్కలి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన దువ్వాడ శ్రీనివాస్.. మూడు స్థానంలో నిలిచారు. 2009 తర్వాత నెలకొన్ని రాజకీయ పరిణామాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన శ్రీనివాస్ 2014లో టెక్కలి నుంచి పోటీ చేశారు. 72 వేలకు పైగా ఓట్లు సాధించినప్పటికీ ఓటమి పాలయ్యారు. 2019లో దువ్వాడకు ఎంపీగా పోటీ చేసే అవకాశమిచ్చారు అధినేత జగన్. 5 లక్షల 27 వేలకు పైగా ఓట్లు సాధించినప్పటికీ కింజారపు రామ్మోహన్ చేతిలో దువ్వాడ శ్రీనివాస్ ఓటమి పాలయ్యారు. 13కు పైగా క్రిమినల్ కేసులున్న దువ్వాడకు ప్రస్తుతం ఎమ్మెల్సీగా అవకాశమిచ్చారు జగన్.

బల్లి కల్యాణ్ చక్రవర్తి

బల్లి కల్యాణ చక్రవర్తి దివంగత ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ తనయుడు. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తిరుపతి నుంచి వైసీపీ తరఫున ఎంపీగా గెలిచారు బల్లి దుర్గా ప్రసాద్. 2020 సెప్టెంబర్‌లో కరోనా వైరస్ బారిన పడ్డారు. చికిత్స పొందుతూ గుండెపోటు రావడంతో చైన్నైలోని ఓ ఆసుపత్రిలో చనిపోయారు. నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన బల్లి దుర్గా ప్రసాద్ 28 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యే అయ్యారు. 1985, 1994, 1999, 2009లో నాలుగుసార్లు గూడూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. తిరుపతి లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసి 2.28 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

కల్యాణ్‌ను ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి వరించింది. ఎమ్మెల్యే కోటాలో ఎన్నికయ్యే ఎమ్మెల్సీ పేర్లలో కల్యాణ్ చోటు కల్పించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. దుర్గా ప్రసాద్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని గతంలోనే ముఖ్యమంత్రి జగన్‌ హామీ ఇచ్చారు. తుంగ భద్ర పుష్కరాల్లో పాల్గొనడానికి కర్నూలుకు వెళ్లే ముందు కల్యాణ చక్రవర్తి ముఖ్యమంత్రి జగన్‌ను క్యాంపు కార్యాలయంలో కలిసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఖాళీ అయ్యే మొట్టమొదటి ఎమ్మెల్సీ సీటును కళ్యాణ్‌కు ఇస్తామని అప్పుడే సిఎం హామినిచ్చారు. ఇప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని బల్లి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

కరీమున్నిసా

విజయవాడ నగర పాలక సంస్థలో కార్పొరేటర్‌ వ్యవహరించిన మహ్మద్‌ కరీమున్నీసాకు జగన్ పెద్ద ఛాన్సే ఇచ్చారు. ఆమెను ఏకంగా శాసన మండలికి పంపాలని నిర్ణయించారు. గతంలో కరీమున్నీసా విజయవాడ సెంట్రల్‌లో 56వ డివిజన్ కార్పొరేటర్‌గా పనిచేశారు. జూన్ 6, 1966లో విజయవాడ నగరంలో జన్మించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి కరీమున్నిసా. భర్త పేరు ఎండి సలీం. వైఎస్సార్సీ పార్టీ స్థాపించినప్పటి నుంచి విజయవాడలో జగన్‌ పాటు పనిచేసిన వారిలో కరీమున్నీసా కుటుంబం ఒకటి. టీడీపీ ప్రభుత్వంలో రెండు కేసులను ఎదుర్కోంది ఆమె కుటుంబం. కరీమున్నీసాకు ఐదుగురు పిల్లలు. ఆమె చిన్న కుమారుడు రహ్మతుల్లా జగన్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. 2010 నుంచే జగన్‌తో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. వైఎస్ఆర్సీపీ ప్రారంభం నుంచి పార్టీలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు కరీమున్నీసా. జగన్ పాదయాత్ర చేసే సమయంలో 56వ డివిజన్‌లో ఆగారు. తాను సీఎం అయితే ఇక్కడ నుంచే ముస్లిం మహిళకు ఎమ్మెల్సీ సీటు ఇస్తానని హామీఇచ్చారు. ఆ హామీని ఇప్పుడు అమలుచేశారని చెప్పాలి.

ఇదిలా వుండగా.. ఏపీలో ఖాళీ అయిన ఎమ్మెల్యే కోటా ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేయడం లేదు. ఈ విషయాన్ని ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి వెల్లడించారు.

ALSO READ: ఆందోళన కలిగిస్తున్న మృగాళ్ళ నేర ప్రవృత్తి.. కలవరపెడుతున్న అకృత్యాల లెక్కలు

ALSO READ: ఎంఐఎం ఎంట్రీతో పొలిటికల్ హీట్.. ప్రభావంపై లెక్కల మీద లెక్కలు.. ఇంతకీ నష్టమెవరికంటే?

ALSO READ: రెండేళ్ళ ముందే కసరత్తు షురూ.. దీదీకి ధీటుగా కమలం వ్యూహం

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?