Andhra Pradesh: శ్రీకాకుళం ఆర్మీ కాలింగ్ సంస్థపై చర్యలు షురూ..! పోలీసుల అదుపులో నిర్వాహకుడు

డిఫెన్స్‌లో చేరాలనుకునే విద్యార్ధులకు శిక్షణ పేరిట ఆర్మీ కాలింగ్‌ ఇనిస్టిట్యూట్‌లో అక్రమాలకు ఆరాచకాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఎప్పటి నుంచో వున్నాయి. లేడీస్ హాస్టల్ రూమ్‌లలో సీసీ కెమెరాలు పెట్టారనే ఆరోపణలతో పోలీసులు దర్యాప్తు చేశారు.

Andhra Pradesh: శ్రీకాకుళం ఆర్మీ కాలింగ్ సంస్థపై చర్యలు షురూ..! పోలీసుల అదుపులో నిర్వాహకుడు
Man Beats Student
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 08, 2024 | 9:30 AM

డిఫెన్స్‌ కోచింగ్‌ పేరిట అక్రమాలకు పాల్పడుతోన్న శ్రీకాకుళంలో ఆర్మీ కాలింగ్ సంస్థపై చర్యలు మొదలయ్యాయి. విద్యార్ధులను హింసించిన ఘటనలో సంస్థ నిర్వాహకుడు వెంకటరమణను అరెస్ట్‌ చేశారు పోలీసులు .ఆర్మీ లోగో, జెండాను చట్టవిరుద్ధంగా వాడినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఎగస్ట్రాలేసిన శ్రీకాకుళంలో ఆర్మీ కాలింగ్ సంస్థపై యాక్షన్‌ మొదలైంది. విద్యార్ధులను చిత్రహింసలు పెట్టిన కేసులో నిర్వాహకుడు బసవ వెంకటరమణను అరెస్ట్‌ చేశారు పోలీసులు. ట్రైనింగ్‌ ముసుగులో ఆర్మీ కాలింగ్ సంస్థలో చేస్తోన్న ఆగడాలు ఇటీవల సోషల్‌ మీడియాలో వైరలయ్యాయి. స్టూడెంట్లను బూతులు తిడుతూ కేబుల్ వైర్‌తో విచక్షణారహితంగా కొడుతున్న వీడియోలు తీవ్ర కలకలం రేపాయి. అంతేకాదు ఆర్మీ కాలింగ్‌ నిర్వాహాకుల అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.

ఆర్మీ, నేవీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి దగ్గర 5 నుంచి 10 లక్షల రూపాయల వరకూ వసూలు చేసిన వైనం బయటపడింది. తన డబ్బులు తిరిగి ఇవ్వాలని ప్రశ్నించినందుకు ఓ విద్యార్ధిపై దారుణంగా దాడి చేశాడు బసవ వెంకటమరణ. ఈ వీడియో బయటకు రావడంతో వైరల్ అయింది. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు మంత్రి నారా లోకేష్‌కు ఈ వీడియోను ట్యాగ్‌ చేశారు. ఆయన వెంటనే స్పందించి ఆర్మీ కాలింగ్‌ సంస్థలో ఆగడాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఆ క్రమంలో బాధితుల ఫిర్యాదు మేరకు ఆర్మీ కాలింగ్‌ సంస్థపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిర్వాహాకుడు బసవ వెంకటరమణను అరెస్ట్‌ చేశారు. విద్యార్ధులపై దాడి సమా ఆర్మీలోగోను, ఫ్లాగ్‌ను చట్టవిరుద్ధంగా వాడారనే అభియోగంపై కేసు నమోదు చేశారు. డిఫెన్స్‌లో చేరాలనుకునే విద్యార్ధులకు శిక్షణ పేరిట ఆర్మీ కాలింగ్‌ ఇనిస్టిట్యూట్‌లో అక్రమాలకు ఆరాచకాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఎప్పటి నుంచో వున్నాయి. లేడీస్ హాస్టల్ రూమ్‌లలో సీసీ కెమెరాలు పెట్టారనే ఆరోపణలతో పోలీసులు దర్యాప్తు చేశారు. అటు.. ఆర్మీ కాలింగ్‌ సెంటర్‌కు ఇంటర్మీడియట్‌ కాలేజ్‌ అనుమతులు కూడా లేవని శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఇప్పుడు దర్యాప్తులో ఇంకా ఎలాంటి సంచనాలు తెరపైకి వస్తాయోననే చర్చ జరుగుతోంది. ఆర్మీ కాలింగ్‌ సంస్థ బాధితులు ఎవరైనా వుంటే తమను సంప్రదించాలన్నారు పోలీసులు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..