AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు.. బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం

తెలుగు రాష్ట్రాల్లో వానలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇటీవల కురిసిన ఫెంగాల్ తుఫాన్ ఎఫెక్ట్ తో రైతులు కోలుకోకముందే బంగాళాఖాతంలో మారోమారు అల్పపీడనం ఏర్పడింది. దీంతో ఆదివారం ఉదయం నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి..

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు.. బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం
Weather Update
Srilakshmi C
|

Updated on: Dec 08, 2024 | 6:30 AM

Share

అమరావతి, డిసెంబర్ 8: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి వర్షాలు కురవనున్నాయి. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బంగాళాఖాతంలో మారో అల్పపీడనం ఏర్పడింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఈక్వటోరియల్ హిందూ మహా సముద్రం మీదుగా ఉన్న ఆవర్తనం ప్రభావంతో శనివారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ మేరకు అల్పపీడనం వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఆదివారం (డిసెంబర్ 8) రోజు ముగిసేనాటికి మరింత బలపడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

ఇది పశ్చిమ వాయవ్య దిశగా కొనసాగుతూ 11వ తేదీ నాటికి శ్రీలంక–తమిళనాడు తీరంలోని నైరుతి బంగాళాఖాతం సమీపానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఆదివారం ఉత్తరాంధ్ర, ఉమ్మడి ఉభయగోదావరి, ఏలూరు, కృష్ణాజిల్లాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే దీని ప్రభావంతో డిసెంబర్‌ 11, 12 తేదీల్లో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు.

డిసెంబర్‌ 12వ తేదీన ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా పరిణామం చెందే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇక ఈ రోజు (ఆదివారం) అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, అల్లూరి సీతారామ రాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో అల్పపీడనం ప్రభావంతో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

ఇవి కూడా చదవండి

అల్పపీడనం ప్రభావంతో ఆదివారం వేకువ జామున హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ఈ రోజంతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సిద్దిపేట, మెదక్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జిల్లాలో ఇప్పటికే వర్షం కురుస్తుండగా.. తాజా అలర్ట్ ప్రకారం హైదరాబాద్ నగరంలోని తూర్పు ప్రాంతంలోనూ నేడు భారీ వర్షం కురుస్తుందని అంచనా వేసింది. అకాల వార్షాల వల్ల కల్లాల్లో ఉన్న ఉన్న ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..