AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మళ్లీ చెలరేగిన పిచ్చికుక్కలు.. 26 మంది చిన్నారులపై దాడి! ఎక్కడంటే

రాష్ట్రంలో పిచ్చికుక్కల స్వైరవిహారం మళ్లీ మొదటికొచ్చింది. తాజాగా ఓ పిచ్చికుక్క ఆడుకుంటున్న చిన్నారులపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. 24 మంది గాయపడగా.. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది..

Telangana: మళ్లీ చెలరేగిన పిచ్చికుక్కలు.. 26 మంది చిన్నారులపై దాడి! ఎక్కడంటే
Stray Dog Attack
Srilakshmi C
|

Updated on: Dec 06, 2024 | 10:26 AM

Share

మహబూబ్‌నగర్‌, డిసెంబర్‌ 6: మళ్లీ పిచ్చికుక్కల దాడులు మొదలయ్యాయ్. నిన్నమొన్నటి వరకు కంటిపై కునుకులేకుండా చేసిన కుక్కలు మళ్లీ దాడులకు తెగబడుతున్నాయ్‌. తాజాగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చిన్నారులపై కుక్కలు దాడి చేశాయి. తాజాగా మహబూబ్‌నగర్‌లో ఓ కుక్క ఏకంగా 24 మంది పిల్లలపై దాడి చేసి, తీవ్రంగా గాయపరిచింది. వివరాల్లోకెళ్తే..

రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాల్లో పిచ్చికుక్కల దాడిలో దాదాపు 26 మంది చిన్నారులు గాయపడ్డారు. మహబూబ్‌నగర్‌ పట్టణంలో గురువారం రాత్రి 7 నుంచి 8.30 గంటల ప్రాంతంలో గోల్‌ మజీద్, పాత పాలమూరు ఏరియాలో ఓ పిచ్చికుక్క స్థానికులను భయకంపితులను చేసింది. చిన్నారుల వెంట పడి కరుస్తూ పలువురిని గాయపరిచింది. పిచ్చికుక్క దాడిలో దాదాపు 24 మంది చిన్నారులు గంటల వ్యవధిలోనే గాయపడ్డారు. చిన్నారులందరికీ జనరల్‌ ఆస్పత్రిలో టీటీ ఏఆర్‌వీ టీకాలు ఇచ్చారు. వీరిలో ఐదుగురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని జనరల్‌ ఆస్పత్రిలో చేర్పించుకుని డాక్టర్ల పరిశీలనలో ఉంచినట్లు ఆర్‌ఎంవో డాక్టర్‌ జరీనా తెలిపారు.

పిచ్చికుక్క దాడిలో గాయపడిన చిన్నారులను గురువారం రాత్రి జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌ పరామర్శించారు. పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే వైద్యాధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లాలోని కుక్కలను దూర ప్రాంతాలకు తరలించాలని, వాటికి ఇంజెక్షన్లు వేయించాలని మున్సిపల్‌ కమిషనర్‌కు సూచించారు. మరో ఘటనలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులపై వీధికుక్క ఒకటి దాడి చేసింది. మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం కొల్లాపురంలో ఈ ఘటన జరిగింది. కొల్లాపురంలో నివాసం ఉంటున్న మహేశ్‌ కూతురు స్మైలీ, కారం సుమన్‌ కుమారుడు అచ్చితానంద గురువారం సాయంత్రం ఇంటి ముందు ఉన్న స్థలంలో ఆడుకుంటున్నారు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదుగానీ ఓ పిచ్చికుక్క వీరిద్దరిపై దాడికి పాల్పడింది. కుటుంబసభ్యులు గమనించి చిన్నారులను కుక్క బారి నుంచి కాపాడారు. వెంటనే గాయపడిన చిన్నారులను మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ