Bleeding Eye Virus: దడపుట్టిస్తున్న బ్లీడింగ్ ఐ వైరస్.. 15 రోజుల్లో 150 మంది మృతి

ప్రపంచం ముంగిట మరో పెనుముప్పు విలయ తాండవం చేస్తుంది. ఆఫ్రికాలో ఉద్భవించిన అంతుచిక్కని వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటికే ఆ దేశంలో కేవలం 15 రోజుల్లో 150 మంది మృత్యువాత పడ్డారు. దీనికి చికిత్స అందుబాటులో లేకపోవడంతో జనాలు తమ ఇళ్లలోనే చనిపోతున్నారు..

Bleeding Eye Virus: దడపుట్టిస్తున్న బ్లీడింగ్ ఐ వైరస్.. 15 రోజుల్లో 150 మంది మృతి
Bleeding Eye Virus Pandemic Alert
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 06, 2024 | 12:34 PM

కాంగో, డిసెంబర్‌ 6: ప్రపంచ దేశాలు ‘బ్లీడింగ్ ఐ వైరస్’ మహమ్మారికి గజగజ వణకుతున్నాయి. ప్రస్తుతం ఆఫ్రికాను వేధిస్తున్న ఈ వైరస్‌ అక్కడి నైరుతి కాంగోలో తొలిసారి బయటపడింది. ఈ అంతుచిక్కని వ్యాధి కాంగోలోని క్వాంగో ప్రావిన్సులో మారణహోమాన్ని సృష్టిస్తుంది. కేవలం 15 రోజుల్లో దాదాపు 150 మందిని పొట్టనబెట్టుకుంది. దీంతో ఆ దేశ ఆరోగ్య అధికారులు హెల్త్‌ ఎమర్జెన్సీ జారీ చేశారు. నవంబర్ 10 నుంచి నవంబర్ 25 మధ్య కాంగో ప్రావిన్స్‌లోని పాంజీ హెల్త్ జోన్‌లో ఈ మరణాలు సంభవించాయి. అంతుచిక్కని మరణాలను గల కారణాలను అన్వేషించడానికి రోగుల నుంచి నమూనాలు సేకరించేందుకు ఒక వైద్య బృందం పాంజీ హెల్త్‌ జోన్‌ చేరుకుంది.

అక్కడి ప్రాంతీయ ఆరోగ్య మంత్రి అపోలినైర్ యుంబా ప్రకారం. దీని అనారోగ్య లక్షణాలు ఫ్లూని పోలి ఉన్నట్లు తెలిపారు. రోగుల్లో అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, దగ్గు, రక్తహీనత వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. దీనికి చికిత్స అందుబాటులో లేకపోవడంతో అనేక మంది రోగులు తమ ఇళ్లలోనే మృత్యువాత పడుతున్నారు. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని ఆరోగ్య అధికారులు సమస్యాత్మక ప్రదేశాల్లో జనాల అనారోగ్యంపై నిఘా ఉంచారు. ఇది అంటువ్యాధని, మృతదేహాల దరిదాపుల్లోకి కూడా ఎవ్వరూ రావొద్దంటూ అక్కడి ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇక్కడి ఆరోగ్య సమస్యను పరిష్కరించడానికి, వైద్య సామాగ్రిని సరఫరా చేయాలని ఆరోగ్య మంత్రి అపోలినైర్ యుంబా దేశీయ, విదేశీ భాగస్వాముల సహాయం కోరారు.

రోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది. పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. స్థానిక ఎపిడెమియాలజీ ప్రకారం, ఈ వ్యాధి మహిళలు, పిల్లలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నట్లు పేర్కొంది. మరణాల సంఖ్య వేగంగా పెరుగుతోందని, ఒక్క నవంబర్ 25వ తేదీన దాదాపు 67 మరణాలు నమోదైనట్లు అక్కడి ఆరోగ్య అధికారులు వెల్లడించారు. చైనా నుంచి శరవేగంగా ప్రపంచ దేశాలకు ప్రయాణించిన కోవిడ్ -19 వ్యాప్తితో కోట్లాది మంది ప్రాణాలు వదిలారు. కాంగోలో విజృంభిస్తున్న ఈ కొత్త వైరస్‌ను కట్టడి చేయకుంటే మరోమారు ప్రమదం ముంచుకొచ్చే అవకాశం ఉందని ప్రపంచదేశాలు ఆందోళన చెందుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.