Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఇతని వయసు వెనక్కి.. యువకుడిగా కనిపించే 47 ఏళ్ల వ్యక్తి .. డైట్, దినచర్య ఏమిటంటే

వయస్సును తగ్గించుకుని నవ యవ్వన యువకుడిగా మారడానికి ఒక మనిషి ఏమి చేయగలడు అనేదానికి గొప్ప ఉదాహరణగా నిలిచాడు అమెరికన్ వ్యాపారవేత్త బ్రయాన్ జాన్సన్. ఈ 47 ఏళ్ల పారిశ్రామికవేత్త ప్రస్తుతం 6 రోజుల భారత పర్యటనలో ఉన్నారు. జాన్సన్ తాను తినే ఆహారాన్ని అమెరికా నుంచే తీసుకుని తెచ్చుకున్నాడు.

Viral News: ఇతని వయసు వెనక్కి.. యువకుడిగా కనిపించే 47 ఏళ్ల వ్యక్తి .. డైట్, దినచర్య ఏమిటంటే
Bryan Johnson Diet
Follow us
Surya Kala

|

Updated on: Dec 06, 2024 | 11:48 AM

ఒక వ్యక్తి మళ్లీ యవ్వనంగా మారగలడా? అని ఎవరైనా అడిగితే ఇది సినిమానా జీవితం అనే సమాధానం వస్తుంది. సిని ప్రియులు అయితే ఇదేమన్నా ఆదిత్యా 369 టైం మిషన్ అని అనుకుంటున్నారా అని కామెంట్ చేస్తారు. అయితే 47 ఏళ్ల అమెరికన్ వ్యాపారవేత్త తన వయస్సును రివర్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్త బ్రియాన్ జాన్సన్ వయసు పెరగడం ఒక నెంబర్ అంటూ నవ యవ్వనంగా మారడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇందుకోసం జాన్సన్ తన దినచర్యను సెట్ చేసుకున్నాడు.

ప్రస్తుతం బ్రియాన్ తన 6 రోజుల భారత పర్యటనలో ఉన్నాడు. విశేషమేమిటంటే.. భారత దేశంలో ఉన్నా సరే తాను తీసుకునే ఆహారానికి సంబంధించిన డైట్‌లో తీసుకునే వస్తువులను తెచ్చుకున్నాడు. అయితే వయసును తగ్గించుకునేందుకు ఆయన దినచర్య ఇంటర్నెట్‌లో చర్చనీయాంశంగా మారింది. బ్రియాన్ సోషల్ మీడియా ఎక్స్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటాడు.. తన జీవనశైలికి సంబంధించిన ప్రతిదాన్ని ఇక్కడ పంచుకుంటాడు. ప్రపంచంలోని ఈ ధనవంతుడు తన యవ్వనాన్ని తిరిగి పొందడానికి తన ఆహారంలో ఏయే అంశాలను చేర్చుకుంటున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

ప్రతిరోజూ 100 సప్లిమెంట్లను తీసుకునే వ్యాపారవేత్త

మీడియా నివేదికల ప్రకారం ఈ అమెరికన్ వ్యాపారవేత్త ప్రతిరోజూ 100 కంటే ఎక్కువ సప్లిమెంట్లను తీసుకుంటాడు. దీంతో తన శరీరానికి కచ్చితంగా పోషకాహారం, యాంటీ ఆక్సిడెంట్లు, శక్తి లభిస్తాయని బ్రియాన్ జాన్సన్ చెప్పారు. వాస్తవానికి ఈ సప్లిమెంట్లన్నీ అతని ఆరోగ్య ప్రోటోకాల్‌లో భాగమే. ఇటీవల జాన్సన్ తన X లో ఒక పోస్ట్ షేర్ చేశాడు. తాను తన భారతదేశ పర్యటనలో తనతో ఏమేమి తీసుకుని వస్తున్నాడో చెప్పాడు. తను ప్రయాణాలు చేసే సమయంలో తినే ఆహారం విషయంలో ఏమి చేస్తానని చాలా మంది అడుగుతూ ఉంటారు. అనే క్యాప్షన్ ఈ పోస్ట్ కి జోడించాడు. జాన్సన్.

బ్రియాన్ పోస్ట్ ప్రకారం.. అతను తనతో పాటు అమెరికా నుంచి 6 రోజులకు సరిపడే ఆహారాన్ని తీసుకువచ్చాడు. ఇందులో లాంగ్విటీ మిక్స్, కొల్లాజెన్ పెప్టైడ్స్, మకాడమియా నట్ బార్‌లు, కాయధాన్యాలు, బఠానీ సూప్ , మాచా ఉన్నాయి. జాన్సన్ ను పరీక్షించిన బ్లూప్రింట్ ప్రోగ్రామ్ ప్రకారం ఈ ఆహారం తయారు చేయబడింది.

4.30కి మేల్కొనే బ్రియాన్

బ్రియాన్ తన వయస్సును తగ్గించుకోవడానికి వ్యాయామంపై కూడా ఆధారపడతాడు. రోజూ తెల్లవారుజామున 4:30 గంటలకు నిద్రలేస్తాడు. తరువాత ధ్యానం, యోగా, వ్యాయామంతో తన దినచర్యను ప్రారంభిస్తాడు. అతను తినే ఆహారంలో తక్కువ కేలరీలు ఉండేలా చూసుకుంటాడు. అటువంటి ఆహారాన్ని తినడానికి ఇష్టపడతాడు.

జుట్టు రాలడం ఆగిపోయింది

బ్రియాన్ 20 సంవత్సరాల వయస్సులో జుట్టు రాలడం మొదలైంది. అయితే 47 సంవత్సరాల వయస్సులో జాన్సన్ మళ్ళీ ఒత్తైన జట్టుతో ఉన్నాడు. ఈ విషయానికి సంబంధించిన ఓ పోస్ట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసి.. తన జుట్టు రాలడం ఎలా ఆగిందో కూడా చెప్పాడు. వాస్తవానికి చాలా మందికి తమ జుట్టులో 50 శాతం జుట్టు రాలిన తర్వాతనే హెయిర్ ఫాల్ గురించి తెలుస్తుందని బ్రియాన్ చెప్పారు. జుట్టు రాలడం మొదలు పెడితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తినే ఆహారంలో ప్రొటీన్లను చేర్చుకోవాలని సూచించాడు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం వలన స్కాల్ప్ సర్క్యులేషన్ మెరుగుపడుతుందని చెప్పారు. అంతేకాదు తినే ఆహారంలో ఐరెన్, సెలీనియంమ, బయోటిన్ వంటి ఖనిజాలను కూడా చేర్చుకోమని సుచిస్తున్నారు .

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

ప్లాస్మా మార్పిడి సహాయం

బ్రియాన్ జాన్సన్ నవ యవ్వనంగా ఉండడం కోసం ప్లాస్మా ట్రాన్స్‌ఫ్యూజన్ వంటి ప్రయోగాత్మక చికిత్సల సహాయం కూడా తీసుకుంటున్నాడు. ఈ చికిత్సలో యువ దాతల ప్లాస్మా .. జాన్సన్ శరీరంలోకి ఇంజెక్ట్ చేయబడుతుంది. ఇలా చేయడం వల్ల జాన్సన్ శరీరం పునరుత్పత్తి లక్షణాలను పొందుతుంది.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..