Vastu Tips For Business: వ్యాపారంలో లాభం, పురోగతి కోసం ఈ వాస్తు చిట్కాలను అనుసరించండి

ప్రతి ఒక్కరికీ జీవించాలంటే డబ్బులు అవసరం. డబ్బు సంపాదన కోసం కొంత మంది వ్యాపారాన్ని చేపడతారు. అయితే వ్యాపారంలో లాభాలు రావాలంటే వాస్తు ప్రకారం కొన్ని చర్యలు తీసుకోవాలి. ఈ సమర్థవంతమైన చిట్కాలను అనుసరించడం ద్వారా వ్యాపారంలో వచ్చే సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. వ్యాపారంలో శ్రేయస్సు కోసం ఏమి చేయాలో తెలుసుకుందాం.

Vastu Tips For Business: వ్యాపారంలో లాభం, పురోగతి కోసం ఈ వాస్తు చిట్కాలను అనుసరించండి
Vastu Tips For Business
Follow us
Surya Kala

|

Updated on: Dec 06, 2024 | 9:40 AM

మానవ జీవితంలో వాస్తు శాస్త్రం ఒక ముఖ్యమైన పాత్రను కలిగి ఉంది. ఎందుకంటే ఎవరైనా కొత్త ఇల్లు కొనుగోలు చేసినా లేదా కొత్త వ్యాపారం ప్రారంభించినా వాస్తు దోషాలను ఎదుర్కోకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వాస్తు శాస్త్రంలో ఇల్లు, ఆఫీసు, వ్యాపారానికి సంబంధించిన నివారణలు అనేకం పేర్కొనబడ్డాయి. ఎవరైనా వ్యాపారంలో పురోగతి, లాభం పొందాలంటే వాస్తు ప్రకారం కొన్ని పనులు చేయాల్సి ఉంది. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

  1. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎవరైనా తన వ్యాపారం అబివృద్ది జరగాలని లాభాలను అందుకోవాలని కోరుకుంటే.. కూర్చునే ప్రాంతానికి ఉత్తరం వైపు నీలం కమల చిత్రాన్ని ఉంచాలి. ఇలా చేయడం వల్ల వ్యక్తి వ్యాపారం పెరుగుతుందని నమ్ముతారు.
  2. వ్యాపార సంస్థ యజమాని కూర్చునే చోట ఉత్తరం వైపు తెల్లటి పిగ్గీ బ్యాంకును ఉంచాలి. అందులో డబ్బులు వేయాలి. ఈ పని చేయడం వలన వ్యాపారం చాలా శుభప్రదంగా జరుగుతుంది. వ్యాపార వృద్ధికి అవకాశం ఉంది.
  3. ఎవరైనా తమ వ్యాపారం పెరగాలని కోరుకుంటే.. అతను నిమ్మకాయలను ఎండుమిర్చిని ఉపయోగించాలి.
  4. ఎవరైనా తమ వ్యాపారం వృద్ధి చెందాలని కోరుకుంటే.. దీని కోసం అతను గురువారం కార్యాలయంలో ఈశాన్య మూలలో స్వస్తికను ఏర్పాటు చేసుకోండి.
  5. ఇవి కూడా చదవండి
  6. లోహంతో చేసిన తాబేలును ఆఫీసులో పెట్టుకోవడం శుభ ప్రదం అని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇలా చేయడం చాలా శ్రేయస్కరం. లోహపు తాబేలును ఉంచడం వ్యాపారంలో కొత్త అవకాశాలను తెస్తుంది. అలాగే ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి.
  7. క్యాష్ కౌంటర్ లేదా కార్యాలయంలో డబ్బు ఉంచే స్థలాన్ని ఉత్తరం వైపు ఉంచండి. ఇలా చేయడం వల్ల ఆర్థికంగా లాభపడే అవకాశాలు లభిస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.