AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bangladesh: మైనారిటీ మత పెద్దలతో యూనస్ సమావేశం.. దోషులు ఎవరైనా శిక్ష తప్పదని హెచ్చరిక.. బాధితులకు తక్షణమే పరిహారం

బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రధానిగా ముహమ్మద్ యూనస్ పదవిని చేపట్టిన తర్వాత ఆ దేశంలో పరిస్తితులు దారుణంగా ఉన్నాయి. హిందుల సహా మైనారిటీలపై దాడులు చేస్తున్నారు. అంతేకాదు సన్యాసి చిన్మయకృష్ణ దాస్ అరెస్టు చేశారు. బెయిల్ రాకుండా శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపధ్యంలో బంగ్లాదేశ్‌లోని హిందువులు సహా మైనారిటీలు ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వీధుల్లోకి వచ్చారు. ఈ పరిస్థితిలో మహ్మద్ యూనస్ మత పెద్దలతో జాతీయ సమైక్యతపై చర్చలు జరిపారు.

Bangladesh: మైనారిటీ మత పెద్దలతో యూనస్ సమావేశం.. దోషులు ఎవరైనా శిక్ష తప్పదని హెచ్చరిక.. బాధితులకు తక్షణమే పరిహారం
Yunus Meets Religious Leaders
Surya Kala
|

Updated on: Dec 06, 2024 | 9:12 AM

Share

బంగ్లాదేశ్ లో హిందువులతోపాటు మైనారిటీలపై వరసగా దాడులు జరుగుతున్నాయి. హిందూ ఆలయాలను ధ్వసం చేస్తున్నారు. అయితే బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వానికి ఆ దేశంలోని హిందువుల సహా మైనార్టీలకు భద్రతను కల్పించాలని భారత్ పదేపదే సందేశాలు పంపింది. మరోవైపు బ్రిటన్, అమెరికా దేశాలు కూడా తమ గళం వినిపిస్తూ బంగ్లాదేశ్ లోని పరిస్థితిపై ఆందోళనను వ్యక్తం చేశాయి. చివరికి ఆ దేశ తాత్కాలిక ప్రధాని యూనస్ పరిపాలన అధికారులు స్వదేశీ, విదేశాల నుంచి వస్తున్న ఒత్తిడికి తలొగ్గారు. బంగ్లాదేశ్‌లోని అన్ని మతాల ప్రతినిధులతో తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్ గురువారం సమావేశమయ్యారు. వివిధ మతాల ప్రతినిధులతో సమావేశం అయి తద్వారా బంగ్లాదేశ్‌లో అన్ని మతాలు సమానమే అనే ఐక్యత చిత్రాన్ని ప్రపంచం ముందు ప్రదర్శించడానికి తాత్కాలిక ప్రభుత్వం తీవ్ర ప్రయత్నం చేనట్లు తెలుస్తోంది.

సన్యాసి చిన్మయికృష్ణ దాస్ అరెస్ట్ .. అనంతరం ఆలయాలపై దాడులు, కృష్ణ దాస్ కేసు తీసుకుంటే ఇబ్బంది తప్పదనే హెచ్చరికలో ఆ దేశం ఒక రణరంగంగా మారింది. బంగ్లాదేశ్‌లోని హిందువులు సహా మైనారిటీలు కృష్ణ దాస్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వీధుల్లోకి వచ్చారు. ఈ ఆందోళన చేస్తున్న బృందాలపై వివిధ సర్కిల్‌ల్లో దాడులు జరిగాయి. ఈ పరిస్థితిలో మహ్మద్ యూనస్ మత పెద్దలతో జాతీయ సమైక్యతపై చర్చలు జరిపారు. గురువారం మధ్యాహ్నం రాజధాని ఢాకాలోని బంగ్లాదేశ్ ఫారిన్ సర్వీస్ అకాడమీలో ఈ సమావేశం జరిగింది.

అంతకుముందు వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి ప్రతినిధులతో తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు సమావేశం నిర్వహించారు. జాతీయ సమైక్యత పిలుపుపై​​మహ్మద్ యూనస్ విద్యార్థి నాయకులు, రాజకీయ పార్టీలు, మత సంఘాల నాయకులతో విడివిడిగా సమావేశం నిర్వహించనున్నట్లు యూనస్ ప్రెస్ సెక్రటరీ షఫీకుల్ ఆలం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, యూనస్ మంగళవారం సాయంత్రం విద్యార్థి నాయకులతో, బుధవారం ప్రధాన రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. గురువారం మత పెద్దలతో సమావేశమయ్యారు.

ఇవి కూడా చదవండి

ముస్లిం, హిందూ, క్రిస్టియన్ , బౌద్ధ సంఘాల నాయకులు హాజరైన సమావేశంలో యూనస్ మాట్లాడుతూ.. విదేశీ మీడియా నివేదికలు, ప్రజలు చెబుతున్నది విన్న తన మనస్సులో అనేక ప్రశ్నలు తలెత్తాయని.. ఈ విషయం గురించి తెలుసుకునేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేసినట్ల చెప్పాడు. ఖచ్చితమైన సమాచారం సేకరించి సమస్యను పరిష్కరించడంలో నాయకులు సహకారం అందించాలని కోరుతున్నారు.

బంగ్లాదేశ్ పౌరులందరికీ సమాన హక్కులు ఉన్నాయని వారి హక్కులకు హామీ ఇచ్చేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే యూనస్ అన్నారు. దేశంలో మైనారిటీలపై దాడులు జరిగితే తక్షణమే సమాచారాన్ని సేకరించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని సూచించారు. దోషులు ఎవరైనా తమ చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా మంచి వాతావరణాన్ని సృష్టించేందుకు చర్యలు తీసుకోనున్నామని బాధితులకు తక్షణమే పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్య సలహాదారుకి సూచించారు. “మా మధ్య విభేదాలు ఉన్నప్పటికీ మేము ఒకరికొకరు శత్రువులం కాదు” అని అతను మత పెద్దలకు చెప్పినట్లు డైలీ స్టార్ వార్తాపత్రిక పేర్కొంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..