US News: తీరంలో 7 తీవ్రతతో భూకంపం.. సముద్రం వెనక్కి.. ప్రమాదానికి సంకేతమా
అగ్రరాజ్యం అమెరికాలోని ప్రధాన నగరాలకు సునామీ హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. ఓ వైపు సముద్ర తీరంలో బలమైన భూకంపం సంబంధించింది. మరోవైపు సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న భూకంప వీడియో ఇళ్లు లోలకంలా ఊగుతున్నట్లు కనిపిస్తోంది. రోడ్లపై నేల ఉబ్బి పైకి వచినట్లు కనిపిస్తోంది.
అగ్రరాజ్యం అమెరికాలో బలమైన భూకంపం సంభవించింది. కాలిఫోర్నియా తీరంలో ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై ప్రకంపనల తీవ్రత 7గా నమోదైంది. మరోవైపు సముద్రం లోపలి వెళ్ళిపోతోంది. దీంతో భూకంపం వచ్చిన వెంటనే అప్పటికే జారీ చేసిన సునామీ హెచ్చరికలను రద్దు చేశారు. ఈ ప్రాంతానికి ప్రస్తుతం సునామీ ప్రమాదం లేదు” అని ఏజెన్సీ సోషల్ మీడియాలో ధృవీకరించింది.
గురువారం కాలిఫోర్నియా తీరంలో ఫెర్న్‌డేల్‌కు నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. భూకంప కేంద్రం ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో మాత్రమే ఉంది. బలమైన భూకంపం వల్ల సునామీ వచ్చే అవకాశం ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే మొదట తెలిపింది. భూకంపం సంభవించిన ప్రాంతం నుంచి 300 కిలోమీటర్ల దూరంలో సునామీ ద్వీపకల్పాన్ని తాకవచ్చని తెలిపింది. దీంతో హోనోలులులోని నేషనల్ వెదర్ సర్వీస్ ద్వారా సునామీ హెచ్చరిక చేసింది.
🚨 Más imágenes del #sismo de magnitud 7 que sacudió el norte de #California 🚨, generando alerta de #Tsunami 🚨Las autoridades temen posibles réplicas y piden a la población estar alerta🌧️#californiaearthquake #earthquake
🎥 De la Red pic.twitter.com/ljDgPnjgK2
— POSTA México (@PostaMexico) December 5, 2024
సముద్రంలో పెద్ద, పెద్ద అలలు ఎగసిపడం లేదని.. తీర ప్రాంత ప్రజలు నిర్లక్ష్యంగా ఉండొద్దు.. సముద్రం వెనక్కి వెళ్తున్న నేపధ్యంలో తీర ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అధికారుల హెచ్చరికలతో తీర ప్రాంత ప్రజలు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి సురక్షితమైన ప్రాంతానికి చేరుకున్నారు. ఆశ్రయం పొందుతున్నారు.
మరోవైపు భారీ భూకంపం రావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇంతటి బలమైన భూకంపం తామెప్పుడూ అనుభవించలేదని వారు పేర్కొన్నారు. భూకంపం వల్ల ఎంతమేర నష్టం వాటిల్లిందో ఇంకా తెలియరాలేదు. అయితే అధిక స్థాయిలో భూమి కంపించడం వలన జరిగిన నష్టం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
magnitude 7 earthquake that occurred in California today captured on camera! Mother Nature is impressive. #californiaearthquake #earthquake #UnitedStates #Everyone pic.twitter.com/PYeoKEBle8
— Ronald Besaw 🇺🇸 (@ronbesaw1) December 5, 2024
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన భూకంప వీడియోలో ఇళ్లు లోలకంలా ఊగిసలాడుతున్నాయి. నీరు అనేక ప్రాంతాల్లోకి చేరుకుంది. రోడ్లపై నెల పైకి ఉబ్బినట్లు కనిపించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..