Viral: 90 లక్షల ఇళ్లు ఖాళీ ఏమయ్యారు.? ఎటు పోయారు.? అసలేం జరిగింది.!

Viral: 90 లక్షల ఇళ్లు ఖాళీ ఏమయ్యారు.? ఎటు పోయారు.? అసలేం జరిగింది.!

Anil kumar poka

|

Updated on: Dec 05, 2024 | 5:17 PM

టెక్నాలజీ అంటేనే జపాన్‌. జపాన్ అంటేనే టెక్నాలజీ. రెండో ప్రపంచ యుద్ధంలో అణుబాంబులు మసి చేసినా సరే.. దానిని తట్టుకుని అభివృద్దిలో ప్రపంచానికే సవాల్‌ విసిరింది. అలాంటి దేశంలో 90 లక్షల ఇళ్లు ఖాళీగా ఉన్నాయంటే నమ్ముతారా? ఇలా ఖాళీగా వదిలేసిన ఇళ్లను అబాండెడ్‌ హౌస్‌లు అంటారట. జనాభాలేమి కారణంగా వదిలేసిన ఇళ్లతో జపాన్‌ తీవ్ర ఇబ్బంది పడుతోందట. ఈ ఇళ్లను వీళ్లు.. ‘అకియా’ పేరుతోనూ పిలుస్తారు. ముఖ్యంగా పల్లెల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనపడుతోంది.

టోక్యో, క్యోటో నగరాలకు దగ్గరగా ఉండే పల్లెలను ఈ అకియా సమస్య వెంటాడుతోంది. ఇక్కడ ఇళ్లు ఎక్కువగా ఉండటం కాదు సమస్య. అసలు అందులో నివసించటానికి జనాలు లేకపోవటమే అతి పెద్ద సమస్య. భూకంపాలు, సునామీల వంటి ప్రకృతి విపత్తుల దృష్ట్యా జనాలు వీటిని ఖాళీ చేసి వెళ్లిపోయారు. అభివృద్ధిలో మనకంటే ఎంతో ముందుండే జపాన్‌లో వృద్ధుల సంఖ్య కూడా అధికం. అదీకాక వారి జీవనకాలమూ ఎక్కువే. కెరీర్‌లో పడి పిల్లలను కనకపోవటం వల్ల సదరు ఇంటివాళ్లు చనిపోతే ఆ ఇల్లు అనాథే. పిల్లలు ఇతర నగరాలకు, దేశాలకు వెళ్లిపోవటం వల్ల కూడా ఈ సమస్య పెరుగుతోంది. ఇకపోతే జపాన్‌లో పన్నుల భారం వల్ల పాత ఇల్లు రిపేర్‌ కన్నా కొత్త ఇల్లు కట్టుకోవటమే మేలు అని భావిస్తారు.

ఇప్పటిదాకా సుమారు 30 లక్షల మంది విదేశీయులు జపాన్‌లోని ఈ పల్లెలను సందర్శించారట. ప్రస్తుతం ఇదో రకం టూరిజంలా మారింది. వాస్తవానికి ఇక్కడ ఇల్లు కొంటే తర్వాత అమ్మటం కష్టం. అందువల్లే ఈ సమస్య అంటున్నారు స్థానిక బిల్డర్లు. హషిమా ఐల్యాండ్‌, టోక్యోకు దగ్గరగా ఉండే కిజోజీ, నారా డ్రీమ్‌ ల్యాండ్‌, ర్యాబిట్‌ ఐల్యాండ్‌, కవాగుచి సిటీ.. లాంటి ప్రాంతాల్లో ఖాళీ ఇళ్లు ఎక్కువగా కనిపిస్తాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.