Lord Shani: కొత్త ఏడాదిలో ఈ రాశి వారికి టెన్షన్.. ఏలినాటి శనిప్రారంభం.. ఈ చర్యలతో కొంతమేర ఉపశమనం..
2025 సంవత్సరంలో శనీశ్వరుడు తన రాశిని మార్చుకోనున్నాడు. కుంభరాశిని వదిలి మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. 2025 మార్చి 29న శనీశ్వరుడు మీనరాశిలోకి అడుగు పెట్టనున్నాడు. దీంతో ఈ రోజు నుంచి మేషరాశి వారికి శనీశ్వరుడు ఏలి నాటి శని మొదటి దశ ప్రారంభమవుతుంది
శనీశ్వరుడు ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్నాడు. 2025లో శని దేవుడి రాశిలో మార్పు జరగనుంది. మార్చి 29వ తేదీన శనీశ్వరుడు మీనరాశిలో అడుగు పెట్టనున్నాడు. మీనరాసికి అధినేత దేవ గురువు బృహస్పతి. శనీశ్వరుడు 30 సంవత్సరాల తర్వాత 2025లో మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. శని పరివర్తన స్థానములో మార్పు వలన శనిశ్వరుడి ఏలి నాటి శని, ధైయ స్థానములలో మార్పు ఉంటుంది. (ఏలినాటి శని ఏడేళ్ల వరకు పోదు..శని సంచార సమయంలో శని, జన్మ రాశి నుంచి నాలుగు లేదా ఎనిమిదో ఇంట్లో ఉంటే అప్పుడు శని ధైయ ప్రభావం అంటారు)
వచ్చే ఏడాది మార్చిలో మీనరాశిలో శనీశ్వరుడు సంచారంతో మకర రాశి వారు ఏలి నాటి ప్రభావం నుంచి బయటపడతారు. అదే సమయంలో మేషరాశికి చెందిన వారికి ఏలి నాటి శని దశ మొదలవుతుంది. ఇక ఇదే సమయంలో శని ధైయా ప్రభావం సింహ రాశి వారిపై ప్రారంభమవుతుంది. వచ్చే ఏడాది మేషరాశి వారికీ ఏలి నాటి శని మొదటి దశ ప్రారంభమైన తర్వాత ఈ రాశికి చెందిన వ్యక్తుల జీవితాల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయో.. ఈ రాశుల వారు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మేషరాశిపై ఏలి నాటి శని దశ మార్చి 2025లో ప్రారంభం
మేషరాశికి చెందిన వారిపై ఏలి నాటి శని 2025 మార్చిలో ప్రారంభమవుతుంది. ఇది 2032 వరకు కొనసాగుతుంది. ఏలి నాటి శనికి మూడు దశలు ఉన్నాయి. మొదటిది ఆరోహణ ఏలి నాటి శని, రెండవది మధ్యం ఏలి నాటి శని దశ, మూడవది అవరోహణ ఏలి నాటి శని. ఈ మూడు దశల్లోనూ శనీశ్వరుడు విభిన్న ప్రభావాలను ఇస్తాడు. ఏలి నాటి శని సమయంలో మేష రాశికి చెందిన వ్యక్తులు ఉద్యోగం, ఆరోగ్య సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడతారు.
మేష రాశి వారికి ఏలి నాటి శని సమయంలో ఆర్థిక నష్టం రావచ్చు. ఆకస్మికంగా ఇబ్బందుల్లో పడవచ్చు. ఏలి నాటి శని సమయంలో ఈ రాశికి చెందిన వ్యక్తుల ప్రవర్తన ప్రతికూలంగా మారవచ్చు. ఈ సమయంలో మేషం రాశి వారికి తరచుగా కోపం వస్తుంది. మానసిక సమస్యలు కూడా ఏర్పడవచ్చు. కనుక ఈ మేష రాశికి చెందిన వారుఏ శనిశ్వరుడి వలన కలిగే ఏలి నాటి శని దుష్ఫలితాలను నివారించడానికి అనేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఏలి నాటి శని నుంచి ఉపశమనం కోసం ఈ చర్యలు చేయండి
ఏలి నాటి శని వల్ల కలిగే దుష్ఫలితాలను నివారించడానికి మేష రాశి వారు ఆవనూనెను లేదా నువ్వుల నూనె దానం చేయాలి. మేష రాశి వారు రావి చెట్టు కింద దీపం వెలిగించండి. అంతే కాకుండా శనిగ్రహం వల్ల కలిగే దుష్ఫలితాల నివారణ కోసం మేష రాశి వారు ఒక గిన్నెలో కొంచెం పాలు, నీరు తీసుకుని అందులో పంచదార కలిపి ఆ నీటిని రావి చెట్టు మొదలుదగ్గర నైవేద్యంగా పెట్టాలి. దీనితో పాటు మేష రాశి వారు శనీశ్వారుడి చెడు ప్రభావాలను నివారించడానికి ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని ఆవు, కుక్క కి పెట్టాలి.
మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.