TOP 9 ET: RRR రికార్డ్‌ బద్దల్‌.. డే1 రపా రప్‌.! రూ.250 కోట్ల కలెక్షన్స్‌ | జాతర సీన్లు కట్.!

TOP 9 ET: RRR రికార్డ్‌ బద్దల్‌.. డే1 రపా రప్‌.! రూ.250 కోట్ల కలెక్షన్స్‌ | జాతర సీన్లు కట్.!

Anil kumar poka

|

Updated on: Dec 06, 2024 | 11:09 AM

పుష్ప రాజ్‌ మ్యాజిక్ చేసేశాడు. బాక్సాఫీస్‌ నయా కింగ్‌గా అవతరించాడు. రపా రప్‌ కలెక్షన్స్‌ను కుమ్మేస్తున్నాడు. ఇప్పటికే ఎవగ్రీన్ రికార్డ్ క్రియేట్ చేసిన ట్రిపుల్ ఆర్ ఫస్ట్ డే కలెక్షన్స్‌ను బద్దలు కొట్టేశాడు. ఇక జక్కన్న డైరెక్షన్లో రిలీజ్ అయిన ట్రిపుల్ ఆర్ అప్పట్లో డే1 223 కోట్లను కలెక్ట్ చేసింది. అయితే ఆ కలెక్షన్స్‌ కంటే ఎక్కువగా.. దాదాపు 250 కోట్లను డే1 కొల్లగొట్టాడట పుష్పరాజ్‌. ఇవి అఫీషియల్ ఫిగర్స్ కానప్పటికీ.. ఫిల్మ్ అనలిస్టులు మాత్రం.. గట్టిగా చెబుతున్న మాట.

01.RRR: RRR రికార్డ్‌ బద్దల్‌.. డే1 రపా రప్‌ 250 కోట్ల కలెక్షన్స్‌.

పుష్ప రాజ్‌ మ్యాజిక్ చేసేశాడు. బాక్సాఫీస్‌ నయా కింగ్‌గా అవతరించాడు. రపా రప్‌ కలెక్షన్స్‌ను కుమ్మేస్తున్నాడు. ఇప్పటికే ఎవగ్రీన్ రికార్డ్ క్రియేట్ చేసిన ట్రిపుల్ ఆర్ ఫస్ట్ డే కలెక్షన్స్‌ను బద్దలు కొట్టేశాడు. ఇక జక్కన్న డైరెక్షన్లో రిలీజ్ అయిన ట్రిపుల్ ఆర్ అప్పట్లో డే1 223 కోట్లను కలెక్ట్ చేసింది. అయితే ఆ కలెక్షన్స్‌ కంటే ఎక్కువగా.. దాదాపు 250 కోట్లను డే1 కొల్లగొట్టాడట పుష్పరాజ్‌. ఇవి అఫీషియల్ ఫిగర్స్ కానప్పటికీ.. ఫిల్మ్ అనలిస్టులు మాత్రం.. గట్టిగా చెబుతున్న మాట.

02. pushpa2: ఇప్పుడు ఐకాన్‌ స్టారే ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్! పుష్ప రిలీజ్‌ ముందు వరకు .. ఈయనో స్టార్ హీరో. పుష్ప రిలీజ్ తర్వాత ఈయనో సూపర్ హీరో. కానీ ఇప్పుడు బాక్సాఫీస్‌నే దడదడలాడించే.. క్రేజ్‌కే బాప్‌గా మారిన ఐకానిక్‌ హీరో. ఎస్ ! ఇప్పటికే రెమ్యునరేషన్లో ఇండియాలోనే నెంబర్‌ 1 హీరోగా నిలిచిన బన్నీ.. ఇప్పుడు పుష్ప2 క్రేయేట్ చేస్తున్న బజ్‌ తో.. నేషనల్ వైడ్ వైరల్ అవుతున్నాడు. 80 దేశాల్లో ట్రెండ్ అవుతున్నాడు. ఏకంగా 6 భాష్లలో రీ సౌండ్ చేస్తున్నారు. ఇప్పటికే డే1 వరల్డ్ వైడ్ కలెక్షన్స్‌లో కూడా రికార్డ్ క్రియేట్ చేసేశాడు. దీంతో మన ఐకాన్ స్టారే ఇప్పుడు ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ హీరో అంటున్నారు కొంత మంది బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్స్‌. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు.

03. pushpa: 19నిమిషాల జాతర సీన్లు కట్.! ఇక నుంచి ఆ థియేటర్స్‌లో కనిపించవు

పుష్ప2 సినిమాకు హైలెటే జాతర సీన్లు. ఇప్పుడా సీన్లే థియేటర్లో జనాలకు పూనకాలు పుట్టిస్తున్నాయి. చూస్తున్న వారిలో గూస్ బంప్స్ కలిగేలా చేస్తున్నాయి. అలాంటి ఈ సీన్‌ ఇప్పుడు కత్తెర పడింది. ఈ సీన్స్‌ లో వైలెన్స్ ఎక్కువగా ఉందని.. బన్నీ గంగమ్మ తల్లి గెటప్‌లో కనిపించడం.. హిందూ దేవతల ప్రస్తావన తీయడం.. తమ పాలిసీకి ఎగెనెస్ట్‌ గా ఉన్నాయాని ఫీలైన, సౌదీ అరేబియా సెన్సార్ బోర్డ్‌.. జాతరకు సంబంధించిన 19 నిమిషాల ఫుటేజ్‌ను ట్రిమ్ చేసింది. దీంతో జాతర సీన్స్ లేకుండానే.. పుష్ప2 అక్కడి థియేటర్స్‌లో రిలీజ్ అయింది.

04.naga chaitanya: అన్న తాళి కడుతుంటే.. తమ్ముడు విజిల్ వేస్తూ అరుపులు.!

అంగరంభ వైభవంగా అక్కినేని వారింట పెళ్లి సందడి ముగిసింది. తన సన్నిహితులు.. హితుల సమక్షంలో.. వేద పండితుల మంత్రోచ్చరణ మధ్యలో.. నాగచైతన్య శోభిత మెడలో మూడు ముళ్లు వేశాడు. అయితే ఈ ఘట్టం జరుగుతున్న క్రమంలోనే.. అన్న నాగచైతన్య చూసి.. తమ్ముడు అఖిల్.. ఆనందంతో విజిల్ వేశాడు. కేరింతలు కొట్టాడు. అఖిల్ తో పాటు.. నాగ చైతన్య కజిన్స్ కూడా.. అరుస్తూ.. నవ్వుతూ.. తాళి కడుతున్న నాగచైతన్యను కాస్త షై ఫీలయ్యేలా చేశారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అందర్నీ తెగ ఆకట్టుకుంటోంది.

05. pushpa: సినిమా చూస్తూ.. థియేటర్లో ఎమోషనల్ అయిన బన్నీ.!

మూడేళ్ల కష్టాన్ని.. తన ఫ్యాన్స్‌ అరుపులు.. కేరింతల మధ్యలో … సిల్వర్ స్క్రీన్‌ పై చూసిన బన్నీ ఎమోషనల్ అయ్యారు. జాతర సీన్లో.. రష్మిక తో డైలాగ్‌ చెప్పే సన్నివేశం వస్తున్న టైంలో ఎమోషనల్ అయ్యారు. కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఇక అదే సీన్ ముగిశాక.. థియేటర్లో ఉన్న బన్నీ ఫ్యాన్స్.. అల్లు అర్జున్ వైను తిరిగి క్లాప్స్ కొట్టారు. స్టాండిక్ ఒవేషన్ ఇచ్చారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

06.mokshu: నిరాశలో బాలయ్య ఫ్యాన్స్.. మోక్షు ఎక్కడ.?

మోక్షజ్ఙ ఎంట్రీ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న బాలయ్య ఫ్యాన్స్ ఒక్కసారిగా నిరాశకు లోనయ్యారు. డిసెంబర్ 4నే హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో మోక్షు సినిమా ముహూర్త కార్యక్రమం జరగాల్సి ఉంది. అయితే అది జరగకపోవడంతో.. నందమూరి ఫ్యాన్స్‌ నిరాశ చెందారు. ప్రశాంత్ వర్మ.. మోక్షు సినిమా లాంచింగ్ ఎప్పుడో అఫీషియల్ గా చెప్పాలంటూ సోషల్ మీడియాలో పోస్టు లు పెడుతున్నారు.

07.Mokshagna: ఒకటి కాదు.. ఏకంగా మూడు సినిమాలు.!

నందమూరి వారసుడు మోక్షజ్ఞ మొదటి సినిమా విడుదలకు ముందే రెండో సినిమా, మూడో సినిమా కూడా కన్ఫర్మ్ అయిపోయాయి. ఈయన తొలి సినిమా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఉండబోతుంది. అలాగే రెండో సినిమాను వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. తాజాగా బాలయ్య కూడా తన కొడుకుతో.. ఆదిత్య 999 చేస్తానని ఆహా వేదికగా అనౌన్స్ చేశారు. దీంతో .. హీరో గా లాంచ్‌ కాకముందే.. మోక్షు టాలీవుడ్‌లో దూసుకుపోతున్నాడనే టాక్ నెట్టింట వైరల్ అవుతోంది.

08. mythri: తొక్కిసలాటలో మహిళ మృతిపై స్పందించిన మైత్రీ మేకర్స్.

పుష్ప2 సినిమా రిలీజ్ సందర్భంగా.. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో.. ఓ మహిళ మరణించింది. అయితే ఈ ఘటన పై తాజాగా పుష్ప2 మేకర్స్ రియాక్టయ్యారు. బుధవారం రాత్రి జరిగిన సంఘటన మాకు చాల బాధాకరం. ఆ ఫ్యామిలీకి మా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. చికిత్స తీసుకుంటున్న ఆ అబ్బాయి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ఇలాంటి క్లిష్ట సమయంలో ఆ కుటుంబానికి తాము పూర్తిగా అండగా నిలబడతామని తమ సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేసారు.

09.pushpa2: అటు OTT.. ఇటు ఫుల్ హెచ్‌డీలో లీక్!

పుష్ప2 సినిమా రిలీజ్ అయిపోయింది. అందరి అంచనాలను అందుకుని సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈక్రమంలోనే ఈమూవీ అఫీషియల్ ఓటీటీ పార్టనర్ నెట్‌ ఫ్లిక్స్ అనే విషయం ఈమూవీ టైటిల్ కార్డ్స్‌ కారణంగా తెలిసిపోయింది. అంతేకాదు ఈ మూవీ రైట్స్‌ కోసం నెట్‌ ఫ్లిక్స్ ఏకంగా 250 కోట్లు చెల్లించిందని.. సంక్రాంతి తర్వాత స్ట్రీమింగ్ చేసే ఛాన్స్‌ ఉందనే న్యూస్ కూడా బయటికి వచ్చింది. ఇక మరో వైపు.. ఈ మూవీ పైరేటెడ్ సైట్స్‌లో .. ఫుల్ హెచ్‌ డీ ఫార్మాట్‌లో అందుబాటులోకి రావడం కూడా.. బన్నీ ఫ్యాన్స్‌ను షాకయ్యేలా చేస్తోంది. మేకర్స్ ఈ ఇష్యూ పై ఫోకస్ చేయాలనే డిమాండ్ వారి నుంచి నెట్టింట వస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.