మాస్క్ పెట్టుకుంటే పులి పారిపోతుందా ??
చిక్కదు. దొరకదు. దాడులు ఆపదు. అవును, తెలంగాణలోని కొమ్రం భీమ్ జిల్లాలో.. పెద్దపులి దాడులతో జనం బెంబేలెత్తిపోతున్నారు. సిర్పూర్ (టి) మండలం ఇటిక్యల్ పాడ్, దుబ్బగూడ పరిసర ప్రాంతాలను బెబ్బులి దాడులు బెంబేలెత్తిస్తున్నాయి. నజ్రూల్ నగర్‌లో మోర్ల లక్ష్మిని పొట్టన పెట్టుకున్న పులి, ఆ తర్వాత దుబ్బగూడలో రైతు సురేష్‌ని గాయపర్చింది.
ఈ పెద్దపులి ఇటిక్యల పాడ్ పరిసరాల్లోనే తిష్ట వేసిందని చెబుతున్నారు. ఇద్దరిపై దాడి చేసింది ఒకే పులి అని గుర్తించిన అటవీ శాఖ…పులి సంచార గ్రామాల్లో అవగాహనా కార్యక్రమం నిర్వహించింది. ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ విల్లుసింగ్ మేర్ ఆధ్యర్యంలో….ఇటిక్యల్ పాడ్‌లో రైతులు, పశువుల కాపరులకు ఫేస్ మాస్కులు పంపిణీ చేశారు. కవ్వాల్ ఛీప్ కన్సర్వేటర్ శాంతారాం, డీఎఫ్‌వో నీరజ్ కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం పదిగంటల లోపు అటవీ ప్రాంతంలోకి వెళ్లకూడదని గ్రామస్తులకు హెచ్చరికలు జారీ చేశారు. సాధారణంగా పులి వెనక నుంచే దాడి చేస్తుంది. అయితే తల వెనుక మాస్క్ పెట్టుకోవడం వల్ల, తనను ఆ వ్యక్తి గమనిస్తున్నాడని గ్రహించి, పులి దాడి చేయకుండా వెళ్లిపోతుందని అధికారులు చెబుతున్నారు. దీనికోసం మాస్కులు ఎలా పెట్టుకోవాలోగ్రామస్తులకు వివరించారు అటవీ అధికారులు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒకే చోట గంటల కొద్దీ కూర్చునేవారికి.. షాకింగ్ న్యూస్
పోస్టాఫీసులకు మహిళల పరుగు.. తీరా అకౌంట్ ఓపెన్ చేస్తే..
వింటర్‌లో ఇవి తింటే.. బాడీకి ఫుల్ పవర్