వీడేం దొంగరా బాబు.. ఇంత ట్యాలెంటడ్ గా ఉన్నాడు
ఓ దొంగ.. మద్యం దుకాణంలో చోరీకి పాల్పడ్డాడు. అతను చోరీకి వెళ్లిన తీరు చూస్తే భారీ స్థాయిలో దోపిడీ చెయ్యాలన్నట్టుగా ఉంది. మద్యం దుకాణం వెనుక గోడకు ఓ పెద్ద రంధ్రం చేసి షాపులోకి ప్రవేశించాడు. షాపు మొత్తం కలియదిరిగాడు. ఆ దుకాణంలో రకరకాల బ్రాండ్లకు చెందిన మద్యం బాటిళ్లు ఎదురుగా కనిపిస్తున్నాయి. ఆ దొంగ వాటన్నిటినీ పరిశీలనగా చూశాడు.
చివరికి అతను చేసిన పనికి ఓర్నీ నువ్వేంట్రా ఇంత ట్యాలెంటెడ్‌గా ఉన్నావు? అంటున్నారు నెటిజన్లు. హైదరాబాద్ నగర శివార్లో ఈ ఘటన చోటుచేసుకుంది.. శంషాబాద్ మండలంలోని పాలమాకుల గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహ వైన్ షాప్ ఉంది. శుక్రవారం ఉదయం తెల్లవారుజామున 3:45 నిమిషాలకు ఈ ఘటన చోటుచేసుకుంది. శ్రీ లక్ష్మీనరసింహ వైన్ షాప్ కు ఒక పెద్ద రంధ్రం వేసి షాప్ లోపలికి ప్రవేశించాడు ఓ దొంగ. అతను ముసుగు ధరించి ఎక్కడా తన ఆనవాళ్లు సీసీ కెమెరాలో కనపడకుండా జాగ్రత్తపడ్డాడు. షాప్ లోకి వెళ్లిన నిందితుడి కాళ్లకు చెప్పులు లేవు. సిమెంట్ కలర్ స్వెటర్, ప్యాంటును ధరించాడు. షాపు లోపలికి ప్రవేశించాక నేరుగా క్యాష్ కౌంటర్ ను చెక్ చేశాడు.. అక్కడేమీ కనిపించలేదు. ఆ పక్కనే ఉన్న మద్యం సీసాలు ఉన్న కాటన్ బాక్సులను చెక్ చేశాడు. ఆ బ్రాండ్ అతనికి నచ్చలేదు కాబోలు వదిలేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మోక్షు హీరోగా ‘ఆదిత్య 369’ సీక్వెల్ అనౌన్స్ చేసిన బాలయ్య
ఫ్యాన్స్‌కు షాకిచ్చిన హీరో.. ఏంటీ పిచ్చి నిర్ణయం
సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న మంచు మనువరాళ్లు.. ఖుషీగా తాత మోహన్ బాబు
TOP 9 ET News: థియేటర్స్‌లో పుష్పగాడి వైల్డ్ ఫైర్ మెంటలెక్కిపోతున్న ఆడియెన్స్