Spicy Chilies: ప్రపంచంలోనే అత్యంత కారంగా ఉండే మిరపకాయలు ఇవే.. వీటిని తింటే శరీరంలో సెగలు పొగలు రావడం ఖాయం..

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు మిరపకాయలను ఇష్టపడతారు. తినే ఆహారంలో చేర్చుకుంటారు. భారతదేశంలో దాదాపు ప్రతి కూరల్లో మిరపకాయలను ఉపయోగిస్తారు. మిర్చిలో ఉండే క్యాప్సైసిన్ అనే ఆల్కలాయిడ్ కెమికల్ వల్ల కారం గుణం ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత కారం గా ఉండే మిరపకాయలు ఏమిటో తెలుసా..

Spicy Chilies: ప్రపంచంలోనే అత్యంత కారంగా ఉండే మిరపకాయలు ఇవే.. వీటిని తింటే శరీరంలో సెగలు పొగలు రావడం ఖాయం..
World Most Spicy Chilies
Follow us
Surya Kala

|

Updated on: Dec 06, 2024 | 11:16 AM

మిరపకాయలు లేని ఆహారం అసంపూర్ణంగా కనిపిస్తుంది. ముఖ్యంగా భారతీయులు స్పైసీ ఫుడ్ తినడానికి చాలా ఇష్టపడతారు. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకూ మిరపకాయను విస్తృతంగా ఉపయోగిస్తారు. నిజానికి మిరపకాయల ఘాటైన లేదా కారంగా ఉండే రుచి వాటిలో ఉండే క్యాప్సైసిన్ అనే రసాయనం వల్ల వస్తుంది. మిరపకాయ రుచిని కారంగా ఉండేలా చేసే రసాయనం క్యాప్సైసిన్. దీని కారణంగా మన శరీరం మండుతున్న అనుభూతిని కలిగిస్తుంది.

మిరపకాయల కారాన్ని కొలవడానికి ఒక స్కేల్ ఉంది. దీనిని స్కోవిల్లే హీట్ యూనిట్స్ (SHU) అంటారు. ఈ స్కేల్‌లో కొలవబడిన మిరపకాయల కారం వాటి క్యాప్సైసిన్ కంటెంట్ ద్వారా నిర్ణయించబడుతుంది. అయితే ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత వేడి మిరపకాయల గురించి తెలుసుకుందాం..

కరోలినా రీపర్

ఇది ప్రపంచంలోనే అత్యంత కారం ఉండే మిరపకాయగా పేరుగాంచింది. ఇది చాలా స్పైసిగా ఉంటుంది. ఇప్పటికే దీని పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది. ఈ మిర్చి రుచి చాలా కారంగా ఉంటుంది. ఈ కారం ప్రభావం వెంటనే కనిపిస్తుంది. దీనిని తిన్న తర్వాత వెంటనే శరీరంలో తీవ్రమైన మంట, చెమటలు, కళ్లలో నీళ్లు వస్తాయి. ఈ కరోలినా రీపర్ అమెరికాకు చెందినది.

ఇవి కూడా చదవండి

ట్రినిడాడ్ మొరుగా స్కార్పియన్

ఈ మిరపకాయ దీని ప్రత్యేక ఆకారంతో పాటు కారంతో ప్రసిద్ధి చెందింది. ఈ పచ్చి మిర్చి చూడడానికి తేలు పంజాల ఆకారంలో ఉంటుంది. ఇది వాస్తవానికి ట్రినిడాడ్ , టొబాగో నుంచి వచ్చింది. ఈ కారణంగా ఈ మిరపకాయకు ట్రినిడాడ్ మొరుగా స్కార్పియన్ అని పేరు పెట్టారు. ఇది కరోలినా రీపర్ తర్వాత రెండవ అత్యంత కారంగా ఉండే పచ్చి మిర్చిగా పరిగణించబడుతుంది.

7 పోట్ మిర్చి

ట్రినిడాడ్, టొబాగోలో కనిపిస్తుంది. ఈ మిరపకాయ రంగు ముదురు గోధుమ లేదా నలుపులో ఉంటుంది. అంతేకాదు ఏకకాలంలో ఏడు వేర్వేరు తీవ్రమైన కారం రుచులను ఉత్పత్తి చేసే పాయింట్లను ఉత్పత్తి చేస్తుంది. కనుక దీనిని ‘7 పోట్ చిల్లీ ‘ అని కూడా పిలుస్తారు.

ఘోస్ట్ పెప్పర్

భారతదేశానికి చెందిన ఘోస్ట్ పెప్పర్ అంటే భూత్ జోలాకియా మిరపకాయ ప్రపంచంలో నాల్గవ అత్యంత కారంగా ఉండే మిరపకాయ. 2007లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఘోస్ట్ పెప్పర్ ప్రపంచంలోనే అత్యంత హాటెస్ట్ మిరపకాయ అని ధృవీకరించింది. అయితే తర్వాత మరింత కారం గల మిరపకాయలు వెలుగులోకి వచ్చాయి. ఇవి ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం , నాగాలాండ్‌లో కనిపిస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..