- Telugu News Photo Gallery Washing woolen clothes in this way will remove the dirt easily, Check Here is Details
Washing Tips: ఉన్ని దుస్తులను ఇలా ఉతికితే మురికి ఈజీగా పోతుంది..
చలి కాలం వచ్చిదంటే ఉన్ని దుస్తులకు పని చెబుతూ ఉంటారు. ఇవి చాలా స్మూత్‌గా ఉంటాయి. వేసుకుంటే చాలా కంఫర్ట్‌గా అనిపిస్తుంది. అందుకే చాలా మంది వీటినే వాడతారు. కానీ వీటిని క్లీన్ చేసే పద్దతి మాత్రం తెలీదు. ఎలా పడితే అలా ఉతికితే ఈ దుస్తులు త్వరగా చిరిగిపోతాయి..
Updated on: Dec 06, 2024 | 12:07 PM

చలి కాలం వచ్చిదంటే.. రగ్గులకు, ఉన్ని దుస్తులు, స్వెటర్లకు పని చెబుతారు. ఎక్కువగా ఉన్నితో చేసిన బట్టలను వాడుతూ ఉంటారు. కొంత మంది ఉతకుండా అదే పలంగా వాడుతూ ఉంటారు. దీని వల్ల మరకలు పడటమే కాకుండా, దుర్వాసన కూడా వస్తుంది. వీటిని తొలగించాలంటే శ్రమ పడాల్సిందే.

అలా అని గట్టిగా ఉతికితే ఇవి త్వరగా చిరిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వీటిని చాలా డెలికేట్‌గా ఉపయోగించాలి. ఇప్పుడు చెప్పే విధంగా ఉతికితే ఉన్ని దుస్తులు ఎక్కువ రోజులు మన్నుతాయి. మరి అదెలాగో ఇప్పుడు చూడండి.

ఉన్ని దుస్తులను ఇతర దుస్తులతో కలిపి ఉతకకూడదు. వీటిని సపరేటుగా ఉతకాలి. గోరు వెచ్చటి నీటిలో నానబెట్టి.. తక్కువ సబ్బు పెట్టి ఉతకాలి. ఎక్కువగా బండకేసి బాధకూడదు. గోరు వెచ్చటి నీటిలో సర్ఫ్ వేసి నానబెడితో సగం మురికి పోతుంది.

బ్రెష్ కూడా కొట్టకూడదు. ఇలా చేస్తే త్వరగా చిరిగిపోతాయి. అలాగే ఉన్ని దుస్తులను కేవలం చేతితో మాత్రమే ఉతకాలి. వాషింగ్ మిషన్స్‌లో వేసి ఉతికితే పాడైపోతాయి. వాటికి ఉన్న దారాలు బయటకు వచ్చేస్తాయి.

ఒక వేళ వీటిపై మొండి మరకలు ఉంటే.. వాటిని ఉతికేందుకు బేకింగ్ సోడా, షాంపూ వేసి చేతితో రుద్దండి. ఆ తర్వాత ఎండలో ఆరేస్తే మొండి మరకలు ఏమన్నా ఉంటే సులభంగా పోతాయి. ఇలా ఉతికితే ఉన్ని దుస్తులు ఎక్కువు రోజులు మన్నుతాయి.




