Tirupati: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. తిరుపతి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు షురూ..!

విదేశాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని కేంద్రం తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ నుంచి సింగపూర్‌కు ప్రైవేటు విమాన సేవలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే తొలి ఇంటర్నేషనల్ ఫ్లైట్ గురువారం గాలిలోకి ఎగిరింది.

Tirupati: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. తిరుపతి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు షురూ..!
Tirupati Airport
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 06, 2024 | 7:42 AM

టెంపుల్ సిటీ తిరుపతి విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు మొదలు అయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కృషితో తిరుపతి నుంచి సింగపూర్‌కు ప్రైవేట్ విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. శుక్రవారం(డిసెంబర్ 6) ఉదయం 5 గంటలకు MS లక్స్ ఏవియేషన్ సంస్థకు చెందిన తొలి ఇంటర్నేషనల్ ఫ్లైట్ రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌ నుంచి సింగపూర్‌కు బయలుదేరింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదేశాలతో అంతర్జాతీయ విమాన సర్వీసుల రాకపోకలకే లక్ష్యంగా సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చామన్నారు ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్ శ్రీనివాసరావు. శ్రీవారిని దర్శనం కోసం విదేశాల నుంచి తిరుపతికి భక్తులు వస్తుంటారు. అయితే విదేశాల నుంచి భక్తులు చెన్నై లేదా బెంగళూరు, హైదరాబాద్ ఎయిర్ పోర్టులకు వెళ్లి అక్కడి నుంచి రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకోవాల్సి ఉంటుంది. ఆపై తిరుమల చేరుకుంటున్నారు.

ఇలా విదేశీ యాత్రికులు రెండుసార్లు ఫైట్ జర్నీ చేయాల్సి వస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ నుంచి సింగపూర్‌కు ప్రైవేటు విమాన సేవలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే తొలి ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఉదయం 5 గంటలకు తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ నుంచి సింగపూర్‌కు బయలుదేరింది. తిరుపతి నుంచి సింగపూర్‌కు డైరెక్ట్‌ విమాన సేవలు ప్రారంభంకావంతో శ్రీవారి భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..