AP Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. బాబోయ్.! ఏపీకి మళ్లీ వర్షాలే వర్షాలు.. వెదర్ రిపోర్ట్

ఏపీకి మరో వాన గండం పొంచి ఉంది. డిసెంబర్ 12 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరి వచ్చే 3 రోజులు వాతావరణ సూచనలు ఇలా..

AP Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. బాబోయ్.! ఏపీకి మళ్లీ వర్షాలే వర్షాలు.. వెదర్ రిపోర్ట్
Ap Rains
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 08, 2024 | 2:17 PM

ఆగ్నేయ బంగాళాఖాతం & ఆనుకుని ఉన్న భూమధ్య రేఖ ప్రాంత హిందూ మహాసముద్రంలో అల్పపీడన ప్రాంతం దాని అనుబంధ ఉవపరితల ఆవర్తనంతో మధ్య ట్రోపోస్పిరిక్ స్థాయిల వరకు విస్తరించి కొనసాగుతుంది. ఇది రాగాల 24 గంటలలో పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి మరింత బలపడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది పశ్చిమ-వాయువ్య దిశగా పయనిస్తూ డిసెంబర్ 11 నాటికి నైరుతి బంగాళాఖాతం అనగా శ్రీలంక-తమిళనాడు తీరం చేరుకునే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో దక్షిణ / నైరుతి దిశ గా గాలులు వీస్తున్నాయి.

ఇది చదవండి: పుష్ప 2 మూవీలో ఈ హీరోయిన్ ఎవరో తెల్సా.. బ్యాగ్రౌండ్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే

———————————- వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు : —————

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :- —————————————-

ఈరోజు, రేపు, ఎల్లుండి:-

ఇవి కూడా చదవండి

తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:- ——————————

ఈరోజు, రేపు, ఎల్లుండి:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ:- —————–

ఈరోజు, రేపు, ఎల్లుండి:-

తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.

ఇది చదవండి: ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో ఏంటని చూడగా

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.