Viral Video: నీటిలో తేలియాడుతున్న నల్లటి ఆకారం.. ఏంటా అని చూడగా.. బాబోయ్
సరీసృపాలలో అనకొండ చాలా పెద్ద పాము. కాయంలోనే కాదు పొడవులోనూ భారీగా ఉంటుంది. సోషల్ మీడియాలో అనకొండకు సంబంధించిన వీడియోలు చాలానే ఉన్నాయి. ఆ తరహ వీడియో ఒకటి..
ప్రపంచం నలుమూలల ఎన్నో జాతులకు చెందిన సరీసృపాలు ఉన్నాయి. కింగ్ కోబ్రా, రాటెల్ స్నేక్, వైపర్, పైథాన్, అనకొండ.. ఇలా ఎన్ని ఉన్నా.. అన్నింటిలో కన్నా అనకొండ అతిపెద్దదిగా పరిగణిస్తారు. డైనోసర్ కాలంలో జీవించిన టైటానోబోవా పాము ఆకారంలో.. అలాగే పొడవులో భారీగా ఉంటుంది. అనకొండ కూడా ఇదే తరహాలో భారీ కాయంతో పొడవైన పాముగా పేరుగాంచింది. ఇక సోషల్ మీడియాలో అనకొండకు సంబంధించిన వీడియోలు తెగ చక్కర్లు కొడుతుంటాయి. ఈ తరహ ఓ ఘటన తాజాగా థాయిలాండ్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. విస్తారంగా కురిసిన వర్షాలు కారణంగా థాయిలాండ్ రోడ్లన్ని కూడా జలమయమయ్యాయి. ఇక ఆ రోడ్లపై అనకొండ దర్శనమిచ్చి.. జనాలకు షాక్ ఇచ్చింది. నీటిలో చిక్కుకున్నట్టు కనిపించిన ఆ అనకొండ పొట్ట ఉబ్బినట్టు కనిపిస్తోంది. అప్పుడే ఏదో జంతువును తిని.. తన ఆవాసానికి వెళ్లినట్టుగా ఉంది. స్థానికులు చెబుతున్న ప్రకారం.. ఆ అనకొండ కుక్కను తిని.. బాగా బరువెక్కి.. నీటిలో మునిగిందని చెబుతున్నారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఇంత భారీ కొండచిలువను తాము ఎప్పుడూ చూడలేదని అవాక్ అవుతున్నారు. లేట్ ఎందుకు వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..