మరికాసేపట్లో తాళి కడతాడనగా పెళ్లి మండపాన్ని ధ్వంసం చేసిన కుక్క

మరికాసేపట్లో తాళి కడతాడనగా పెళ్లి మండపాన్ని ధ్వంసం చేసిన కుక్క

Phani CH

|

Updated on: Dec 06, 2024 | 7:29 PM

మరికాసేపట్లో వధువు మెడలో వరుడు తాళి కట్లాల్సి ఉంది. ఇంతలో అనుకోని అతిథిలా వచ్చి, బీభత్సం సృష్టించింది. పెళ్లి కూతురుకైతే పట్టపగలే చుక్కలు చూపించింది. ఇంతకీ ఆ అతిథి ఏమిటంటారా? ఆ ఇంటి పెంపుడు కుక్క. అవును మరి.. పెళ్లిళ్లలో జరిగే ఆసక్తికర ఘటనలు, ఫన్నీ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ ఉంటాయి.

వాటిల్లో కొన్ని వీడియోలు భావోద్వేగానికి గురిచేస్తాయి, మరికొన్ని చిరునవ్వు తెప్పిస్తాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అందులో ఓ కుక్క పెళ్లి మండపంలోకి ప్రవేశించి బీభత్సం సృష్టిస్తోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. వివాహ కార్యక్రమం జరుగుతోంది. వధువు పీటల మీద కూర్చుని పెళ్లి కార్యక్రమాలు పూర్తి చేస్తోంది. అప్పుడే ఓ పెంపుడు కుక్క మండపంలోకి ప్రవేశించి కళ్యాణ మండపంలో అటూ ఇటూ తిరుగుతూ బీభత్సం సృష్టించింది. కుక్కను చూసి మండపంలో ఉన్నవారు భయపడి పరుగులు తీశారు. ఆ తర్వాత ఆ కుక్క వేదిక మీదకు ఎక్కి వధువును భయపెట్టింది. వధువును చూసి అరుచుకుంటూ మీదకు వెళ్లేందుకు ప్రయత్నించింది. దీంతో భయపడిన వధువు కేకలు వేసుకుంటూ అటూ ఇటూ పరుగులు పెట్టింది. ఎంతో అందంగా అలంకరించిన మండపం ఆ హడావుడిలో ధ్వంసమైంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అంతరిక్ష వ్యర్థాలతో పెను ప్రమాదం

అపచారం అపచారం.. గర్భగుడిలో కేక్ కటింగా ??

ఐక్యూలో ఐన్‌స్టీన్‌ను మించిపోయాడు !! పదేళ్ల భారత సంతతి కుర్రాడు క్రిష్‌ అరోరా

చిల్గోజా నట్స్‌ తెలుసా ?? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు

ఎవరు ఎప్పుడు చచ్చిపోతారో చెప్పే డెత్ క్లాక్