ఐక్యూలో ఐన్‌స్టీన్‌ను మించిపోయాడు !! పదేళ్ల భారత సంతతి కుర్రాడు క్రిష్‌ అరోరా

ఐక్యూలో ఐన్‌స్టీన్‌ను మించిపోయాడు !! పదేళ్ల భారత సంతతి కుర్రాడు క్రిష్‌ అరోరా

Phani CH

|

Updated on: Dec 06, 2024 | 7:18 PM

బ్రిటన్‌కు చెందిన పదేళ్ల భారత సంతతి బాలుడు క్రిష్ అరోరా ఐక్యూలో శాస్త్రవేత్తలు ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్‌లను మించిపోయాడు. పశ్చిమ లండన్‌లోని హౌన్స్‌కు చెందిన క్రిష్.. గణితం నుంచి సంగీతం వరకు అన్ని రంగాల్లోనూ అత్యంత జీనియస్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐక్యూ టెస్ట్‌లో 162 స్కోరు సాధించాడు. ఈ క్రమంలో తన హీరోగా చెప్పుకునే ఐన్‌స్టీన్ కంటే రెండు మార్కులు ఎక్కువే సాధించడం గమనార్హం.

క్రిష్ తన మేధతో అత్యంత ఐక్యూ కలిగిన వారికి మాత్రమే పరిమితమైన ‘మెన్సా సొసైటీ’లో సభ్యత్వం సాధించాడు. నాలుగేళ్ల వయసులోనే గణిత పుస్తకాన్ని మూడు గంటల్లో పూర్తిచేసిన క్రిష్.. 8 ఏళ్ల వయసులో తన క్లాస్ సబ్జెక్టులను ఒక్క రోజులోనే పూర్తి చేసి ఔరా అనిపించాడు. 11 ప్లస్ ఎగ్జామ్స్ చాలా ఈజీ అన్న ఈ కుర్రాడు తనకు స్కూలుకు వెళ్లాలని అనిపించదని, అక్కడ చిన్నచిన్న వాక్యాలు, చిన్నచిన్న లెక్కలు చేయడంతోనే సరిపోతోందని వాపోయాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చిల్గోజా నట్స్‌ తెలుసా ?? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు

ఎవరు ఎప్పుడు చచ్చిపోతారో చెప్పే డెత్ క్లాక్

ఆ ఊళ్లో మద్యం తాగినా, అమ్మినా రూ.2 లక్షల జరిమానా..

మాస్క్ పెట్టుకుంటే పులి పారిపోతుందా ??