అపచారం అపచారం.. గర్భగుడిలో కేక్ కటింగా ??

అపచారం అపచారం.. గర్భగుడిలో కేక్ కటింగా ??

Phani CH

|

Updated on: Dec 06, 2024 | 7:20 PM

ఇటీవల కొందరు ఇన్‌ప్లుయెన్సర్ల చర్యలు శృతి మించుతున్నాయి. పబ్లిక్ ప్రదేశాలు, ఆరాధనా ప్రదేశాలు అని చూడకుండా పిచ్చిచేష్టలకు పాల్పడుతున్నారు. వారి చేష్టల వలన తోటి వారు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే మమతా రాయ్‌ అనే ఇన్‌ఫ్లుయెర్స్‌ చేసిన చర్యకు కాల బైరవ ఆలయంలో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో కాలభైరవ దేవాలయం ఉంది.

తన పుట్టినరోజు సందర్భంగా దేవాలయానికి వచ్చిన మమతా రాయ్‌ దైవదర్శనం చేసుకుంది. అనంతరం ఆలయంలో తన పుట్టినరోజు వేడుకను నిర్వహించింది. తన వెంట తెచ్చుకున్న బర్త్‌డే కేకును కాలభైరవ గర్భగుడిలో విగ్రహం ఎదుట కట్‌ చేయడం వివాదాస్పదమైంది. అంతేకాకుండా ఆ తతంగాన్ని వీడియో షూట్ చేయించింది. కాలభైరవ విగ్రహం ఎదుట మమతారాయ్‌ బర్త్‌డే కేక్‌ కట్‌ చేసిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. పవిత్రమైన దేవాలయంలో ఆమె కేక్‌ కట్‌ చేయడంపై భక్తులు, మతపెద్దలు మండిపడుతున్నారు. పుట్టినరోజున దైవదర్శనం చేసుకోవడం మంచిదే. ఇలా కేక్‌ కట్‌ చేయడమేంటని.. ఇలా చేయమని ఎవరు చెప్పారని ప్రశ్నిస్తున్నారు. మమతారాయ్‌పై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఆమె.. భక్తుల మనోభావాలను దెబ్బతీశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఐక్యూలో ఐన్‌స్టీన్‌ను మించిపోయాడు !! పదేళ్ల భారత సంతతి కుర్రాడు క్రిష్‌ అరోరా

చిల్గోజా నట్స్‌ తెలుసా ?? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు

ఎవరు ఎప్పుడు చచ్చిపోతారో చెప్పే డెత్ క్లాక్

ఆ ఊళ్లో మద్యం తాగినా, అమ్మినా రూ.2 లక్షల జరిమానా..

మాస్క్ పెట్టుకుంటే పులి పారిపోతుందా ??