ఎవరు ఎప్పుడు చచ్చిపోతారో చెప్పే డెత్ క్లాక్

ఎవరు ఎప్పుడు చచ్చిపోతారో చెప్పే డెత్ క్లాక్

Phani CH

|

Updated on: Dec 06, 2024 | 6:49 PM

టెక్నాలజీ రోజు రోజుకీ అభివృద్ధి చెందుతోంది. ఎంతలా అంటే.. మనిషి మరణం ఎప్పుడో చెప్పే స్థాయికి చేరిపోయింది. అవును, మనిషి మరణించే తేదీని అంచనా వేసే దిశగా టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు. ఇటీవల వచ్చిన ఏఐ దాదాపు అన్ని రంగాల్లోనూ విస్తరించింది. కృత్రిమమేథ పరిధి పెరుగుతోంది. కిచెన్‌లో రిఫ్రిజిరేటర్‌, టీవీ, మొబైల్‌ ఫోన్‌, ఫ్యాన్‌.. వంటి అన్ని విభాగాల్లోకి ఏఐ ప్రవేశించింది.

సమీప భవిష్యత్తులో మనిషిని ప్రత్యక్షంగా, పరోక్షంగా శాసించే స్థాయికి ఏఐ వెళ్లనుందనేది కఠోర సత్యం. దీని సాయంతో చాలా కంపెనీలు సమాచారాన్ని సేకరించి సులువుగా పని అయ్యేలా చూస్తున్నాయి. కొన్ని సంస్థలు మరింత విభిన్నంగా ఆలోచించి మనిషి మరణ తేదీని అంచనా వేసేందుకు ఉపయోగిస్తున్నాయి. మనిషి జీవనశైలి, ఆహార అలవాట్లు, శారీరక శ్రమ, ఒత్తిడి.. వంటి వివరాలు అందించి మరణానికి మరెంత సమయం ఉందో తెలుసుకునేందుకు ఏఐ సాయం కోరుతున్నాయి. ఈమేరకు మార్కెట్లో కొత్తగా యాప్‌లు వెలుగులోకి వస్తున్నాయి. వీటిపై వినియోగదారుల్లో ఆసక్తి నెలకొనడంతో ఈ యాప్స్ కు ఆదరణ పెరుగుతోంది. ‘డెత్ క్లాక్’ అనే కృత్రిమ మేథ ఆధారిత యాప్ వినియోగదారుల జీవనశైలి, అలవాట్ల ఆధారంగా వారి ఆయుష్షును అంచనా వేయగల సామర్థ్యంతో పని చేస్తుంది. దీన్ని జులైలో ప్రారంభించినప్పటి నుంచి చాలామంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ ఊళ్లో మద్యం తాగినా, అమ్మినా రూ.2 లక్షల జరిమానా..

మాస్క్ పెట్టుకుంటే పులి పారిపోతుందా ??

Published on: Dec 06, 2024 06:45 PM