అంతరిక్ష వ్యర్థాలతో పెను ప్రమాదం

అంతరిక్ష వ్యర్థాలతో పెను ప్రమాదం

Phani CH

|

Updated on: Dec 06, 2024 | 7:28 PM

అంతరిక్ష వ్యర్థాలు శాస్త్రవేత్తలను కలవరపెడుతున్నాయి. ఉపగ్రహ ప్రయోగాలతో భూదిగువ కక్ష్య.. వీటితోనే కిక్కిరిసిపోయే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి ప్యానల్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం భూ దిగువ కక్ష్యలో 14,000 ఉపగ్రహాలు సంచరిస్తున్నాయి. వీటిలో 3,500 నిరుపయోగమైనవి. ఇక ఈ ప్రయోగాల కారణంగా 12 కోట్ల రాకెట్‌ శకలాలు కూడా ఉన్నట్లు అమెరికాకు చెందిన స్లింగ్‌షాట్‌ ఏరోస్పేస్‌ గణంకాలు చెబుతున్నాయి.

వీటిలో కొన్ని ట్రక్కు సైజులోవి కూడా ఉన్నాయట. ఉపగ్రహాలు ఢీకొనకుండా చూసేందుకు వాటిని నిర్వహించే ప్రభుత్వం లేదా ప్రైవేటు సంస్థలు సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవాలని ఐక్యరాజ్యసమితి పానెల్‌ కోరింది. ప్రస్తుతం అంతరిక్ష ప్రయోగాలు చేయగల సామర్థ్యం ఉన్న దేశాలను సమన్వయం చేసేందుకు ఎటువంటి వ్యవస్థ లేదు. కొన్ని దేశాలు తమ ఉపగ్రహాల డేటాను భద్రతా కారణాలతో పంచుకోవడానికి సిద్ధంగా లేవు. ఈ ఏడాది చైనా రాకెట్‌ ఒకటి అంతరిక్షంలో పేలిపోయింది. ఇక జూన్‌లో రష్యాకు చెందిన ఉపగ్రహం కూడా బ్లాస్ట్ అయ్యింది. వీటినుంచి వేల శకలాలు రావడంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములు దాదాపు గంటసేపు దాక్కోవాల్సిన పరిస్థితి తలెత్తింది. రానున్న సంవత్సరాల్లో వేల సంఖ్యలో ఉపగ్రహాలు అంతరిక్షంలోకి చేరనున్నాయి. దీంతో ఇవి పరస్పరం ఢీకొనే ముప్పు పెరిగింది. ఫలితంగా రానున్న ఐదేళ్లలో నష్టం విలువ రూ.4 వేల కోట్లకు పైగా ఉంటుందని మాంట్రియల్‌లోని నార్త్‌స్టార్‌ ఎర్త్‌ అండ్‌ స్పేస్‌ సంస్థ లెక్కగట్టింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అపచారం అపచారం.. గర్భగుడిలో కేక్ కటింగా ??

ఐక్యూలో ఐన్‌స్టీన్‌ను మించిపోయాడు !! పదేళ్ల భారత సంతతి కుర్రాడు క్రిష్‌ అరోరా

చిల్గోజా నట్స్‌ తెలుసా ?? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు

ఎవరు ఎప్పుడు చచ్చిపోతారో చెప్పే డెత్ క్లాక్

ఆ ఊళ్లో మద్యం తాగినా, అమ్మినా రూ.2 లక్షల జరిమానా..