Viral: ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో ఏంటని చూడగా
ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ నిండా పురాతన నాణేల వెలికితీత వార్తలే చూస్తూనే ఉన్నాం. సరిగ్గా ఇలాంటి తరహ ఓ ఘటన సెంట్రల్ ఇంగ్లాండ్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా..
పాడుపడిన ఇళ్లను కూల్చుతుండగా, లేదా ఇంటి నిర్మాణ పనుల్లో, అది కూడా కాదు.. పురావస్తు తవ్వకాలు ఏదైనా.. ఇలాంటివి జరుగుతున్నప్పుడు చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు, పురాతన నాణేలు, నిధి నిక్షేపాలు లాంటివి బయటపడుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటివి ఈ మధ్యకాలంలో చాలానే వార్తలు వింటున్నాం. తాజాగా ఈ కోవకు చెందిన ఓ ఘటన సెంట్రల్ ఇంగ్లాండ్‌లో చోటు చేసుకుంది. ఓ స్థలంలో ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతుండగా.. మట్టిలో మెరుస్తూ ఏదో కనిపించింది. ఏంటా అని చూడగా.. ఈ స్టోరీ చూసేయండి.
వివరాల్లోకి వెళ్తే.. సెంట్రల్ ఇంగ్లాండ్‌లోని ఓ నిర్మాణ స్థలంలో ఒక లక్షా 25 వేల డాలర్లు విలువ చేసే రోమన్ సామ్రాజ్యానికి చెందిన పురాతన నాణేలు బయటపడ్డాయి. నిర్మాణ పనులకు తవ్వకాలు జరుపుతుండగా.. మట్టిలో మెరుస్తూ కనిపించింది చూసి కూలీలు.. దాన్ని వెలికితీశారు. అదొక మట్టి కుండ కాగా.. దానిలో సుమారు 1,368 రోమన్ నాణేలు లభ్యమయ్యాయి.
ఆ మట్టి కుండ వోర్సెస్టర్‌షైర్ ప్రాంతంలో తయారు చేసినదిగా ఆ ప్రాంతం మ్యూజియం సిబ్బంది తెలిపారు. బహుశా దొరికిన పురాతన నాణేలు ఆ ప్రాంతంలో నివాసముండే ఒక సంపన్న రైతుకు చెందినవి కావచ్చు. అతడు రోమన్ సైన్యానికి ధాన్యం, పశువులను సరఫరా చేసి డబ్బు సంపాదించి ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు పురావస్తు అధికారులు. ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయమేమిటంటే.. గత 25 ఏళ్లలో ఆ ప్రాంతంలో దొరికిన మూడో పురాతన నాణేల మూట ఇదేనట. 2011వ సంవత్సరంలో ఇద్దరు మెటల్ డిటెక్టర్ల సాయంతో 3,784 నాణేలతో నిండిన మట్టి కుండను కనుగొనగా, అదే విధంగా 1999వ సంవత్సరంలో 434 వెండి నాణేలు, 38 కుండల శకలాలు బయటపడ్డాయని అంతర్జాతీయ మీడియా చెబుతోంది.(Source)
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..