AP News: పైకి చూస్తే లారీ అంతా పేపర్ బండిల్సే.. కానీ లోపల చెక్ చేయగా
పైకి చూస్తే అవన్నీ పేపర్ బండిల్స్.. తీరా లోపల చెక్ చేయగా పోలీసులు షాక్ అయ్యారు. పేపర్ బండిల్స్ మధ్యలో చప్పుడు కాకుండా రవాణా అవుతున్న లోగుట్టంతా రట్టయింది. ఇంతకీ ఆ మ్యాటర్ ఏంటంటే.?
ఎన్ని చట్టాలు వచ్చినా.. అధికారులు ఎంతలా నిఘా పెట్టినా.. అక్రమ దందా మాత్రం యదేచ్చగా సాగిపోతోంది. కేటుగాళ్లు క్రియేటివిటీకి పదునుపెట్టి మరీ.. సరుకు రాష్ట్రం దాటిస్తున్నారు. తాజాగా ఈ తరహ ఘటన ఒకటి ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో చోటు చేసుకుంది. కాజా టోల్ ప్లాజా వద్ద భారీగా ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు మంగళగిరి పోలీసులు. చెన్నై నుంచి విశాఖపట్నానికి వెళ్తున్న లారీలో పేపర్ బందిల్స్ మధ్య ఎర్రచందనం దుంగలు పెట్టి రవాణా చేస్తోంది ఈ మాఫియా. పోలీసులు ముందస్తు సమాచారం మేరకు టోల్ గేట్ వద్ద తనిఖీలు చేపట్టగా.. ఈ లోగుట్టంతా రట్టయింది. రెండున్నర టన్నుల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. లారీని మంగళగిరి రూరల్ పీఎస్‌కి తరలించారు. పరారీలో ఉన్న ముఠా కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వైరల్ వీడియోలు
Latest Videos