Viral: టాయిలెట్ డోర్ ఓపెన్ చేయగా దిమ్మతిరిగే సీన్.. దెబ్బకు కళ్లు బైర్లు కమ్మాయ్

Viral: టాయిలెట్ డోర్ ఓపెన్ చేయగా దిమ్మతిరిగే సీన్.. దెబ్బకు కళ్లు బైర్లు కమ్మాయ్

Ravi Kiran

|

Updated on: Dec 05, 2024 | 7:58 PM

వాష్‌రూంకు ఎందుకు వెళ్తాం.. ఏంటీ సిల్లీ క్వశ్చన్‌ అంటారా.. ఆగండాగండి ఇక్కడే ఉంది అసలు కిటుకు. వాష్‌రూంకు మనం రిలాక్స్‌ కావడానికో.. లేదంటో ఇతరత్రా పనులను పూర్తి చేసుకునేందుకే కదా వెళ్తాం.. కానీ అక్కడ ఊహించనివి ఎదురైతే..

టాయిలెట్‌ డోర్ ఓపెన్ చేయగానే ఓ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. కమోడ్‌లోని సిరామిక్స్‌లో ఇరుక్కున్న మానిటర్ లిజార్డ్‌‌ను గుర్తించాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి చాకచక్యంగా ఆ లిజార్డ్‌ను సిరామిక్స్ నుంచి బయటకు తీశాడు. ఇన్‌స్టాలో ఈ వీడియోకు 1.1 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. జంతు లవర్ శ్యామ్ గోవింద్‌ ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకున్నాడు. తొలగించే క్రమంలో మానిటర్ లిజార్డ్‌కు చిన్న చిన్న గాయాలు తగిలాయి. అనంతరం ఆ జీవికి చికిత్స చేశారు. ఆ వీడియోపై మీరూ లుక్కేయండి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

 

 

Published on: Dec 05, 2024 07:57 PM