Andhra Pradesh: గంజాయి రవాణాకు సరికొత్త పంథా.. అద్దె ఇల్లు తీసుకుని ఏజెన్సీ టూ వయా ముంబై
నిందితులు పరారీలో ఉన్నట్లు గుర్తించి ఇంటి యజమానులు వద్ద నిందితులు కోసం ఆరా తీశారు. తమ ఇంట్లోనే గంజాయి స్టాక్ పాయింట్ పెట్టారన్న విషయం తెలుసుకొని యజమానులే అవ్వక్కయ్యారు. కాలనీ వాసులంతా నోరేళ్లపెట్టారు. అసలు విషయం తెలుసుకొని అవాక్కయ్యారు. అయితే.. నిందితులకు సంబంధించి ఎటువంటి సమాచారం వారికి తెలియదని వారి ఫోటో ID కార్డ్స్ కూడా తీసుకోలేదని తెలిపారు ఇంటి యజమాని ధనలక్ష్మి.
గంజాయి స్మగ్లర్లు రూటు మార్చారు.. ఒకేసారి ఎక్కువ మొత్తంలో తీసుకెళ్తే పట్టుబడతానేమోనన్న నెపంతో.. ఇప్పుడు స్టాక్ పాయింట్లు పెట్టుకొని మరీ స్మగ్లింగ్ చేసేస్తున్నారు. అందుకోసం విశాఖ సిటీనే కేంద్రంగా ఎంచుకున్నారు. అద్దె ఇళ్లనే టార్గెట్ చేస్తున్నారు. మూడో కంటికి తెలియకుండా కొరియర్ బాయ్స్ లా అనుకున్న టైం లో సరిహద్దులు దాటించేస్తున్నారు. ఏజెన్సీ టు ముంబై వయా విశాఖ..సాగుతుంది ఇలా.. విశాఖ నడి బొడ్డున అది ఓ చిన్న కాలనీ..! పేరు అచ్చమ్మ పేట కాలనీ.. గోకుల్ థియేటర్ సమీపంలో..! అక్కడ నివసించేది పేద మధ్య తరగతి కుటుంబాలే. కానీ ఇక్కడున్న అద్దె ఇళ్లను టార్గెట్ చేస్తున్నాయి కొంతమంది ముఠాలు. ఎవరికి అనుమానం రాకుండా.. కూలీల పేరుతో అద్దెకు దిగి.. గంజాయి దందా సాగించేస్తున్నారు. ఏజెన్సీ నుంచి కొంతమంది వాళ్లతో లింక్అప్ అయిన ఇతర రాష్ట్రాలకు చెందిన మరి కొంత మంది బస చేస్తారు. ఆ తర్వాత కొన్ని రోజులకు వారి పని ప్రారంభిస్తున్నారు.
అద్దెకు దిగి.. ఆ తర్వాత…
విశాఖలో అద్దెల కోసం అని వచ్చి.. కొంతమంది గంజాయి కార్యకలాపాలు ప్రారంభిస్తున్నారు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఇంటి యజమానులకు మాయమాటలు చెప్పి… కథ నడిపించేస్తున్నారు. ‘ఇద్దరు ముగ్గురే ఉంటాం.. కూలీ పనులు చేసుకుంటాం.. గొడవ అల్లర్లు అస్సలు చేయడం.. అద్దె సకాలంలో చెల్లించేస్తాం..’ అంటూ నమ్మబలుకుతున్నారు. బ్యాచిలర్స్ కు అద్దె ఇల్లు ఇవ్వమని చెబితే.. ఫ్యామిలీ కూడా తీసుకొస్తామని నమ్మిస్తున్నారు. ఇలా అద్దె ఇంట్లో దిగి.. నమ్మకస్తులుగా ఉంటూ గంజాయి దందా ప్రారంభించేస్తున్నారు.
స్టాక్ పాయింట్లు పెట్టుకొని మరి..
ఇలా విశాఖలో పెందుర్తి గాజువాకలో గుట్టు చప్పుడు కాకుండా స్టాక్ పాయింట్లను పెట్టి వ్యవహారాలను నడుపుతున్న ముఠాలను గతంలో పట్టుకున్నారు పోలీసులు. తాజాగా.. రెండవ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో అచ్చమ్మ పేట వద్ద నుంచి అక్రమంగా గంజాయి నిల్వ చేసి, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఆ ప్రాంతంలో పోలీసులు విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. మనో రమ థియటర్ సమీపంలో సాయిబాబా గుడి వద్ద ఒక ఇంటిలో ఏడు బ్యాగుల్లో గంజాయి రవాణా చేయడానికి సిద్దంగా ఉంచినట్లు గుర్తించారు. ఎన్.డి.పి.ఎస్ యాక్ట్ నందు కేసు నమోదు చేసి సుమారు 200 కేజీలు గంజాయిని సీజ్ చేశారు. సిపి రవిశంకర్ అయ్యనార్ స్వయంగా రంగంలోకి దిగి కేసు పై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
ఇంటి యజమానుల నిర్లక్ష్యమే వాళ్లకు కలిసొస్తుంది..
పోలీసులకు వెళ్లిన సమయంలో.. నిందితులు పరారీలో ఉన్నట్లు గుర్తించి ఇంటి యజమానులు వద్ద నిందితులు కోసం ఆరా తీశారు. తమ ఇంట్లోనే గంజాయి స్టాక్ పాయింట్ పెట్టారన్న విషయం తెలుసుకొని యజమానులే అవ్వక్కయ్యారు. కాలనీ వాసులంతా నోరేళ్లపెట్టారు. అసలు విషయం తెలుసుకొని అవాక్కయ్యారు. అయితే.. నిందితులకు సంబంధించి ఎటువంటి సమాచారం వారికి తెలియదని వారి ఫోటో ID కార్డ్స్ కూడా తీసుకోలేదని తెలిపారు ఇంటి యజమాని ధనలక్ష్మి.
కూపీ లాగితే దొంకంతా కదిలింది..
కుపి లాగితే ఒక్కొక్కరు బయటపడ్డారు. ఇంటిని అద్దెకి తీసుకున్న చెవ్వాకుల రామును ట్రాక్ చేసి అరెస్ట్ చేశారు పోలీసులు. అతని విచారించిన పోలీసులకు.. తీగ లాగితే డొంక కదిలేనంత పని అయింది. అల్లూరి జిల్లాకు చెందిన జర్రిపోతుల తాతాజీ రమణ గంజాయి సేకరించి పెట్టేవాడు. కొర్ర చిరంజీవి, పాండు కలిసి వాహనాల ద్వారా గంజాయిని విశాఖ వరకు తరలించేవారు. ఆ వాహనానికి పైలట్ గా ఆదిరాజు నాయుడు, దుర్గాప్రసాద్, శివకృష్ణ కూర్మారావు ఉంటూ ఎక్కడ ఎవరికి అనుమానం రాకుండా చూసుకునేవారు. వీరందరినీ అరెస్ట్ చేసిన పోలీసులు రాముని విచారించారు.. తమిళనాడు రాష్ట్రం తిరుచి కి చెందిన రాము.. గంజాయిని మహమ్మద్ అబ్బాస్ కు అందజేసేవాడు.. ఈ విషయాన్ని చెవ్వాకుల రాము తాను తమిళనాడు రాష్ట్రం తిర్చికి చెందిన మిస్టర్ షేక్ మహమ్మద్ అబ్బాస్‌కు గంజాయిని సరఫరా చేసినట్లు చెప్పాడు. రాము ఇచ్చిన సమాచారం తో షేక్ మహ్మద్ అబ్బాస్, అతని సహాయకుడు సిరాజుద్దిన్ అరెస్ట్ చేశామన్నారు డీసీపీ శ్రీనివాసరావు.
తరలింపు ఇలా..
విచారణ సమయంలో షేక్ మహ్మద్ అబ్బాస్ తాను ముంబై సబ్-అర్బన్, బోరివాలికి చెందిన అముద, కునాల్‌లకు గంజాయిని సరఫరా చేసినట్లు ఒప్పుకున్నాడు. ఇలా ఏజెన్సీ టు ముంబై వయా విశాఖ గంజాయిని సరఫరా చేస్తున్నారు. కిలోల కొద్ది తీసుకొచ్చి స్టాక్ పాయింట్లు పెట్టి మరి.. కిలోల కిలోల చొప్పున వేరు వేరుగా మూడో కంటికి తెలియకుండా పార్సల్ చేసేస్తున్నారు. ఈ కేసు లో పోలీసులు మరి కొంతమంది కోసం గాలిస్తున్నారు. రెండు కార్లను సీజ్ చేశామన్నారు డీసీపీ శ్రీనివాసరావు.
గంజాయి లభిస్తే.. ఆ ఇంటిని..
అయితే.. ఈ కేసులో ఇంటి యజమాని నిర్లక్ష్యం కూడా కనిపించినట్టు పోలీసులు గుర్తించారు. ఎందుకంటే గుర్తు తెలియని వారికి అద్దెకు ఇవ్వడమే కాకుండా.. అద్దెకు దిగిన తర్వాత కూడా కనీసం వారి గుర్తింపు కూడా తీసుకోక పోవడం బాధ్యత రాహిత్యంగా పోలీసులు నిర్ధరించారు. ఎటువంటి వివరాలు తీసుకోకుండా ఇంటిని అద్దెకు ఇచ్చి గంజాయి అక్రమ రవాణాకు కారణమయినందుకు గానూ.. గంజాయి లభ్యమైన ఆ ఇంటిని సీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు . నగరంలో ఎవరికైనా ఇంటిని అద్దెకు ఇచ్చే సమయంలో వారి పూర్తి సమాచారంతో పాటుగా ఫోటో ఐడి కార్డ్ తప్పనిసరిగా తీసుకోవడంతో పాటూ పోలీస్ వెరిఫికేషన్ చేసుకొని అద్దెకు ఇవ్వడం సురక్షితం అన్నారు సిపి.
అప్రమత్తంగా ఉండాలి..
గతంలోనూ ముందు కూడా ఇలా పెందుర్తి , గాజువాక ఏరియాలలో గంజాయి పంపిణీ కేంద్రముగా ఉన్న రెండు ఇళ్లను పట్టుకొని ఎన్.డి.పి.ఎస్ యాక్ట్ నందు సీజ్ చేశారు. అయితే.. ఈ కేసులో కొరియర్, పార్సెల్ సర్వీసెస్ మూటల్లో గంజాయి లభించడం పోలీసుల అనుమానాలకు మరింత పెంచింది. కొరియర్ సర్వీస్ ద్వారా గంజాయి తరలిపోతుందా అన్న కోణం లోనూ దృష్టి సారించారు పోలీసులు. కొరియర్ పార్సిల్ సంస్థలకు ప్రత్యేక సూచనలు జారీ చేశారు. గంజాయి పార్సెల్ లభిస్తే.. కొరియర్ సంస్థలను బాధ్యులుగా చేస్తామని హెచ్చరించారు. నగరంలో అద్దెకు ఇళ్లకు ఇచ్చే వాళ్లు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. సో బీ అలర్ట్.. ఇంటికి అద్దం ఇచ్చే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించుకొని అడుగు వేస్తే మంచిది. లేకుంటే గంజాయి కేసుల్లో చిక్కుకోక తప్పదని సున్నితంగా సూచిస్తున్నారు పోలీసులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..