Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indrakeeladri: హిందూధర్మ ప్రచారానికి శ్రీకారం.. దుర్గమ్మ ప్రచార రథం ప్రారంభం.. రేపటి నుంచి వివిధ గ్రామాల్లో గ్రామోత్సవం..

వైదిక కమిటీ ఆధ్వర్యంలో ఏపీలోని వివిధ గ్రామాల్లో గ్రామోత్సవాన్ని నిర్వహించడానికి ఈ రోజు దుర్గామల్లేశ్వర స్వామి, అమ్మవార్లకు పూజలు చేసి ప్రచర రథాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈఓ కె ఎస్ రామరావు తదితరులు పాల్గొన్నారు. రేపు (15.12.2023) నుంచి ఈ ప్రచారం రథం 24వ తేదీ వరకూ 10 రోజుల పాటు విజయవాడ నుంచి శ్రీకాకుళం జిల్లాలోని వివిధ గ్రామాల్లో గ్రామోత్సవాన్ని నిర్వహించనున్నారు.

Indrakeeladri: హిందూధర్మ ప్రచారానికి శ్రీకారం.. దుర్గమ్మ ప్రచార రథం ప్రారంభం.. రేపటి నుంచి వివిధ గ్రామాల్లో గ్రామోత్సవం..
Kanaka Durga
Follow us
P Kranthi Prasanna

| Edited By: Surya Kala

Updated on: Dec 14, 2023 | 8:44 PM

హిందూ ధర్మప్రచారంతో పాటు,  శ్రీ శోభకృత్ నామ సంవత్సర భవానీ దీక్షకు సంబంధించిన ధర్మ ప్రచారం చేయడానికి ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. అమ్మవారి ధర్మ ప్రచార రథాన్ని ప్రజలవద్దకు తీసుకుని వెళ్ళడానికి శ్రీకారం చుట్టింది. వైదిక కమిటీ ఆధ్వర్యంలో ఏపీలోని వివిధ గ్రామాల్లో గ్రామోత్సవాన్ని నిర్వహించడానికి ఈ రోజు దుర్గామల్లేశ్వర స్వామి, అమ్మవార్లకు పూజలు చేసి ప్రచర రథాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈఓ కె ఎస్ రామరావు తదితరులు పాల్గొన్నారు. రేపు (15.12.2023) నుంచి ఈ ప్రచారం రథం 24వ తేదీ వరకూ 10 రోజుల పాటు విజయవాడ నుంచి శ్రీకాకుళం జిల్లాలోని వివిధ గ్రామాల్లో గ్రామోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఏ రోజు ఏ ఎయె ప్రాంతాల్లో అమ్మవారు పూజలను అందుకోనున్నారో పూర్తి వివరాలను తెల్సుకుందాం..

Route Map :

  1. 15-12-2023 న కోరుకొండ , గోకవరం , అడ్డతీగల ( ఏజెన్సీ ప్రాంతములు)
  2. 16-12-2023 న పాపంపేట , జె. అన్నవరం , జడ్డంగి ( ఏజెన్సీ ప్రాంతములు)
  3. ఇవి కూడా చదవండి
  4. 17-12-2023 న ఏ.బి కాలనీ , బుట్టావారి వీధి , పూదేడు
  5. 18-12-2023 న కొత్తవలస , చాపల ఉప్పాడ
  6. 19-12-2023 న తాళ్ళనలస , చీపురుపల్లి , శ్రీకాకుళం ,అరసవిల్లి
  7. 20-12-2023 న నరసన్నపేట ,పోలాకి , రాజారాంపురం , కొత్తరేవు ,కొరివిపేట ,గుల్లవానిపేట ,ఉమ్మలాడ,పిన్నింటిపేట, సంతబొమ్మాళి, టెక్కలి
  8. 21-12-2023 న పలాస,మిలియాపుట్టి,పర్లాకిమిడి,పాతపట్నం,హిరమండలం,శుభలై,కొత్తూరు, సీతంపేట
  9. 22-12-2023 న పాలకొండ , ఆముదాలవలస,వీరఘట్టం ,నాగూరు
  10. 23-12-2023 న గిజబ, పార్వతీపురం,బొబ్బిలి
  11. 24-12-2023 న గొల్లపల్లి , గజపతినగరం, విజయనగరం

అయ్యా గ్రామములలోని ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులు కావలసినదిగా చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వాహణాధికారి కె ఎస్ రామ రావు కోరారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..