Andhra Pradesh: ఏపీలో సంక్షోభంలో లారీ పరిశ్రమ.. రోడ్డున పడుతున్న వందలాది కార్మికులు.. ఆదుకోమంటూ విన్నపం
ఇనుము, స్టోన్ తో పాటు మొక్కజొన్న, పత్తి, వ్యవసాయ ఉత్పత్తులను ఇక్కడ నుండి సుదూర ప్రాంతాలకు తరలిస్తాయి. ఒక్కో ట్రిప్పుకి ఐదు వందల లీటర్ల వరకు డీజిల్ కావాల్సి ఉంది. ఇందుకు ఖర్చు అధికం అవుతుంది. కిరాయి ధర అంతగా పెరగనప్పటికి డీజిల్ ధరలు మాత్రం విపరీతంగా పెరగడంతో లారీ యజమానులు పై అధనపు భారం పడుతోంది. జిల్లావ్యాప్తంగా ఉన్న లారీ యజమానులు నిర్వహణ భారంతో ఇబ్బందులు పడుతున్నారు.
ఒకప్పుడు వేలాది లారీలతో కళకళలాడింది ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలో రెండో అతిపెద్ద సాలూరు లారీ పరిశ్రమ ఇప్పుడు వెలవెలబోతుంది. కరోనా లాక్ డౌన్ తో కుదేలైన లారీ పరిశ్రమకు వరుసగా తగులుతున్న ఎదురు దెబ్బలు మూలిగే నక్క పై తాటి కాయ పడ్డట్టు అయ్యింది. లారీలు తగ్గడంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది కార్మికులు రోడ్డున పడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా తమ రవాణా రంగంతో సేవలు అందించిన సాలూరు లారీ పరిశ్రమ ఇప్పుడు నిర్వహణ భారంతో అల్లాడుతుంది. పెరిగిన డీజిల్, స్పేర్ పార్ట్స్ ధరలు, ప్రభుత్వ పన్నుల భారం ఈ రంగం పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇక్కడ లారీ పరిశ్రమలో సుమారు రెండు వేలకు పైగా లారీలున్నాయి. అంతే కాకుండా విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలితో పాటు ఇతర ప్రాంతాల్లో మరో వెయ్యి వరకు ఉన్నాయి. ఇక్కడ నుండి లారీలు వైజాగ్, రాయపూర్ మధ్య తిరుగుతాయి.
ఇనుము, స్టోన్ తో పాటు మొక్కజొన్న, పత్తి, వ్యవసాయ ఉత్పత్తులను ఇక్కడ నుండి సుదూర ప్రాంతాలకు తరలిస్తాయి. ఒక్కో ట్రిప్పుకి ఐదు వందల లీటర్ల వరకు డీజిల్ కావాల్సి ఉంది. ఇందుకు ఖర్చు అధికం అవుతుంది. కిరాయి ధర అంతగా పెరగనప్పటికి డీజిల్ ధరలు మాత్రం విపరీతంగా పెరగడంతో లారీ యజమానులు పై అధనపు భారం పడుతోంది. జిల్లావ్యాప్తంగా ఉన్న లారీ యజమానులు నిర్వహణ భారంతో ఇబ్బందులు పడుతున్నారు.
అప్పులు చేసి నెలవారీ ఈ ఎమ్ ఐ లతో లారీలు కొన్న యాజమానుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఓ వైపు డౌన్ పేమెంట్ కోసం చేసిన అప్పుల పై పడుతున్న వడ్టీలు, మరోవైపు సమయానికి నెలవారీ ఈ ఎమ్ ఐ లు కట్టలేక అవస్థలు పడుతున్నారు. దీంతో లారీ యజమానులకు ఫైనాన్స్ కంపెనీలు ఇస్తున్న నోటీసులు, అదనపు పెనాల్టిలు మరింత కష్టంగా మారుతుంది. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పెంచుతున్న పన్నులు లారీ యజమానులకు మరింత కష్టతరంగా మారింది. ఇవే కాక లారీలకు సంబంధించిన ఫిట్ నెస్ ఫీజులు దారుణంగా పెరిగిపోవడంతో యజమానుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
లారీల నిర్వహణ కోసం అప్పులు చేసినా కిరాయి డబ్బులు మాత్రం ఆశించిన స్థాయిలో రాకపోవడంతో లారీ యజమానులు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. పన్నుల భారం, నిర్వహణ వ్యయం పెరుగుతుండడంతో చాలామంది యజమానులు తమ లారీలను వచ్చినకాడికి అమ్ముకోగా, మరికొందరు అమ్ముకోవడానికి సిద్ధమవుతున్నారు. చేసిన అప్పుల నుంచి బయట పడలేక, లారీలు నడపలేక యజమానులు ఆర్ధిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న సంక్షోభం నుండి ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు లారీ పరిశ్రమ యజమానులు, కార్మికులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..