- Telugu News Photo Gallery Andhra Pradesh: Why Buying and Selling of Milk is Not Allowed in ganjihalli village kurnool district
Andhra Pradesh: ఆ గ్రామంలో పాలు అమ్మడం నిషేధం.. కొన్ని తరాలుగా ఇదే సంప్రదాయం.. రీజన్ ఏమిటంటే
రైతులకు పాడి పరిశ్రమ ఆదాయాన్ని ఇస్తుంది. పాలు, పాల పదార్ధాల అమ్మకం ద్వారా డబ్బులను సంపాదిస్తారు. అయితే ఈ పాల విక్రయం లేని, జరగని ప్రాంతాన్ని, గ్రామాన్ని చుసామా? విన్నామా? బహుశా..ఉండదేమో? అయితే ఆ గ్రామం లో సంవృద్ది గా పాడి ఉన్నపాటికి ఏ ఒక్కరూ కూడా విక్రయించరు. ఇది గత కొన్ని తరాలుగా ఇలా వస్తోంది. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడ ఉంది. ఎందుకు పాలను అమ్మరో ఈ రోజు తెల్సుకుందాం..
Updated on: Dec 15, 2023 | 9:04 PM

పాడిపరిశ్రమ ఆదాయం తో ఎంతో మంది రైతులు ఆర్ధికంగా అభివృద్ధి చెందుతున్నారు. తమ ఆదాయం ను పెంచుకోవడమే కాదు మరికొందరికి ఆదాయ మార్గాన్ని చూపిస్తున్నారు. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లా లో ఓ గ్రామంలో పాల అమ్మకం అంటే పాపం అంటున్నారు.

ఎమ్మిగనూరు పట్టణం కు 15కి.మీ దూరం లో ఉన్న ఆ గ్రామస్తులు మాత్రం తమ పుర్వీకులు నడచిన మూఢాచారంలో నడుస్తూ తమ ఆదాయాన్ని కోల్పోతున్నారు. అది ఏమిటి అంటే ఆ గ్రామంలో ఎన్ని పాడిపశువులు ఉన్నా ఒకరి కి ఒకరు పాలు అమ్ముకోరు. హొటల్ కు పాలు అమ్మరు. ఎవరి పాలు వారే వాడుకుంటారు.

హొటల్ కు గాని ఇతరులకు గాని పాలు పోస్తే తమ గ్రామ దేవుడు ఐన మహాత్మా బడేసహెబ్ శాపానికి గురై పశువులు ఎరుపురంగు లో పాలు ఇస్తాయని అంతే కాకుండా తమ కుటుంబాలు అనేక ఇక్కట్లు పాలవుమని చెబుతున్నారు.

కర్నూల్ జిల్లా గొనేగండ్ల మండలం గంజాహల్లి గ్రామంలోని ప్రజలు తమ పశువులు ఇచ్చిన పాలను అమ్ముకోరు. అది ఏమిటి అని ఆ గ్రామస్తులను కదిలిస్తే గత కొన్ని సంవత్సరాలు క్రితం తమ పెద్దలకు ఆ ఊరి దేవుడు అయిన మహాత్మా బడెసహెబ్ పెట్టిన ఆచారం అన్నారు. అప్పటి నుండి ఇప్పుటి వరకూ ఈ నమ్మకాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు

ఈ గ్రామస్తులు తాము పాలు అమ్ముకోకుండా.. కొనకుండా తమ అవసరాలకు మాత్రం వాడుకుంటున్నామని వారు పేర్కొన్నారు. పశువులు లేని ప్రజలు మాత్రం పాల కోసం ఎన్ని ఇబ్బందులు పడైనా సరే దగ్గర లో ఉన్న గొనెగండ్ల కు గాని ఎమ్మిగనూర్ పట్టణానికి వెళ్తారు.

ఈ ఆధునిక యుగం లోనూ కొన్ని గ్రామాల ప్రజలు ఇలాంటి మూఢనమ్మకంతో ఆదాయన్ని కోల్పోతున్నారు. ఈ గ్రామం పై జన విజ్ఞన నాయకులూ స్పందించి వీళ్ళలో చైతన్యం తీసుకువస్తే వీరికి కూడా ఆదాయం సమకూరే అవకాశం ఉందని కొందరు చెబుతున్నారు.
