శరీరంలో పోషకాహార లోపం ఉన్నప్పటికీ, దాని లక్షణాలు నాలుకపై వ్యక్తమవుతాయి. నాలుక స్ట్రాబెర్రీ లాగా ఎర్రగా మారితే, శరీరంలో విటమిన్లు లేవని అర్ధం. శరీరంలో విటమిన్ బి లోపం ఉన్నట్లయితే, అలాంటి లక్షణాలు నాలుకపై కనిపిస్తాయి. టీ అలవాటు, ధూమపానం అలవాటు ఉన్న వారి నాలుకపై నల్లటి పూత ఏర్పడుతుంది. అనేక సందర్భాల్లో యాంటీబయాటిక్స్ అధిక మోతాదులో తీసుకోవడం వలన కూడా నాలుకపై నల్లటి పూత ఏర్పడుతుంది.