- Telugu News Photo Gallery Cinema photos Will nandamuri kalyan ram devil movie be a box office success
Devil: ‘డెవిల్’ కౌంట్‌డౌన్ స్టార్ట్.. నందమూరి హీరోకి హిట్ దక్కేనా..
కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిందంటూ స్పీడ్ పెంచుతున్నారు నందమూరి కల్యాణ్‌రామ్. ఆపరేషన్ టైగర్ హంట్ అంటూ రాబోయే సినిమా మీద ట్రైలర్‌తో క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. ఇంతకీ డెవిల్ ట్రైలర్ ఎలా ఉంది? మర్డర్ మిస్టరీకి, సీక్రెట్ ఏజెన్సీకి సంబంధం ఏంటి? శవాలు సాక్ష్యాలు చెప్పడం ఎక్కడైనా చూశారా? అంటూ ఇంట్రస్టింగ్ డైలాగులతో సాగింది డెవిల్ ట్రైలర్ కట్. పీరియాడిక్ కంటెంట్‌తో తెరకెక్కిన సినిమా కావడంతో ప్రతి ఫ్రేమ్‌లోనూ ఆ విషయాలను క్లియర్‌గా చూపించే ప్రయత్నం చేశారు డైరక్టర్, ప్రొడ్యూసర్ అభిషేక్ నామా.
Updated on: Dec 15, 2023 | 8:17 PM

1943లో జరిగే కథ ఇది. బ్రిటీష్ సీక్రేట్ ఏజెంట్‌గా నటిస్తున్నారు కళ్యాణ్ రామ్. అభిషేక్ నామా తెరకెక్కిస్తున్న మిక్సెడ్ టాక్ తో థియేటర్ లో రన్ అవుతుంది.. మరి డెవిల్‌తో స్పై సినిమాల బ్యాడ్ సెంటిమెంట్‌కు కళ్యాణ్ రామ్ బ్రేక్ చెప్తారో లేదో ఈ మూవీ కలెక్షన్స్ బట్టి చూడాలి..

మర్డర్ మిస్టరీకి, సీక్రెట్ ఏజెన్సీకి సంబంధం ఏంటి? శవాలు సాక్ష్యాలు చెప్పడం ఎక్కడైనా చూశారా? అంటూ ఇంట్రస్టింగ్ డైలాగులతో సాగింది డెవిల్ ట్రైలర్ కట్.

పీరియాడిక్ కంటెంట్‌తో తెరకెక్కిన సినిమా కావడంతో ప్రతి ఫ్రేమ్‌లోనూ ఆ విషయాలను క్లియర్‌గా చూపించే ప్రయత్నం చేశారు డైరక్టర్, ప్రొడ్యూసర్ అభిషేక్ నామా.

గతేడాది బింబిసారతో భారీ హిట్ అందుకున్న నందమూరి హీరో, ఈ ఏడాది అమిగోస్‌తో అది రిపీట్ అవుతుందని అనుకున్నారు. పాటలకు, కొన్ని సన్నివేశాలకు మంచి గుర్తింపు వచ్చినా అమిగోస్ ఆకట్టుకోలేకపోయింది.

అందుకే 2023 పేరు మీద ఒక్క హిట్ అయినా రికార్డు చేయాలన్న సంకల్పంతో ఉన్నారు. కల్యాణ్‌రామ్‌కి పర్ఫెక్ట్ హిట్ ఇవ్వాలన్న ఇంటెన్షన్‌తోనే డెవిల్‌లో ప్రతి ఫ్రేమూ క్రియేట్ చేశామని అంటున్నారు డెవిల్ మేకర్స్. డిసెంబర్ 29న స్క్రీన్ మీద లయన్‌ని చూడటానికి మేం రెడీ అంటున్నారు నందమూరి హీరోలు.




